తాప్సీ
బాడీ ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌లో గంటల కొద్దీ వర్కౌట్‌లు చేయాలి. మరి సెన్సాఫ్ హ్యూమర్ సరిగ్గా ఉందో లేదో తెలియాలంటే? ఏంటీ సెన్సాఫ్ హ్యూమర్ పెంచుకోవడానికి కూడా వర్కౌట్స్ ఉంటాయా? అంటే.. అవునంటున్నారు తాప్సీ. అంతేకాదు.. రెగ్యులర్‌గా ఆమె చేస్తుంటారట. ఈ వెరైటీ వర్కౌట్స్ గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘సినిమాలు, షూటింగ్స్, ట్రావెలింగ్.. ఇన్ని టెన్షన్స్ మధ్యలో అభిమానులతో కనెక్ట్ అవుదాం అని సోషల్ సైట్స్ ఓపెన్ చేస్తాం. ఎవరో ఓ ఆకతాయి మనల్ని ఏదో అనేసి ఆనందం పొందుదాం అని చూస్తుంటాడు.
చాలా మంది నెగటివిటీ జోలికి ఎందుకులే అని వదిలేస్తారు. కానీ, నేను మాత్రం వాళ్లను అస్సలు ఉపేక్షించను. విసిరిన బంతిని తిరిగి అదే వేగంతో పంపించడమే సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి మంచి ఎక్సర్‌సైజ్ అంటాను. సరదాగా లైట్ హార్ట్‌తో ఉండే ట్రోలింగ్‌ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎవ్వరూ ఫీల్ అవ్వరు. కానీ, అదే పనిగా టార్గెట్ చేద్దాం అనుకునేవాళ్లను వదిలేయకూడదు. ఓ మాట అనేద్దాం అనుకునే వాళ్లకు అదే మాటతీరుతో వెటకారంగా రిప్లై ఇస్తే నా ఫాలోయర్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. నాకూ ఎక్స్‌ర్‌సైజ్’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment