sense of humour
-
అలాంటి వారినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు
కాన్సాస్ : మనిషి ఆరోగ్యంగా జీవించటానికి నవ్వు ఎంతగా ఉపయోగపడుతుందో మనకు తెలిసిన విషయమే. అయితే నవ్వు వల్ల ఓ జంట మధ్య ప్రేమ బంధం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జంట మనస్పూర్తిగా కలిసి నవ్వుకోవటం వల్ల వారి మధ్య బంధం బలపడుతుంది. అంతేకాదు ఓ జంట మధ్య రిలేషన్ కలతల్లేకుండా కలకాలం సాగాలంటే కమ్యూనికేషన్, సర్దుకుపోయే గుణమే కాదు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎంతో అవసరం. మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ పార్ట్నర్తో మన బంధాన్ని బలోపేతం చేస్తుందని తాజా పరిశోదనల్లో తేలింది. చాలా మంది తమ భాగస్వామికి సెన్స్ హ్యూమర్ ఉండాలని కోరుకుంటున్నట్లు యూనివర్శిటీ ఆఫ్ కెన్సాస్కు చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు. ఎదుటి వ్యక్తిని నవ్వించగలిగే గుణం ఆరోగ్యకరమైన బంధానికి దారితీస్తోందని వెల్లడించారు. జంటలోని ఇద్దరు వ్యక్తులు జోకులు వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటున్నట్లయితే ఆ బంధం మరింత బలంగా ఉంటుందని తెలిపారు. జంటలోని ఓ వ్యక్తికి మాత్రమే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే సరిపోదని ఇద్దరి సెన్స్ ఆఫ్ హ్యూమర్లో పోలికలు ఉండాలని పేర్కొన్నారు. అంతే కాకుండా వ్యక్తిలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ వారిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుందని యూనివర్శిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు చెబుతున్నారు. అందంగా ఉన్నావారి కంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తులనే ఎక్కువగా ఇష్టపడతారని వెల్లడించారు. నవ్వు ఒత్తిడిని తగ్గించే మందు లాగా పనిచేస్తుందని, నవ్వటం ద్వారా మనలో ఆనందాన్ని నింపే హార్మోన్లు విడుదలవుతాయని, తద్వారా ఒత్తిడినుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. నవ్వు ఇద్దరు వ్యక్తులను దగ్గర చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
వాళ్లను అస్సలు ఉపేక్షించను
బాడీ ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌లో గంటల కొద్దీ వర్కౌట్లు చేయాలి. మరి సెన్సాఫ్ హ్యూమర్ సరిగ్గా ఉందో లేదో తెలియాలంటే? ఏంటీ సెన్సాఫ్ హ్యూమర్ పెంచుకోవడానికి కూడా వర్కౌట్స్ ఉంటాయా? అంటే.. అవునంటున్నారు తాప్సీ. అంతేకాదు.. రెగ్యులర్‌గా ఆమె చేస్తుంటారట. ఈ వెరైటీ వర్కౌట్స్ గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘సినిమాలు, షూటింగ్స్, ట్రావెలింగ్.. ఇన్ని టెన్షన్స్ మధ్యలో అభిమానులతో కనెక్ట్ అవుదాం అని సోషల్ సైట్స్ ఓపెన్ చేస్తాం. ఎవరో ఓ ఆకతాయి మనల్ని ఏదో అనేసి ఆనందం పొందుదాం అని చూస్తుంటాడు. చాలా మంది నెగటివిటీ జోలికి ఎందుకులే అని వదిలేస్తారు. కానీ, నేను మాత్రం వాళ్లను అస్సలు ఉపేక్షించను. విసిరిన బంతిని తిరిగి అదే వేగంతో పంపించడమే సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి మంచి ఎక్సర్సైజ్ అంటాను. సరదాగా లైట్ హార్ట్‌తో ఉండే ట్రోలింగ్‌ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎవ్వరూ ఫీల్ అవ్వరు. కానీ, అదే పనిగా టార్గెట్ చేద్దాం అనుకునేవాళ్లను వదిలేయకూడదు. ఓ మాట అనేద్దాం అనుకునే వాళ్లకు అదే మాటతీరుతో వెటకారంగా రిప్లై ఇస్తే నా ఫాలోయర్స్‌కు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. నాకూ ఎక్స్‌ర్‌సైజ్’’ అన్నారు. -
కళ్లు, గోళ్లను బట్టి ఇట్టే చెప్పేస్తా!
మీకెలాంటి మగాడంటే ఇష్టం? అని ఏ కథానాయికను అడిగినా... ‘అతను చాలా మంచివాడు అయ్యుండాలి’ అని కామన్‌గా సమాధానం చెబుతుంటారు. శ్రుతీహాసన్ కూడా అలానే చెప్పారు. దాంతో పాటు తనకు ఎలాంటి మగాళ్లంటే ఇష్టం? ఎదుటి వ్యక్తి తన గురించి ఏమనుకుంటున్నాడో ఎలా తెలుసుకుంటాను? అనే విషయాల గురించి ఈ చెన్నై సుందరి చెబుతూ - ‘‘బేసిక్‌గా నేను మంచి వ్యక్తినే పెళ్లాడాలనుకుంటా. అఫ్కోర్స్ ఎవరైనా అలానే అనుకుంటారనుకోండి. ఆ సంగతి అలా ఉంచితే... అతనికి కొంచెమైనా సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. అతను రాక్‌స్టార్ కాకపోయినా ఫరవాలేదు. ముందు మంచి మనసు ముఖ్యం. అది ఉంటే... ఆ తర్వాత మనకు కావాల్సిన లక్షణాలు అతనిలో ఉండేలా చేయొచ్చు. ఒక మగాడు నా గురించి ఏమనుకుంటున్నాడో అతను నన్ను చూసే విధానాన్ని బట్టి అంచనా వేసేస్తాను. అందుకే ముందు అతని కళ్లను చూస్తాను. ఆ తర్వాత అతని చేతి గోళ్లను కూడా చూస్తాను. మగాళ్లు గోళ్లు కొరుక్కోకూడదని నా బలమైన నమ్మకం. ఎందుకు కొరుక్కోకూడదో నేను చెప్పలేను. కళ్లు, గోళ్లూ చూశాక టోటల్‌గా అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో గమనిస్తాను. పద్ధతి గల మనుషుల బాడీ లాంగ్వేజ్ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. సో... ఏ వ్యక్తి గురించి అయినా ఓ నిర్ణయానికి రావడానికి అతని బాడీ లాంగ్వేజ్ కూడా ఓ కారణ మవుతుంది’’ అన్నారు. -
సింహాలు కూడా నవ్వుతాయి
లండన్: సాధారణంగా అటవీ జంతువుల జీవన శైలిపై చిత్రించిన ఫొటోలు అవి వేటాడుతున్నట్లుగానో లేదా.. గుర్రుపెట్టి నిద్ర పోతున్నట్లుగానో, లేదంటే భయంతో పరుగెత్తుతున్నట్లుగానో కనిపిస్తుంటాయే తప్ప హాయిగా ఆనందంగా చక్కగా నవ్వుకుంటూ కనిపించే ఫొటోలు మాత్రం చాలా అరుదు. అయితే, కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డు కోసం కొందరు ఫొటో గ్రాఫర్లు చిత్రించిన ఫొటోలు చూస్తే మాత్రం మృగరాజు కూడా నవ్వుతాడని, పరుగులో రారాజైన చిరుత కూడా చక్కగా ఒళ్లు విరుచుకుంటూ పల్లు ఇకిలిస్తుందని, ఉడుత, పక్షి ఇలా ఒక్కటేమిటి అటవీ జంతూ జాలం మొత్తం కూడా మనలాగే హాస్య గ్రంథులను కలిగి నవ్వుతాయని తెలిసిపోతుంది.అలా రకరకాల జంతువుల నవ్వుతూ కనిపించిన ఫొటోలను ఎన్నింటినో కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డుల కోసం పంపించి అవార్డుల ఎంపిక దారులను అబ్బురపడేలా చేశారు. -
ఆయన సెన్సాఫ్ హ్యూమర్ సూపర్ - శ్రీను వైట్ల
సాగర్‌గారి దగ్గర నేను సహాయ దర్శకునిగా చేస్తున్నప్పుడు నారాయణగారు రచయితగా చేసేవారు. అప్పట్నుంచే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ‘నువ్వు పెద్ద డెరైక్టర్ అవుతావు’ అని ప్రోత్సహించేవారు. ఆయనకు విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. మేం ఇద్దరం మంచి మిత్రులు కావడానికి ఒక రకంగా అదే కారణం. నా తొలి చిత్రం ‘ఆనందం’ నుంచి ఇప్పటివరకు ఒకటీ, రెండు సినిమాల్లో మినహా మిగతా అన్ని చిత్రాల్లోనూ ఆయన నటించారు. ఆ ఒకటి, రెండు చిత్రాలు కూడా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నటించలేకపోయారు. ఆయన మంచి టైమింగ్ ఉన్న నటుడు. ఏ పాత్ర ఇచ్చినా దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లగలిగిన ప్రతిభావంతుడు. హార్డ్ వర్కర్ కూడా. అందుకు నిదర్శనం ‘దూకుడు’ సినిమా. అందులో ఇతర చిత్రాల హీరోలను ఎమ్మెస్‌గారు పేరడీ చేసే సన్నివేశాలున్నాయి కదా. వాటిని ఒకే రోజులో చేసేశారాయన. అన్ని గెటప్స్ మార్చుకుని ఒకే రోజులో చేయడం సులువు కాదు. సూపర్బ్ ఎనర్జీ ఉన్న నటుడు. ఆయన్ని కోల్పోవడం బాధాకరం. -
కొలువుకు హాస్య గుళిక!
న్యూయార్క్: జాబ్ కోసం వెతుకుతున్నారా? ఇంటర్వ్యూల్లో మార్కులు కొట్టేసేందుకు పుస్తకాల మీద పుస్తకాలు తిరగేస్తున్నారా? కాసేపు ఆగండి.. ఇదొక్కటే మీకు ఉద్యోగం తెచ్చిపెట్టదు! కాస్త హాస్య చతురత నేర్చుకోండి. దానికి కాస్త కలివిడితనం జోడించండి. అప్పుడే మీరు కోరుకున్న ఉద్యోగం మీ వద్దకు నడిచివస్తుందని చెబుతోంది అమెరికాకు చెందిన ఓ సంస్థ! ఒక ఉద్యోగానికి సమాన ప్రతిభ ఉన్న ఇద్దరు అభ్యర్థులు పోటీ పడితే వారిలో.. హాస్య చతురత ఉన్నవారికే జాబ్ దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుందని కెరీర్ బిల్డర్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనితోపాటు సామాజిక అంశాలపై అవగాహన, శారీరకంగా దృఢంగా ఉండడం, చక్కని దుస్తులు ధరించడం వంటి అంశాలు కూడా ఉద్యోగం తెచ్చిపెడతాయని ఆ సంస్థ తెలిపింది. ఇలాంటి అభ్యర్థులనే తాము ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నట్లు ఇంటర్వ్యూలు నిర్వహించేవారు చెప్పినట్లు వివరించింది. దాదాపు 2 వేల మంది మానవ వనరుల విభాగం(హెచ్ఆర్) సిబ్బంది, ఇంటర్వ్యూ బోర్డు సభ్యులతో మాట్లాడిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు కెరీర్ బిల్డర్ పేర్కొంది. అలాగే ఆఫీసుకు ఆలస్యంగా రావడం, తొందరగా వెళ్లిపోవడం, ఇతరులపై చాడీలు చె ప్పడం వల్ల చాలామంది పదోన్నతులు పొందలేకపోతున్నారని సర్వేలో తేలింది. -
కొలువుకు హాస్య గుళిక!
న్యూయార్క్: జాబ్ కోసం వెతుకుతున్నారా? ఇంటర్వ్యూల్లో మార్కులు కొట్టేసేందుకు పుస్తకాల మీద పుస్తకాలు తిరగేస్తున్నారా? కాసేపు ఆగండి.. ఇదొక్కటే మీకు ఉద్యోగం తెచ్చిపెట్టదు! కాస్త హాస్య చతురత నేర్చుకోండి. దానికి కాస్త కలివిడితనం జోడించండి. అప్పుడే మీరు కోరుకున్న ఉద్యోగం మీ వద్దకు నడిచివస్తుందని చెబుతోంది అమెరికాకు చెందిన ఓ సంస్థ! ఒక ఉద్యోగానికి సమాన ప్రతిభ ఉన్న ఇద్దరు అభ్యర్థులు పోటీ పడితే వారిలో.. హాస్య చతురత ఉన్నవారికే జాబ్ దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుందని కెరీర్ బిల్డర్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనితోపాటు సామాజిక అంశాలపై అవగాహన, శారీరకంగా దృఢంగా ఉండడం, చక్కని దుస్తులు ధరించడం వంటి అంశాలు కూడా ఉద్యోగం తెచ్చిపెడతాయని ఆ సంస్థ తెలిపింది. ఇలాంటి అభ్యర్థులనే తాము ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నట్లు ఇంటర్వ్యూలు నిర్వహించేవారు చెప్పినట్లు వివరించింది. దాదాపు 2 వేల మంది మానవ వనరుల విభాగం(హెచ్ఆర్) సిబ్బంది, ఇంటర్వ్యూ బోర్డు సభ్యులతో మాట్లాడిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు కెరీర్ బిల్డర్ పేర్కొంది. అలాగే ఆఫీసుకు ఆలస్యంగా రావడం, తొందరగా వెళ్లిపోవడం, ఇతరులపై చాడీలు చె ప్పడం వల్ల చాలామంది పదోన్నతులు పొందలేకపోతున్నారని సర్వేలో తేలింది.