సింహాలు కూడా నవ్వుతాయి
లండన్: సాధారణంగా అటవీ జంతువుల జీవన శైలిపై చిత్రించిన ఫొటోలు అవి వేటాడుతున్నట్లుగానో లేదా.. గుర్రుపెట్టి నిద్ర పోతున్నట్లుగానో, లేదంటే భయంతో పరుగెత్తుతున్నట్లుగానో కనిపిస్తుంటాయే తప్ప హాయిగా ఆనందంగా చక్కగా నవ్వుకుంటూ కనిపించే ఫొటోలు మాత్రం చాలా అరుదు.
అయితే, కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డు కోసం కొందరు ఫొటో గ్రాఫర్లు చిత్రించిన ఫొటోలు చూస్తే మాత్రం మృగరాజు కూడా నవ్వుతాడని, పరుగులో రారాజైన చిరుత కూడా చక్కగా ఒళ్లు విరుచుకుంటూ పల్లు ఇకిలిస్తుందని, ఉడుత, పక్షి ఇలా ఒక్కటేమిటి అటవీ జంతూ జాలం మొత్తం కూడా మనలాగే హాస్య గ్రంథులను కలిగి నవ్వుతాయని తెలిసిపోతుంది.అలా రకరకాల జంతువుల నవ్వుతూ కనిపించిన ఫొటోలను ఎన్నింటినో కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డుల కోసం పంపించి అవార్డుల ఎంపిక దారులను అబ్బురపడేలా చేశారు.