
ఆర్యతో అలాంటిదేం లేదు
బాలీవుడ్ తర్వాత గాసిప్స్ పుట్టించాలంటే కోలీవుడ్డే. చిన్న విషయం దొరికినా చాలు... దాన్ని ఈజీగా చాటంత చేసేస్తారక్కడ. దాదాపుగా స్టార్ హీరోయిన్లందరూ అక్కడి గాసిప్పులకు బలైనవారే.
బాలీవుడ్ తర్వాత గాసిప్స్ పుట్టించాలంటే కోలీవుడ్డే. చిన్న విషయం దొరికినా చాలు... దాన్ని ఈజీగా చాటంత చేసేస్తారక్కడ. దాదాపుగా స్టార్ హీరోయిన్లందరూ అక్కడి గాసిప్పులకు బలైనవారే. ఇప్పుడు తాప్సీ వంతు వచ్చింది. ‘ఆరంభం’ సినిమాలో ఆర్యతో తాప్సీ జత కట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా అక్కడ మంచి హిట్. ఆర్య, తాప్సీ పెయిర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీన్నే అదనుగా తీసుకొని ఆర్య, తాప్సీ ప్రేమలో ఉన్నారంటూ ఓ గాసిప్పును క్రియేట్ చేసేసింది కోలీవుడ్ మీడియా. చెన్నయ్‌లో ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపిస్తున్నారని, వీరి ప్రేమ పెళ్లి దాకా కూడా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని ఈ గాసిప్ సారాంశం. తిరుమేణి దర్శకత్వంలో ఆర్య ఓ చిత్రంలో నటించనున్నారు.
ఈ చిత్రంలో కథానాయికగా తాప్సీని పెట్టాల్సిందే అని సదరు చిత్ర దర్శక, నిర్మాతలపై ఆర్య వత్తిడి తెస్తున్నట్లు మరో గాసిప్ కూడా ప్రచారంలో ఉంది. ఇవన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో ఓ వైపు తాప్సీ, మరోవైపు ఆర్య ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దీనిపై తాప్సీ స్పందిసూ ్త-‘‘ ‘ఆరంభం’ షూటింగ్ కంప్లీట్ అయ్యాక.. కేవలం రెండుమూడు సార్లు ఆర్యను కలిశాన్నేను. కోస్టార్‌గా ఆర్యను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. నేనూ అంతే. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఇంకేమీ లేదు. అసలు ఈ గాసిప్పులు ఎలా పుట్టాయో నాకు అర్థం కావడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.