స్టయిలిష్ ఆట | attam aarambam movie releases on 6th december | Sakshi
Sakshi News home page

స్టయిలిష్ ఆట

Published Sat, Nov 23 2013 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

స్టయిలిష్ ఆట

స్టయిలిష్ ఆట

అజిత్, నయనతార ఓ జంటగా, ఆర్య, తాప్సీ మరో జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘ఆరంభం’. ఓ కీలక పాత్రను రానా చేసిన ఈ చిత్రానికి విష్ణువర్థన్ దర్శకత్వం వహించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాని ‘ఆట ఆరంభం’ పేరుతో ఓమిక్స్ క్రియేషన్స్ అధినేత డా. శీనుబాబు .జి తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ఈ 24న పాటలను, వచ్చే నెల 6న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా శీనుబాబు మాట్లాడుతూ - ‘‘తమిళంలో ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించింది.
 
  వసూళ్లపరంగా కొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో రానా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అంత అద్భుతంగా నటించారు. అజిత్ నటన, నయనతార, తాప్సీ అందచందాలు, యువన్‌శంకర్‌రాజా స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్టయిలిష్ దర్శకుడిగా గుర్తింపు ఉన్న విష్ణువర్థన్ టేకింగ్ ఓ హైలైట్. వాణిజ్య అంశాలు మెండుగా ఉన్న ఈ చిత్రం తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement