ఆ రెండూ నిజమేనా? | nayan in chiranjeevi 150th movie? | Sakshi
Sakshi News home page

ఆ రెండూ నిజమేనా?

Published Thu, Jan 7 2016 11:06 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

ఆ రెండూ నిజమేనా?

ఆ రెండూ నిజమేనా?

పడినా లేవడం నయనతారకే చెల్లింది. ఇక నయన పని అయిపోయిందను కున్న ప్రతిసారీ ఏదో ఒక బ్లాక్ బస్టర్‌తో బాక్సాఫీస్ దగ్గర హల్‌చల్ చేస్తున్నారు. గ్లామర్ ఒలకబోయడంతో పాటు బాగా పెర్ఫార్మ్ చేయగలరు కాబట్టి, నయనతారకు ఎప్పుడూ ఫుల్  డిమాండ్. యంగ్ హీరోస్‌తో పాటు సీనియర్ హీరోలు కూడా ఆమెను ఫస్ట్ లిస్ట్‌లో పెడుతుంటారు. ప్రస్తుతం నయనతార గురించి రెండు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అవి వదంతులా? నిజమా? అన్నది తెలియాల్సి ఉంది. ఆ రెండు వార్తల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందనున్న 150వ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం నయనతారను వరించనుందని సమాచారం.
 
  ఇది తమిళ ‘కత్తి’ రీమేక్ అని తెలిసిందే. తెలుగుకి అనుగుణంగా చిత్రదర్శకుడు వీవీ వినాయక్ కావల్సిన మార్పులన్నీ చేసేశారట. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందట. ఇక, మరో వార్త గురించి చెప్పాలంటే.. ఇది తమిళ చిత్రానికి సంబంధించినది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సరసన నయనతార ఓ చిత్రంలో జత కట్టనున్నారనే వార్త షికారు చేస్తోంది. ‘బిల్లా’, ‘ఏగన్’, ‘ఆరంభం’ చిత్రాల్లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూడు చిత్రాల ద్వారా మంచి జోడీ అనిపించుకున్నారు. ఇప్పుడు నాలుగో సారి జతకట్టబోయేది శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి అని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement