హీరో షారుక్ ఖాన్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ హీరోగా నటిస్తున్న ‘పటాన్’ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో షారుక్ చేస్తున్న సినిమా కూడా ప్యాచ్‌వర్క్ మినహా పూర్తయింది. ఈ రెండు సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే తాజాగా దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి(‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, 3 ఇడియట్స్, పీకే’ ఫేమ్) దర్శకత్వంలో షారుక్‌ఖాన్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది.
లేటెస్ట్గా ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందన్నది బాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో పంజాబ్ లొకేషన్ సెట్స్ వేశారు చిత్ర యూనిట్. దాదాపు ఇరవై రోజులు ఇక్కడే షూటింగ్ జరుగుతుందట. ఆ తర్వాత విదేశీ లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశారు షారుక్ అండ్ కో. అక్రమంగా పాస్‌పోర్టులు పొంది విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment