
ప్రేమలో పడిన తాప్సీ?
ముంబై: ‘వస్తాడు నా రాజు’... ఇది తెలుగులో తాప్సీ నటించిన సినిమా. కానీ నిజ జీవితంలో మాత్రం తాప్సీకి రాజు వచ్చేశాడు. మథియాస్ బో అనే డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడితో తాప్సీ ప్రేమలో పడింది. గత ఏడాది ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) సందర్భంగా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.
లక్నో తరఫున మథియాస్ బో ఆడాడు. హైదరాబాద్ హాట్‌షాట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా తాప్సీ లీగ్‌లో మ్యాచ్‌లకు హాజరయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ట్విట్టర్ ద్వారా సందేశాలు పంపుకున్నారు. ఇటీవల తాప్సీ చండీగఢ్‌లో ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ అనే సినిమా షూటింగ్‌లో ఉండగా.. బో భారత్ వచ్చాడు. తాప్సీతో కలిసి డిన్నర్‌కు వెళ్లాడు. అయితే మథియాస్ తన స్నేహితుడని, తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో మాట్లాడనని తాప్సీ చెప్పింది.