
ఓ సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు కథానాయికలు నటించినప్పుడు ‘నువ్వా.. నేనా?’ అని పోటీ పడి నటిస్తారు. అలా గట్టి పోటీ ఇచ్చే పాత్రలైతేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. పాతిక సినిమాలకు పైగా నటించిన తాప్సీ, పట్టుమని పది సినిమాలు కూడా చేయని రితికా సింగ్ ఓ సినిమాకి పచ్చ జెండా ఊపారు.
‘లవర్స్’ ఫేమ్ హరి దర్శత్వంలో ఏమ్‌వీవీ సత్యనారాయణతో కలసి రచయిత కోన వెంకట్ తన కోన ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆది పినిశెట్టి కూడా నటించనున్నారు. హీరో, విలన్, పాజిటివ్ క్యారెక్టర్.. ఏదైనా సై అంటారు ఆది. ఈ చిత్రంలో ‘అంధుడి’గా నటించడానికి ఒప్పుకున్నారట. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల 27న స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment