
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అరుదే!
అలాంటి మంచి కథా చిత్రాలు మరిన్ని రావాలని అంటున్న తాప్సీని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న నటీమణులు హీరోలకు సమానంగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం గురించి ప్రశ్నించగా నిజం చెప్పాలంటే హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు అరుదుగానే వస్తున్నాయని అన్నారు. వాటిలోనూ ఒకటీ అరా చిత్రాలే విజయం సాధిస్తున్నాయని పేర్కొంది. అదీ గాక హీరోల చిత్రాల స్థాయిలో హీరోయిన్ల చిత్రాలకు ఓపెనింగ్స్ రావడం లేదన్నది నిజం అని చెప్పింది. హీరోల చిత్రాలకు ధీటుగా హీరోయిన్ల చిత్రాలకు ఓపెనింగ్స్ వచ్చి సక్సెస్ అయితే సమాన పారితోషికం డిమాండ్ చేసే హక్కు ఉంటుందని ఆమె అన్నారు. ఏడాదిలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో తాను నటించిన చిత్రం ఒక్కటే భారీ ఓపెనింగ్స్ సాధించిందని పేర్కొంది. అయితే హీరోల చిత్రాల ఓపెనింగ్స్‌తో తన చిత్రాన్ని పోల్చకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.