ఓ స్మాల్ టౌన్‌లో పరువు, మర్యాదలే ఆస్తిగా భావించే జాయింట్ ఫ్యామిలీ అది! అందులోని వాళ్లందరూ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. కానీ, సడన్‌గా వారికి సంబంధంలేని ఒక వివాదంలో చిక్కుకున్నారు. అసలు ఆ వివాదం ఏంటి? కోర్టులో వారికి న్యాయం జరిగిందా? అన్న అంశాల ఆధారంగా బాలీవుడ్‌లో ‘ముల్క్’ అనే చిత్రం రూపొందింది. ‘గులాబ్ గ్యాంగ్’, ‘తుమ్ బిన్ 2’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అభినవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రిషీ కపూర్, పత్రీక్ బాబర్, తాప్సీ, రజత్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య తారలుగా నటించారు.
ఈ సోషియో థ్రిల్లర్ మూవీలో తాప్సీ లాయర్‌గా కనిపించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మెయిన్‌గా వారణాసి, లక్నోలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘కొన్ని హార్ట్ టచింగ్ మూవీస్ ఉంటాయి. అందులో ‘ముల్క్’ ఒకటి. ఇది రీల్ స్టోరీ కాదు. స్టోరీ ఎబౌట్ రియాలిటీ. మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. లక్నోలో షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగా అనిపించింది. సహకరించిన ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు తాప్సీ. ‘బేబి’, ‘పింక్’, ‘జుడ్వా–2’ వంటి హిందీ హిట్స్‌లో తాప్సీ నటించన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment