Rajat Kapoor
-
మీటూ వివాదంలో మరో నటుడు
సాక్షి, ముంబై: బాలీవుడ్ ప్రముఖులు నానా పటేకర్, వికాస్ . మీటూ డిబేట్లో నానుతుండగా ఈ కోవలో నటుడు, చిత్రనిర్మాత రజత్ కపూర్(57) చేరారు. నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా ఆరోపణల నేపథ్యంలో లైంగిక వేధింపులకు సంబంధించి మహిళల భయానక అనుభవాలు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. రజత్ కపూర్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారంటూ తాజాగా జర్నలిస్టు సంధ్యా మీనన్ తన అనుభవాన్ని ట్విటర్ వేదికపై పంచుకున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన రజత్ కపూర్ ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలిపారు. జరిగినదాని పట్ల మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నానని ట్వీట్ చేశారు. మంచిపనుల ద్వారా జీవితమంతా మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించాను. అయినా నాచర్యల ద్వారా లేదా పదాల ద్వారా బాధపెట్టి వుంటే.. క్షమించండి. దయచేసి క్షమాపణను స్వీకరించమంటూ ట్వీట్ చేశారు. ‘మంచి మనిషిగా ఉండటమే నాకు ముఖ్యం. అలా వుండటానికే ప్రయత్నించాను. ఇకపై మరింత దృఢంగా ప్రయత్నిస్తాను’ అని రజత్ కపూర్‌లో ట్విటర్లో పేర్కొన్నారు. 2007లో ఒక టెలిఫోన్ ముఖ్యాముఖి సందర్భంగా రజత్ కపూర్ వేధింపులకు గురి చేశారని, జర్నలిస్టు సంధ్యా మీనన్ ట్విటర్లో ఆరోపించారు. తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ దాదాపు పదేళ్ల కిందటి అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందనీ, లైంగికంగా వేధించారంటూ మరో మహిళ వెలుగులోకి వచ్చారు. సౌరభ్ శుక్లా ఫోన్ నుంచి కాల్స్ చేస్తూ రజత్ కపూర్ తరచూ తనను వేధింపులకు గురి చేశారని అమెరికాకు చెందిన యువనటి మోడల్, ఆరోపించారు. కపూర్ దుష్ప్రవర్తన గురించి శుక్లాకు తెలుసునని బహుశా ఇద్దరూ కలిసే అమ్మాయిలను మభ్యపెడుతూ ఉండొచ్చన్నారు. I don't even know any more. Filmmaker Rajat Kapoor Two separate and different accounts pic.twitter.com/nBjNOsun3j — Sandhya Menon (@TheRestlessQuil) October 7, 2018 I am sorry from the bottom of my heart- and sad that I was the cause of this hurt to another human being. If there is one thing more important to me than even my work, it is to be a good human being. And I have tried to be that person. And now, I will try harder. — Rajat Kapoor (@mrrajatkapoor) October 7, 2018 -
పరువు, మర్యాదలే ఆస్తి!
ఓ స్మాల్ టౌన్లో పరువు, మర్యాదలే ఆస్తిగా భావించే జాయింట్ ఫ్యామిలీ అది! అందులోని వాళ్లందరూ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. కానీ, సడన్‌గా వారికి సంబంధంలేని ఒక వివాదంలో చిక్కుకున్నారు. అసలు ఆ వివాదం ఏంటి? కోర్టులో వారికి న్యాయం జరిగిందా? అన్న అంశాల ఆధారంగా బాలీవుడ్లో ‘ముల్క్’ అనే చిత్రం రూపొందింది. ‘గులాబ్ గ్యాంగ్’, ‘తుమ్ బిన్ 2’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అభినవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రిషీ కపూర్, పత్రీక్ బాబర్, తాప్సీ, రజత్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య తారలుగా నటించారు. ఈ సోషియో థ్రిల్లర్ మూవీలో తాప్సీ లాయర్‌గా కనిపించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మెయిన్‌గా వారణాసి, లక్నోలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘కొన్ని హార్ట్ టచింగ్ మూవీస్ ఉంటాయి. అందులో ‘ముల్క్’ ఒకటి. ఇది రీల్ స్టోరీ కాదు. స్టోరీ ఎబౌట్ రియాలిటీ. మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. లక్నోలో షూటింగ్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. సహకరించిన ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు తాప్సీ. ‘బేబి’, ‘పింక్’, ‘జుడ్వా–2’ వంటి హిందీ హిట్స్‌లో తాప్సీ నటించన విషయం తెలిసిందే. -
నటుల కంటే కథలు కీలకం
పెద్ద నటుల కోసం కథలను ఫణంగా పెట్టి మార్పులు చేయడం తనకు ఎంతమాత్రమూ ఇష్టముండదని నటుడు, దర్శకుడు రజత్ కపూర్ అంటున్నాడు. కథే తన సినిమాకు నాయకుడని చెప్పాడు. దర్శకుడిగా రఘు రోమియో, మిక్స్డ్ డబుల్స్, మిథ్య వంటి సినిమాలు ఇతనికి మంచి పేరు తెచ్చాయి. ‘నేను తరచూ సినిమాలు తీసే దర్శకుణ్ని కాదు. స్క్రిప్టు రాయడానికి చాలా సమయం తీసుకుంటాను. మననిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలే ప్రధానాంశంగా నా కథలు ఉంటాయి. ఇవన్నీ సామాన్యుల కోసమే. ఎవరైనా ప్రధాన పాత్ర పోషించవచ్చు. పెద్ద తారల కోసం కథల్లో మార్పులు చేయను’ అని స్పష్టంగా చెప్పాడు. రజత్ తాజాగా ఢిల్లీ నగరం నేపథ్యంగా సాగే ఆఖో దేఖీ సినిమా తీస్తున్నాడు. ఈ హాస్యసినిమా రాజే బావుజీ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ప్రతిరోజూ తాను ఎదుర్కొనే అనుభవాలను దూరంగా ఉండే కుటుంబ సభ్యులతో పంచుకోవడాన్ని ఇందులో చూడవచ్చు. దీని కథ రాయడానికి రజత్‌కు ఎనిమిదేళ్లు పట్టింది. ‘మనకు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అయితే మన కళ్లతో చూసి లేదా అనుభవించిన వాటిని మాత్రమే నమ్ముతాం. ఇలాంటి కథలు ఎంతో మందికి తట్టిఉంటాయి. ఇది హాస్యంతో కూడిన తాత్విక, కుటుంబ సినిమా’ అని వివరించాడు. ఇందులో ప్రధానపాత్రలో సంజయ్‌మిశ్రా, రజత్ కనిపిస్తారు. సంజయ్‌ను దృష్టిలో ఉంచుకొనే ఈ కథ తయారు చేశానని, అతని నటన ఎంతో సహజంగా ఉంటుందని ప్రశంసించాడు. ఆఖో దేఖీని పూర్తిగా ఢిల్లీలోనే తీశారు. ఇది ఈనెల 21న థియేటర్లకు వస్తోంది. తను పుట్టిపెరిగింది పాతఢిల్లీలోనే కాబట్టి సినిమా షూటింగ్ అంతా అక్కడే జరిగిందని, ఇందుకోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నామని చెప్పాడు. దిల్ చాహతా హై, కార్పొరేట్, మాన్సూన్ వెడ్డింగ్, భేజాఫ్రై, దస్విదానియా సినిమాల్లో రజత్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.