Ashutosh Rana
-
సృష్టిలో ఏదైనా సాధ్యమే
‘‘గీతాంజలి, త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘విశ్వామిత్ర’. నందితారాజ్, ‘సత్యం’ రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఈ నెల 21న, సినిమాని మార్చి 21న విడుదల చేయనున్నారు. రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది. న్యూజిలాండ్, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసి, ఈ కథ రాసుకున్నా. నందితారాజ్ మధ్యతరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తారు. సృష్టిలో ఏది జరుగుతుందో, ఏది జరగదో చెప్పడానికి మనుషులు ఎవరు? ఇక్కడ ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా సినిమా. సృష్టికి, మనిషి ఊహకు ముడిపెడుతూ తెరకెక్కించాం’’ అన్నారు. విద్యుల్లేఖారామన్, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, ‘చమ్మక్’ చంద్ర, ‘గెటప్’ శ్రీను, ‘రాకెట్’ రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, సంగీతం: అనూప్ రూబెన్స్. -
కథ చెబుతానంటే ఎవరూ వినలేదు
రాజకిరణ్ సినిమా పతాకంపై రాజకిర ణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నందితారాజ్, ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరోయిన్ నందిత గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘న్యూజిలాండ్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం ఇది. అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా ఇందులో యాడ్ చేశాం. నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈ కథను చాలామంది నిర్మాతల దగ్గరకు తీసుకెళ్లాను. వినటానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. అలాంటి సమయంలో కొంచెం ధైర్యం చేసి నేనే రాజకిరణ్ సినిమా అనే బ్యానర్‌ను పెట్టాను. షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి అన్నీ సెట్ అయ్యాయి. ఇది హారర్ సినిమా కాదు కానీ హారర్ టచ్ ఉంటుంది. మంచి థ్రిల్లర్ మూవీ. డిసెంబర్ మొదటివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. నందితారాజ్ మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రమిది. దర్శకుడు నాకు చెప్పింది చెప్పినట్లు తీశారు. అశుతోష్ రాణాగారితో పని చేయటం చాలా హ్యాపీగా అనిపించింది’’ అన్నారు. ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘రాజకిరణ్ రెండేళ్ల క్రితం నాకు ఈ కథ చెప్పారు, మంచి హిట్ పాయింట్ అని చెప్పాను. ఓ రోజు ఆయన ఫోన్ ‘మీరే మెయిన్ లీడ్’ అన్నారు. రాజేశ్ మెయిన్ లీడ్ ఏంటి? కొందరు అన్నారు. కానీ మా నిర్మాతలు హిట్ సినిమా తీయటమే ధ్యేయంగా నిర్మించారు’’ అన్నారు. విద్యుల్లేఖా రామన్ మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’ చిత్రం నుంచి నేను రాజకిరణ్ గారికి ఫ్యాన్. ఈ సినిమాలో రాజేశ్‌తో మంచి కామెడీ సన్నివేశాలు ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల, కెమెరా: అనిల్ భండారి, ఎడిటర్: ఉపేంద్ర. -
థ్రిల్లర్ లవ్‌స్టోరీ
నందితా రాజ్, ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రాణా, ప్రసన్న కుమార్, విద్యుల్లేఖా రామన్ ముఖ్య తారలుగా రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, ఎస్. రజనీకాంత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేసిన నటుడు అశుతోష్ రాణా మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా టాలెంట్ ఉంది. ఈ సినిమాలో నేను పొసెసివ్ భర్త పాత్రలో నటిస్తున్నాను. రాజ్‌కిరణ్ చక్కగా తెరకెక్కిస్తున్నారు. సినిమా పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘హారర్, కామెడీ జానర్ సినిమాలకు నాంది పలికిన రాజ్‌కిరణ్‌గారి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అన్నారు బీవీఎస్ రవి. ‘‘ప్రస్తుతం హారర్, థ్రిల్లర్ జానర్లదే హవా. యూఎస్, స్విట్జర్లాండ్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటి సిట్టింగ్‌లోనే సినిమా ఓకే చేసిన నిర్మాతలకు థ్యాంక్స్. ‘సత్యం’ రాజేశ్‌ని హీరోగా సెలెక్ట్ చేసుకున్నాను. కొంతమంది హీరోయిన్స్‌ను సంప్రదించినప్పుడు ‘సత్యం’ రాజేశ్ హీరో అని చెప్పగానే కొందరు డ్రాప్ అయ్యారు. సినిమాలో నటించడానికి ఒప్పుకున్న నందితా రాజ్‌కు థ్యాంక్స్. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. ‘‘ఏడాదిన్నర క్రితం రాజ్‌కిరణ్‌గారు ఓ పాయింట్ చెప్పారు. బాగుంది. కథ పరంగా నాది హీరో క్యారెక్టర్ కాదు. అశుతోష్ రాణాగారు, మల్లికగారు, మాధవిగారు నాకన్నా ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లో కనిపిస్తారు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్. ‘‘ఇదొక థ్రిల్లర్ లవ్‌స్టోరీ. ఇప్పటివరకు తెలుగులో రాని కథాంశంతో రూపొందిస్తున్నాం’’ అన్నారు మాధవి. -
పరువు, మర్యాదలే ఆస్తి!
ఓ స్మాల్ టౌన్లో పరువు, మర్యాదలే ఆస్తిగా భావించే జాయింట్ ఫ్యామిలీ అది! అందులోని వాళ్లందరూ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. కానీ, సడన్‌గా వారికి సంబంధంలేని ఒక వివాదంలో చిక్కుకున్నారు. అసలు ఆ వివాదం ఏంటి? కోర్టులో వారికి న్యాయం జరిగిందా? అన్న అంశాల ఆధారంగా బాలీవుడ్లో ‘ముల్క్’ అనే చిత్రం రూపొందింది. ‘గులాబ్ గ్యాంగ్’, ‘తుమ్ బిన్ 2’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అభినవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రిషీ కపూర్, పత్రీక్ బాబర్, తాప్సీ, రజత్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య తారలుగా నటించారు. ఈ సోషియో థ్రిల్లర్ మూవీలో తాప్సీ లాయర్‌గా కనిపించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మెయిన్‌గా వారణాసి, లక్నోలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘కొన్ని హార్ట్ టచింగ్ మూవీస్ ఉంటాయి. అందులో ‘ముల్క్’ ఒకటి. ఇది రీల్ స్టోరీ కాదు. స్టోరీ ఎబౌట్ రియాలిటీ. మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. లక్నోలో షూటింగ్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. సహకరించిన ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు తాప్సీ. ‘బేబి’, ‘పింక్’, ‘జుడ్వా–2’ వంటి హిందీ హిట్స్‌లో తాప్సీ నటించన విషయం తెలిసిందే. -
నువ్వు బినామీ అయితే... నేను సునామీ!
‘నమస్తే పెద్దిరెడ్డిగారూ...’ ఆహా... పెద్దిరెడ్డి అంటే ఈ భూమారెడ్డికి ఎంత మర్యాదా... ఎంత మర్యాద! అంతేనా? అదిగో... ఈ భూమారెడ్డి వెళ్లి ఆ పెద్దిరెడ్డి కాళ్ల దగ్గర కూర్చొని ఏమంటున్నాడో చూడండి... ‘నిన్న కురిసిన వానకు నేడు మొలకెత్తిన మొలకలం. మేము ఎంత గొప్పవాళ్లమైనా... నీ ముందు ఇంతే కదయ్యా’ వినయం సంగతి అటుంచండి... క్లారిటీ సంగతి చూడండి... హీరో భుజం మీద చెయ్యి వేస్తాడు భూమారెడ్డి... హీరో ఊరుకుంటాడా ఏమిటి? ‘చేయి తీయ్’ అంటాడు. ‘తీయకపోతే?’ అని అడుగుతాడు భూమారెడ్డి. ‘తీస్తాను’ అంటాడు హీరో. ‘ఏ చెయ్యి తీస్తావు? కుడి చెయ్యా? ఎడమ చెయ్యా’ అని క్లారిటీగా అడుగుతాడు భూమారెడ్డి. అలా అని అతని ప్రతి మాటలోనూ క్లారిటీ ఉంటుందని కాదు... ‘లవ్వు సెయ్యెద్దాన్నానుగానీ... పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలిగానీ... లవ్వొద్దు’ అని క్లారిటీ లేకుండా కూడా మాట్లాడగలడు. ఆశుతోష్ రాణా విలనిజానికి ఎన్ని షేడ్స్ ఉన్నాయో ‘బంగారం’ సినిమాలో భూమారెడ్డి పాత్ర చెప్పకనే చెబుతుంది. ‘స్టార్’ కావాలని ఎవరికి మాత్రం ఉండదు. మరి అశుతోష్ అలా అంటాడేమిటి? ఇంతకీ ఏమిటంటాడు? ‘స్టార్’గా కంటే ‘యాక్టర్’గా ఉండడమే ఎక్కువ ఇష్టం అంటున్నాడు. ఒక్కసారి ‘స్టార్’ అయిన తరువాత ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేయాల్సివస్తుంది... అంటాడు ఆశుతోష్. అందుకేనేమో... ‘భిన్నమైన పాత్రలు’ పోషించే నటుడిగా ఆయనకు ప్రేక్షకుల్లో మంచి పేరొచ్చింది. ‘‘చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తున్నానా? అనే సందేహం వచ్చినప్పుడు... ఎవరో వచ్చి... కొద్దిగా రూట్ మార్చమని సలహా ఇవ్వడం కాదు... మనకు మనమే మార్చుకోవాలి.’’ అంటున్నాడు ఆశుతోష్. ఆయన మాటలు కాస్త జాగ్రత్తగా వింటే హీరో, విలన్ అనే కాన్సెప్ట్‌కు కాలం చెల్లిందా? అనే సందేహం కూడా కలుగుతుంది. ‘నటన ముఖ్యం’ అనే సత్యం మది తెర మీద తళుక్కున మెరుస్తుంది. ఆశుతోష్ రాణా రామ్‌నారాయణ్ నిఖ్రా మధ్యప్రదేశ్‌లోని గడర్వార నగరంలో జన్మించాడు. ప్రాథమిక విద్య అక్కడే పూర్తయింది. ‘రామ్‌లీల’లో రావణుడిగా ఎక్కువగా నటించేవాడు. విలన్ పాత్రలో ఉండే మజా ఏమిటో అప్పుడే తెలిసిందేమో! తన ఆధ్యాత్మిక గురువు ప్రభాకర్ శాస్త్రి్త్ర సలహా ప్రకారం ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చేరాడు. మహేష్‌భట్ డెరైక్ట్ చేసిన 500 ఎపిసోడ్ల టీవి సీరియల్ ‘స్వాభిమాన్’లో ‘రోనీ’ పాత్రతో ప్రేక్షకులను పలకరించాడు ఆశుతోష్. ‘రెండవ ఛాన్సు’ కోసం ఎదురుచూడకుండానే అవకాశాలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ సినిమా ‘దుష్మన్’లో ‘కోల్డ్ బ్లడెడ్ మర్డరర్’ ‘సైకోపాత్ కిల్లర్’గా తన విలనిజాన్ని వీరలెవెల్లో ప్రదర్శించాడు ఆశుతోష్. కెరీర్ ప్రారంభంలోనే తన నటనతో ‘పాత్ర’కు బలాన్ని ఇచ్చాడు. ‘లక్’ అనేదానికి రాణా ఇచ్చిన నిర్వచనం ఇది... ‘కష్టానికి, అవకాశం తోడైతే... అదే లక్’ అందుకే ‘లక్’ ఉంటే పాత్ర క్లిక్ అవుతుంది. ‘లక్’ ఉంటే అవకాశాలు వస్తాయి. ‘లక్’ ఉంటే కెరీర్ ఊపందుకుంటుంది... ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు ఆశుతోష్ రాణా. అందుకే ‘సాధన’కు ఎప్పుడూ దూరం కాలేదు. దాని ప్రభావం వృథా పోలేదు. ‘ఆశుతోష్ రాణా అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడు’ అనిపించుకున్నాడు. ‘ఇది నటన’ ‘ఇది మాత్రమే నటన’ అని కొలవడానికి సాధనాలేమీ లేవు అంటున్న రాణా... ప్రతి నటుడిలోని తనదైన వైవిధ్యం ఉంది అంటాడు. ఆ వైవిధ్యం చూపించడమే ‘ప్రతిభ’ అంటాడు. ‘నటనలో దమ్ముంటే... విలన్‌లోనూ హీరోను చూపించవచ్చు’ అని నమ్ముతాడు రాణా. బాలీవుడ్లో ఎన్ని రకాల పాత్రలు చేసినా... దక్షిణాది చిత్రాల్లో మాత్రం... ఆశుతోష్= విలన్! ‘వెంకీ’ ‘బంగారం’ ‘ఒక్క మగాడు’ ‘విక్టరీ’ ‘బలుపు’ ‘తడాఖా’ ‘పటాస్’ ‘చుట్టాలబ్బాయి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే మన ‘ఉత్తమ విలన్’ అయ్యాడు. పోటీలోనే కాదు. జీవితంలోను గెలవనోడు బతకకూడదు. (బంగారం సినిమాలో డైలాగ్) -
నటి ట్వీట్‌కు స్పందించి మంత్రి సాయం
ముంబై: బాలీవుడ్ నటి రేణుక సహాని చేసిన ట్వీట్‌కు రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెంటనే స్పందించారు. అనారోగ్యానికి గురైన రేణుక వదినకు వెంటనే సాయం చేయాల్సిందిగా రైల్వే అధికారులను మంత్రి ఆదేశించారు. రేణుక భర్త అశుతోష్ రాణా సోదరి అయిన కామిని గుప్తా (63) ఢిల్లీ నుంచి ముంబైకి సువిధ ఎక్స్‌ప్రెస్‌లో ఒంటరిగా ప్రయాణిస్తోంది. శనివారం రాత్రి ఆమె రేణుకకు ఫోన్ చేసి, తనకు అస్వస్థతగా ఉందని చెప్పింది. రేణుక వెంటనే రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్వీట్ చేసి, సాయం చేయాల్సిందిగా కోరింది. మంత్రి ఆదేశాల మేరకు కొన్ని నిమిషాల్లోనే రైల్వే అధికారులు రేణుకను సంప్రదించి వివరాలు అడిగారు. రైలు రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌కు వెళ్లేసరికి అక్కడ వైద్యులు బృందం సిద్ధంగా ఉన్నారు. ఛాతినొప్పితో బాధపడుతున్న కామినికి వైద్యులు చికిత్స చేశారు. తాను మంత్రికి ట్వీట్ చేసిన తర్వాత కేవలం 15 నిమిషాల్లోపే తన వదినకు వైద్యులు చికిత్స చేశారని రేణుక తెలిపారు. కామిని ఎలాంటి సమస్య లేకుండా ముంబైకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారని చెప్పింది. సమస్యల్లో ఉన్న ప్రయాణికులు ఎవరు ట్వీట్ చేసినా రైల్వే మంత్రి వెంటనే స్పందిస్తారని, వివరాలు తెలుసుకుని సాయం చేయాల్సిందిగా ఆదేశిస్తారని అధికారులు తెలిపారు. -
నవంబర్ 10న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: క్రిష్ (దర్శకుడు), అషుతోష్ రానా (బాలీవుడ్ నటుడు) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్ర సంఖ్య. పుట్టిన తేదీ 10. ఇది రవి సంఖ్య. ఇది రవి సంఖ్య కాబట్టి వీరి జీవితంలో ఈ సంవత్సరం ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పవచ్చు. మంచి మార్పులు వస్తాయి. కొత్త ఉత్సాహంతో కొత్త పనులను అవలీలగా పూర్తి చేస్తారు. అవివాహితులకు వివాహమవుతుంది. పెద్దవారయితే వారి పిల్లలకు వివాహమవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి. పాత స్నేహాలు, బంధువుల స్థానంలో కొత్త స్నేహాలు, బాంధవ్యాలు ఏర్పడతాయి. అయితే మీరు అనుకున్న పనులన్నీ నిరాటంకంగా అవుతుండటం వల్ల మీకు కొద్దిపాటి గర్వం, అహంభావం తలకెక్కి, తోటివారికి దూరం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల మీరు గర్వాన్ని, నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవాలి. కంటికి, గుండెకి సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,5,6,7; లక్కీ కలర్స్: వైట్, రోజ్, బ్రౌన్, క్రీమ్, గోల్డెన్ ; లక్కీ డేస్: ఆది, సోమ, శుక్రవారాలు. సూచనలు: అమ్మవారిని ఆరాధించడం, తల్లిని, తల్లితరఫువారిని ఆదరించడం, అనాథలకు అన్నదానం చేయడం, రోజూ కొంచెంసేపు వెన్నెలలో గడపడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
మళ్లీ బుల్లితెరపైకి ఆశుతోష్
న్యూఢిల్లీ: అద్భుతమైన విలనీతో ప్రేక్షకులను మెప్పించే ఆశుతోష్ రాణా మళ్లీ బుల్లితెరవైపు వెళ్తున్నాడు. అయితే ఈసారి మనోడి గాలి రాజకీయాలవైపునకు మళ్లింది. ‘భారత్ భత్య విధాత: లోక్తంత్ర కా మేకోవర్’ పేరుతో నిర్వహించే రాజకీయ చర్చాకార్యక్రమానికి రాణా అతిథేయిగా వ్యవహరిస్తాడు. నిరుద్యోగం, మహిళల భద్రత, అవినీతి అంశాలపై ఇందులో చర్చలు ఉంటాయి. ఎంతో జనాదరణ పొందిన టీవీ సీరియల్ స్వాభిమాన్ ద్వారా రాణా బుల్లితెరకు పరిచయమయ్యాడు. నాలుగేళ్ల తరువాత తిరిగి టీవీతెరపై దర్శనమివ్వనున్నాడు. జీన్యూస్ ఈ నెల 16 నుంచి ప్రసారం చేస్తున్న ‘నిషాన్ పే’ షోను కూడా ఈ 45 ఏళ్ల నటుడు నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో రాణా సామాన్యుడిగా గొంతుకను వినిపిస్తాడు. ‘మన నిత్యజీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ఇందులో ప్రస్తావిస్తాం. ఈ కార్యక్రమం 13 భాగాలుగా ప్రసారమవుతుంది. ప్రజలు లేవనెత్తే ప్రశ్నలకు జవాబులివ్వడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నాయకులు హాజరవుతారు’ అని రాణా వివరించాడు. బుల్లితెరపై మంచి కార్యక్రమాలు రావడం, బాలీవుడ్ తారలు కూడా వీటివైపు మొగ్గు చూపడం మంచి పరిణామమని రాణా అన్నాడు. గోవింద్ నిహ్లానీ సంశోధన్ సినిమా ద్వారా పరిచయమైన ఇతడు.. తదనంతరం దుష్మన్, సంఘర్ష్, హాసిల్లో విలన్‌గా అదరగొట్టాడు. ఇటీవల విడుదలైన కిస్మత్ లవ్ పైసా దిల్లీ రాణా చివరి చిత్రం. ‘స్క్రిప్టుల ఆధారంగానే నేను సినిమాలకు ఒప్పుకుంటాను. కిస్మత్.. సినిమా స్క్రిప్టు నచ్చబట్టే అందులో నటించాను. దురదృష్టవశాత్తూ అది ప్రేక్షకులకు నచ్చలేదు. నేను తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నాను’ అని వివరించిన రాణా పవ న్ క ళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారంలోనూ విలన్‌గా కనిపించాడు. రామ్‌గోపాల్ వర్మ అబ్తక్ చప్పన్-2, డర్టీ పాలిటిక్స్ రాణా తదుపరి సినిమాలు.