నవంబర్ 10న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
క్రిష్ (దర్శకుడు), అషుతోష్ రానా (బాలీవుడ్ నటుడు)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్ర సంఖ్య. పుట్టిన తేదీ 10. ఇది రవి సంఖ్య. ఇది రవి సంఖ్య కాబట్టి వీరి జీవితంలో ఈ సంవత్సరం ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పవచ్చు. మంచి మార్పులు వస్తాయి. కొత్త ఉత్సాహంతో కొత్త పనులను అవలీలగా పూర్తి చేస్తారు. అవివాహితులకు వివాహమవుతుంది. పెద్దవారయితే వారి పిల్లలకు వివాహమవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి. పాత స్నేహాలు, బంధువుల స్థానంలో కొత్త స్నేహాలు, బాంధవ్యాలు ఏర్పడతాయి. అయితే మీరు అనుకున్న పనులన్నీ నిరాటంకంగా అవుతుండటం వల్ల మీకు కొద్దిపాటి గర్వం, అహంభావం తలకెక్కి, తోటివారికి దూరం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల మీరు గర్వాన్ని, నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవాలి. కంటికి, గుండెకి సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
లక్కీ నంబర్స్: 1,2,5,6,7; లక్కీ కలర్స్: వైట్, రోజ్, బ్రౌన్, క్రీమ్, గోల్డెన్ ; లక్కీ డేస్: ఆది, సోమ, శుక్రవారాలు.
సూచనలు: అమ్మవారిని ఆరాధించడం, తల్లిని, తల్లితరఫువారిని ఆదరించడం, అనాథలకు అన్నదానం చేయడం, రోజూ కొంచెంసేపు వెన్నెలలో గడపడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్