ఓ హత్య జరిగింది. కానీ ఈ మర్డర్ ఎలా? ఎందుకు జరిగింది? కథేంటి అనేది తాను నటించిన హిందీ చిత్రం ‘హసీన్ దిల్‌రుబా’లో చూడమని చెబుతున్నారు తాప్సీ. ఈ చిత్రానికి వినిల్ మ్యాథ్యూ దర్శకత్వం వహించారు. విక్రాంత్ మెస్సీ, హర్షవర్థన్ రాణే కీలక పాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ చిత్రం జూలై 2 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. నిజానికి గత ఏడాది ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘‘ఇందులో రాణీ కశ్యప్ పాత్రలో కొత్తగా కనిపిస్తాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది’’ అన్నారు తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment