ఆగడుకి అడగలేదు! | I was not asked to act in "aagadu", says Tapsee pannu | Sakshi
Sakshi News home page

ఆగడుకి అడగలేదు!

Published Tue, Nov 26 2013 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

ఆగడుకి అడగలేదు!

ఆగడుకి అడగలేదు!

గత 30 రోజులుగా తాప్సీ ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’తో బిజీగా ఉన్నారు. హిందీలో ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం పేరిది. ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్‌ను ఇటీవల పంజాబ్‌లో జరిపారు.

గత 30 రోజులుగా తాప్సీ ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’తో బిజీగా ఉన్నారు. హిందీలో ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం పేరిది. ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్‌ను ఇటీవల పంజాబ్‌లో జరిపారు. కాగా, ప్రస్తుతం భాగ్యనగరంలో తాప్సీ గురించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న ‘ఆగడు’లో ఈ ఢిల్లీ భామను రెండో కథానాయికగా తీసుకున్నారన్నదే ఆ వార్త. మొదటి హీరోయిన్‌గా తమన్నాని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో తను నటిస్తున్నానంటూ వచ్చిన వార్త గురించి తాప్సీ స్పందిస్తూ-‘‘వాస్తవానికి ‘ఆగడు’ యూనిట్ నుంచి నన్నెవరూ అప్రోచ్ కాలేదు. ప్రస్తుతం ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నాను. త్వరలో ‘ముని 3’కి సంబంధించిన షెడ్యూల్ ప్రారంభం కానుంది. కొన్ని వారాల క్రితం ఓ పాటకు ప్రాక్టీస్ చేస్తుండగా లారెన్స్ గాయపడ్డారు. దాంతో విశ్రాంతిలో ఉన్నారు. ఈ గ్యాప్‌లో నేను హిందీ సినిమాతో బిజీ అయ్యాను’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement