
నగలంటే నాకెంతో ఇష్టం.. నగల కలెక్షన్ నా ఫేవరెట్.. దీంతోపాటు నా పేరుతో నగలు ఉన్నాయంటే అంతకంటే ఆనందమేంటి.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు.. సూపర్‌స్టార్ మహేష్‌బాబు తనయి సితార ఘట్టమనేని. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో పంజాగుట్టలోని పీఎంజే జ్యువెలర్స్ 40వ స్టోర్‌ను తన తల్లి నమ్రతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో విభిన్న రకాల కలెక్షన్లను సితార ఆవిష్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను హెవీగా ఉండే జ్యువెలరీతో పాటు సందర్భాన్ని బట్టి లైట్ జ్యువెలరీని కూడా ఇష్టపడుతుంటానని చెప్పారు. తన తండ్రి మహేష్‌బాబు యాడ్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందని, తాను బాగా ఎంజాయ్ చేశానని చెప్పారు.
తామిద్దరం ఇంట్లో ఎలా ఉంటామో ఆ యాడ్‌లో కూడా అలాగే చేశామని సితార చెప్పుకొచ్చారు. నటి నమత్ర మాట్లాడుతూ.. సితార, తాను ఎప్పటికప్పుడు గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకుంటామని చెప్పారు. ఏది నచ్చినా అది కొనేస్తుంటామని, సితార ఎక్కువగా సైలెంట్‌గా ఉండటానికి ఇష్టపడుతుందని నమత్ర తెలిపారు.
(చదవండి: 'తోలుబొమ్మలాట'ను సజీవంగా ఉండేలా చేసిందామె..! ఏకంగా రాజధానిలో..)