'మిషన్‌ ఇంపాజిబుల్‌' కోసం 'ఆర్ఆర్ఆర్', 'కేజీయఫ్‌' సందడి.. | Tapsee Mishan Impossible Trailer Released By Mahesh Babu | Sakshi
Sakshi News home page

Mishan Impossible Movie: నవ్వులు పూయిస్తున్న 'మిషన్‌ ఇంపాజిబుల్‌' ట్రైలర్‌..

Published Tue, Mar 15 2022 9:11 PM | Last Updated on Tue, Mar 15 2022 9:18 PM

Tapsee Mishan Impossible Trailer Released By Mahesh Babu - Sakshi

Tapsee Mishan Impossible Trailer Released By Mahesh Babu: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. చాలా కాలం తర్వాత తాప్సీ చేస్తున్న తెలుగు సినిమా మిషన్‌ ఇంపాజిబుల్‌. ఈ చిత్రానికి 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేం స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్​ పతాకంపై నిరంజన్​ రెడ్డి, అన్వేష్​ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ఒక పోస్టర్‌ ద్వారా ప్రకటించారు మేకర్స్‌. తాజాగా మంగళవారం (మార్చి 15) మిషన్ ఇంపాజిబుల్‌ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు. ఇందులో ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ ట్రైలర్‌లో తాప్సీ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ ట్రైలర్‌లో మాఫీయ డాన్‌ దావుద్‌ ఇబ్రహీంను పట్టుకునేందుకు ముగ్గురు చిన్నారులు ఏం చేశారనేది ఆసక్తిగా ఉంది. 'దావుద్ ఇబ్రహీంను పట్టుకుంటే రూ. 50 లక్షలు ఇస్తారట, వాటిని తీసుకెళ్లి రాజమౌలికి ఇస్తే బాహుబలి పార్ట్‌ 3 తీస్తాడు' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో కన్నడ యాక్టర్‌ రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. అతడి దగ్గరికి వెళ్లిన ఈ చిన్నారులను 'మీ పేరేంటి అని రిషబ్ అడగ్గా.. 'రఘుపతి.. రాఘవ..  రాజారామ్‌..' 'ఆర్‌ఆర్‌ఆర్‌' అని సమాధానం ఇస్తారు. తర్వాత ఆ చిన్నారులు తిరిగి మీ పేర్లేంటీ అని అడిగిన ప్రశ‍్నకు రిషబ్‌ శెట్టి.. 'ఖలీల్‌.. జిలానీ.. ఫారూక్‌' 'కేజీయఫ్‌' అని చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. 



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement