ఆ ప్లేయర్‌తో రొమాన్స్ నిజమేనా?
ఆ ప్లేయర్‌తో రొమాన్స్ నిజమేనా?
Published Sun, Apr 6 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM
సినిమా తారలు క్రీడాకారులతో ప్రేమలో పడటం చాలా కామన్. అయితే, ఎక్కువగా క్రికెటర్ల ప్రేమకు కథానాయికలు క్లీన్ బౌల్డ్ అవుతుంటారు. కానీ, తాప్సీ మాత్రం బ్యాడ్‌మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో పడ్డారనే వార్త హల్‌చల్ చేస్తోంది. అలాంటిదేమీ లేదని ముంబయ్‌లో తాప్సీ స్పందించారనే వార్త కూడా వచ్చింది. కానీ, నిప్పు లేనిదే పొగ ఎలా వస్తుంది? అన్నది కొంతమంది ప్రశ్న. పైగా కొన్ని నెలల క్రితం ‘మై బ్యూటీఫుల్ జీఎఫ్ తాప్సీ’ అని ట్విట్టర్‌లో పెట్టారట మథియాస్. గాళ్‌ఫ్రెండ్ అంటూ బహిరంగంగా ప్రకటించిన మథియాస్‌ని ఇటీవల మీడియావారు తాప్సీతో ప్రేమకహానీ గురించి అడగ్గా ‘నో కామెంట్స్’ అన్నారు. గత వారం మథియాస్ బ్యాడ్‌మింటన్ మ్యాచ్‌లో పాల్గొన్నారు.
ఈ మ్యాచ్‌ని తిలకించడానికి తాప్సీ వెళ్లారు. స్టేడియమ్‌లో ఓ కార్నర్‌లో కూర్చుని మథియాస్ పాయింట్ సాధించినప్పుడల్లా తాప్సీ చప్పట్లు కొడుతూ ఆనందపడిపోవడం అందరి కంట్లోనూ పడింది. బహుశా బ్యాడ్‌మింటన్ అంటే.. తాప్సీకి చాలా ఇష్టం ఉండటంవల్లే ఆ మ్యాచ్‌ని తిలకించి ఉంటారని, అంత మాత్రానికే లింకులు పెట్టేయడం కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు. కానీ, మథియాస్ పాయింట్స్ సాధించినప్పుడే తాప్సీ ఎందుకు చప్పట్లు కొట్టాలి? ఇంకో ప్లేయర్ ఉన్నాడుగా? అని లా పాయింట్లు లాగుతున్నారు మరికొంతమంది. పాయింటే కదా!
Advertisement
Advertisement