
తాప్సీ
తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఓవర్’. నయనతారతో ‘మయూరి’ వంటి హిట్ సినిమా తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్‌తో ‘లవ్ ఫెయిల్యూర్’, వెంకటేశ్‌తో ‘గురు’ వంటి చిత్రాలను రూపొందించిన వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్. శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం చెన్నైలో ప్రారంభమైంది. శశికాంత్ మాట్లాడుతూ– ‘‘సరికొత్త క«థ, కథనాలతో తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోన్న చిత్రమిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాల్లో నేటి నుంచిఈ చిత్రం షూటింగ్ జరుపుతాం. మా బ్యానర్‌లో వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్, గురు’ విజయాల సరసన ‘గేమ్ ఓవర్’ కూడా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్, కెమెరా: ఎ.వసంత్, లైన్ ప్రొడ్యూసర్: ముత్తురామలింగం, సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర.
Comments
Please login to add a commentAdd a comment