రానాకు జోడీగా తాప్సీ? | tapsee in ranas next film ghazi | Sakshi
Sakshi News home page

రానాకు జోడీగా తాప్సీ?

Published Thu, Nov 5 2015 2:21 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రానాకు జోడీగా తాప్సీ? - Sakshi

రానాకు జోడీగా తాప్సీ?

కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న సినిమా 'ఘాజీ'. 1971లో ఇండియా - పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో, విశాఖపట్నం సమీపంలో సముద్ర జలాల్లో మునిగిపోయిన పిఎన్ఎస్ ఘాజీ జలాంతర్గామి బ్యాక్డ్రాప్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విశాఖ తీరంలో ఉన్న జలాంతర్గామిపై పాకిస్థాన్ సేనలు ఎలా దాడి చేయగలిగాయన్న మిస్టరీని సినిమాటిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా నావీ అధికారిగా కనిపించనున్నాడు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కథానాయిక పాత్ర కూడా కీలకం కావటంతో హీరోయిన్ కోసం చాలా రోజులుగా వేట సాగిస్తున్నారు. ముందుగా ఈ పాత్రకు సమంతను తీసుకోవాలని భావించినా, హిందీలో కూడా తెలిసిన హీరోయిన్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన చిత్రయూనిట్, ప్రస్తుతం తాప్సీని ఫైనల్ చేయాలని భావిస్తున్నారట.

బాలీవుడ్లో తెరకెక్కిన 'బేబీ' మూవీలో యాక్షన్ సీన్స్లోనూ ఇరగదీసిన ఈ బ్యూటీ, కొంతకాలంగా గ్లామర్ రోల్స్ను పక్కన పెట్టి ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటోంది. దీంతో 'ఘాజీ' సినిమాకు కూడా ఓకే చెబుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement