
తాప్సీ, అమితాబ్ బచ్చన్
పగ తీర్చుకోవడానికి రెడీ అవుతున్నారు అమితాబ్ బచ్చన్ అండ్ తాప్సీ. ఎవరిపై? ఎందుకు? అంటే మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ‘కహానీ’ ఫేమ్ సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో అమితాబ్, తాప్సీ ముఖ్య పాత్రలుగా నటిస్తున్న సినిమాకు ‘బద్లా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హిందీలో ‘బద్లా’ అంటే తెలుగులో పగ అనే మీనింగ్ ఉంది. ఈ సినిమా షూటింగ్ స్కాట్లాండ్‌లోని గ్లాస్కోలో మొదలైంది.
‘కాంట్రాటైమ్‌పో’ అనే స్పెయిన్ చిత్రానికి ఇది రీమేక్ అట. ‘‘గ్లాస్కోలో షూటింగ్ మొదలైంది. త్వరలోనే నేను జాయిన్ అవుతాను. మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు అమితాబ్. ‘‘మ్యాజిక్ రిపీట్ చేయడానికి అంతా సిద్ధమైంది’’ అన్నారు తాప్సీ. రెండేళ్ల క్రితం వచ్చిన ‘పింక్’ చిత్రం తర్వాత అమితాబ్ అండ్ తాప్సీ ఈ చిత్రం కోసం మళ్లీ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారని బీటౌన్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment