పుణే: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో పుణే సెవెన్ ఏసెస్ ఎట్టకేలకు ఓ విజయాన్ని నమోదు చేసింది. సినీ నటి తాప్సి యాజమానిగా ఉన్న పుణే తమ మూడో మ్యాచ్‌లో 4–3తో ముంబై రాకెట్స్‌ను కంగుతినిపించింది. పుణే ట్రంప్ మ్యాచ్ అయిన మహిళల సింగిల్స్‌లో లిన్ జాయెర్స్‌ఫెల్డ్ 15–11, 15–7తో శ్రియాన్షి (ముంబై)పై గెలుపొందగా, పురుషుల డబుల్స్‌లో ఇవనోవ్–చిరాగ్ శెట్టి (పుణే) ద్వయం 15–14, 15–7తో కిమ్ జి జంగ్–లి యంగ్ డే (ముంబై)ను ఓడించింది. వరుస విజయాలతో 3–0 ఆధిక్యంలో ఉన్న పుణేకు పురుషుల సింగిల్స్‌లో పరాజయాలు ఎదురయ్యాయి. ముంబై ట్రంప్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ (పుణే) 13–15, 15–7, 6–15తో అంటోన్సెన్ చేతిలో, రెండో మ్యాచ్‌లో హర్షిల్ (పుణే) 7–15, 10–15తో సమీర్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో 3–3తో స్కోరు సమం కాగా... నిర్ణాయక మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇవనోవ్–జాయెర్స్‌ఫెల్డ్ (పుణే) జంట 15–13, 11–15, 15–12తో కిమ్ జి జంగ్–పియా జెబాదియ జోడీపై గెలిచింది.
నార్త్ ఈస్టర్న్‌కు రెండో గెలుపు
మరో మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ 3–0తో ఢిల్లీ డాషర్స్‌పై నెగ్గింది. మహిళల సింగిల్స్‌లో రీతుపర్ణ (వారియర్స్) 15–13, 15–9తో కొసెట్స్‌కయాపై నెగ్గగా... పురుషుల డబుల్స్‌లో లియావో మిన్ చన్–సియాంగ్ (వారియర్స్) ద్వయం 15–9, 15–6తో చయ్ బియావో–సిజీ వాంగ్ జంటపై గెలిచింది. ఢిల్లీ ట్రంప్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సెన్సోబూన్సుక్ (వారియర్స్) 15–5, 15–12తో సుగియార్తోను, రెండో పోరులో టియాన్ హౌవీ (వారియర్స్) 12–15, 15–7, 15–14తో ప్రణయ్‌ను ఓడించారు. చివరగా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ వారియర్స్ ట్రంప్ మ్యాచ్ కాగా... ఇందులో లియావో మిన్–కిమ్ హ న జంట 15–12, 7–15, 14–15తో జొంగ్జిత్–కొసెట్స్‌కయ (ఢిల్లీ) జోడీ చేతిలో ఓడిపోయింది. నేటి మ్యాచ్‌ల్లో చెన్నైతో అహ్మదాబాద్, బెంగళూరుతో పుణే తలపడతాయి.
పుణే ఖాతా తెరిచింది
Published Sun, Dec 30 2018 1:57 AM | Last Updated on Sun, Dec 30 2018 1:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment