త్రిషకు బదులు తాప్సీ | trisha replaces Tapsee | Sakshi
Sakshi News home page

త్రిషకు బదులు తాప్సీ

Published Thu, Apr 9 2015 2:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

త్రిషకు బదులు తాప్సీ

త్రిషకు బదులు తాప్సీ

కోలీవుడ్‌లో నటి తాప్సికో అవకాశం వచ్చింది. దక్షిణాదిలో అవకాశాలు లే ఎండమావులవుతున్న తరుణంలో ఇది ఆమెకు మండుటెండల్లో పన్నీటి జల్లు లాంటిదే. ఇంతకీ ఆ అవకాశం ఏంటో చెప్పలేదు కదూ.. నటి త్రిష నటించడానికి అంగీకరించి ఆ తరువాత కాల్‌షీట్స్ సమస్య కారణంగా వైదొలగిన చిత్రంలో నటించే అవకాశం తాప్సీని వరించింది. ఈ చిత్రాన్ని త్రిషకు కాబోయే భర్త నిర్మించడం విశేషం. జయ్ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి సమర్, నాన్ శిగప్పు మనిదన్ చిత్రాల ఫేమ్ తిరు దర్శకత్వం వహించనున్నారు. త్రిష చేయాల్సిన పాత్రను తాప్సీ పోషించనున్నట్లు ఆయన వెల్లడించారు.
 
  ఈ చిత్రం గురించి తిరు మాట్లాడుతూ తాప్సీ ఈ చిత్రంలో కుంభకోణానికి చెందిన యువతిగా నటించనున్నారని చెప్పారు. జయ్ మోడ్రన్ యువకుడిగా కనిపించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో కుంభకోణంలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇందులో తాప్సీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని దర్శకుడు తిరు అన్నారు. కాంచన-2 చిత్రం విడుదలానంతరం తన టైమ్ బాగుంటుందని ఆ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్న తాప్సీకి ఇది అనుకోని అతిథిగా వచ్చిన అవకాశమే. దీంతో మంచి ఖుషీలో వున్న తాప్సీ కాంచన -2 తో పాటు తాజాగా నటించనున్న చిత్రం కోలీవుడ్‌లో తన నట జీవితాన్ని మంచి మలుపు తిప్పుతాయనే ఆశాభావంతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement