అవకాశం ఇవ్వమని ఆయనను వెంటాడా! | Tapsee in Baby pposite Akshay Kumar in Neeraj Pandey | Sakshi
Sakshi News home page

అవకాశం ఇవ్వమని ఆయనను వెంటాడా!

Published Wed, Jul 9 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

అవకాశం ఇవ్వమని ఆయనను వెంటాడా!

అవకాశం ఇవ్వమని ఆయనను వెంటాడా!

 బంగారం లాంటి అవకాశాలను ఎవరూ చేజార్చుకోవాలనుకోరు. అలాంటి అవకాశాల కోసం ఎంత కష్టపడటానికైనా వెనుకాడరు. ఇలాంటి ఓ అవకాశం కోసం ఇటీవల బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండేను వెంటాడారు తాప్సీ. ‘ఎ వెడ్నస్ డే’ ఫేం నీరజ్ దర్శకత్వం వహించే చిత్రాలన్నీ విభిన్న కథాంశాలతో ఉంటాయి. అందుకే, ఆయన ‘బేబి’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారని వినగానే, తనంతట తానుగా తాప్సీ ఆ సినిమాలో అవకాశం అడిగారట. ఆ విషయం గురించి తాప్సీ చెబుతూ -‘‘నీరజ్ ఎంతటి ప్రతిభావంతుడో తెలిసిందే.
 
 అలాంటి దర్శకుడి సినిమాలో నటించాలని ఎవరైనా అనుకుంటారు. అందుకే, నేనెలాంటి భేషజాలకూ పోకుండా ‘మీ సినిమాలో నాకు అవకాశం ఇవ్వండి’ అని అడగాలనుకున్నాను. ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న వ్యక్తిని కలిశాను. నా గురించి నీరజ్‌కి నాలుగు మంచి మాటలు చెప్పమని అతణ్ణి అభ్యర్థించా. అంతటితో వదలకుండా ఫోన్ చేసేదాన్ని. పట్టువిడవకుండా వెంటాడాను. చివరికి ఆడిషన్స్‌కి రమ్మన్నారు. ఇప్పటివరకు నా జీవితంలో ఇలాంటి ఆడిషన్స్‌లో పాల్గొనలేదు. ఎందుకంటే, కెమెరా లేకుండానే ఆడిషన్స్ చేశారు. ఒక గదిలో కొంతమంది వ్యక్తులు కూర్చుని ఉంటారన్నమాట.
 
 వాళ్ల ముందు యాక్ట్ చేయాలి. ఆ రోజు ఎంతో ఉద్వేగంగా ఆ ఆఫీసుకి వెళ్లి యాక్ట్ చేశాను. ఏ విషయం తర్వాత చెబుతామని నన్ను పంపించేశారు. అవకాశం వస్తుందో లేదో అని టెన్షన్ పడ్డాను. ఆ రోజు సాయంత్రం నీరజ్ పాండే ఆఫీస్ నుంచి ‘సెలెక్టెడ్’ అనే ఫోన్‌కాల్ వచ్చింది. ఆ తర్వాత తెలిసింది ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ హీరో అని. ఇందులో నేను చాలా మంచి పాత్ర చేస్తున్నాను. ‘బేబి’ నాలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement