Neeraj Pandey
-
‘అక్షయ్‌ని కాదని సుశాంత్‌ను తీసుకున్నాను’
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబైలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. డిప్రెషన్‌తో బాధపడుతున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ క్రమంలో ధోని బయోపిక్కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. మాజీ భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర కోసం తనను తీసుకోవాల్సిందిగా అక్షయ్ కుమార్ ఆ చిత్ర దర్శకుడు నీరజ్ పాండేను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో 2017లో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘నీరజ్ పాండే ధోని బయోపిక్ తెరకెక్కిస్తున్నారని నాకు తెలిసింది. దాంతో ఆ చిత్రంలో ధోని పాత్ర కోసం నన్ను తీసుకోవాల్సిందిగా నీరజ్‌ను కోరాను. కానీ అతడు సున్నితంగా తిరస్కరించాడు’ అని తెలిపారు. ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. (ఐ వాన్న అన్‌ఫాలో యు) దీనిపై నీరజ్ పాండే స్పందిస్తూ.. ‘ఈ చిత్రంలో ధోని యుక్తవయస్సులో వచ్చే సన్నివేశాలు కూడా ఉంటాయి. 16-17 ఏళ్ల యువకుడిగా నటించాల్సి ఉంటుంది. ఆ వెర్షన్ అక్షయ్‌కు సూట్ కాదు. అందుకే అతడి అభ్యర్థనను తిరస్కరించాను’ అన్నాడు. అంతేకాక ఈ చిత్రంలో సుశాంత్ నటన గురించి మాట్లాడుతూ.. ‘తను చాలా మంచి నటుడు. ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు సుశాంత్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. స్క్రిప్ట్‌ను పూర్తిగా చదివాడు. ధోని బాడీ లాంగ్వేజ్‌ను ఎంతో బాగా అనుకరించాడు’ అని తెలిపారు. ‘ఎమ్ఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం 133 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సుశాంత్ నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. (ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాం) -
నట విశ్వరూపం
‘పెళ్లైనకొత్తలో, యమదొంగ, రగడ, శంభో శివ శంభో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కన్నడ బ్యూటీ ప్రియమణి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సిరివెన్నెల’. వివాహం తర్వాత ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఏఎన్‌బీ కో ఆర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ పతాకాలపై కమల్ బోరా, ఏఎన్ భాషా, రామసీత నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. ప్రియమణి కెరీర్లో ఈ చిత్రం విభిన్నమైనదిగా నిలిచిపోతుంది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రియమణిగారు చాలా కథలు విన్నప్పటికీ ‘సిరి వెన్నెల’ కథ బాగా నచ్చడం, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకున్నారు. ఆమె నట విశ్వరూపం ఇందులో మరోసారి చూడబోతున్నాం. మా బ్యానర్‌కు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది. ‘సిరివెన్నెల’ టైటిల్ మా సినిమాకు కరెక్ట్‌గా సరిపోయింది. శివరాత్రికి విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు నీరజ్ పాండే విడుదల చేసిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘మహానటి’ ఫేమ్ సాయి తేజస్విని, ‘బాహుబలి’ ప్రభాకర్, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఏఎన్‌బీ కోఆర్డినేటర్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ, సాంగ్స్ కంపోజింగ్: ‘మంత్ర’ ఆనంద్, కమ్రాన్, కెమెరా: కల్యాణ్ సమి. -
చాణక్యుడి పాత్రలో స్టార్ హీరో
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో హిస్టారికల్, ఫోక్లోర్ సినిమాల హవా కనిపిస్తోంది. భారతీయ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో భారీ వసూళ్లు సాధిస్తుండటంతో మన మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవల పద్మావత్ సినిమా ఘనవిజయం సాధించగా ప్రస్తుతం మణికర్ణిక చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా మరో చారిత్రక పాత్రను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ మేకర్స్. చరిత్రలో ఎంతో గొప్ప రాజనీతిజ్ఞుడు, గురువు, ఆర్థిక నిపుణుడు అయిన చాణక్యుడి కథను వెండితెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరున్న నీరజ్ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ టైటిల్ రోల్ లో నటించేందుకు అంగీకరించారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్.. ఫ్రైడే ఫిలిం వర్క్స్, ప్లాస్ సి స్టూడియోస్ బ్యానర్లతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ప్చ్... ఒక్క ధోనీ తప్ప!
సాక్షి, సినిమా : స్ట్రాంగ్ కంటెంట్‌తో సినిమాలు తెరకెక్కిస్తాడనే పేరు బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండేకు ఉంది. ముఖ్యంగా దేశభక్తి సందేశం ఆయన చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. 44 ఏళ్ల ఈ బిహార్ బాబు తన పదేళ్ల కెరీర్లో రైటర్‌గా, నిర్మాతగా, డైరెక్టర్‌గా 12 చిత్రాలకు పని చేశాడు. అందులో దర్శకత్వం వహించింది కేవలం ఐదింటికి మాత్రమే. అన్నీ కూడా విమర్శకుల నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాయి తప్ప కమర్షియల్ గా మాత్రం హిట్లు కాలేకపోతున్నాయి. 2008లో ఎ వెడ్నస్ డే(తెలుగులో కమల్ హీరోగా తెరకెక్కిన ఈనాడు) చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన నీరజ్.. తర్వాత ఐదేళ్లకు స్పెషల్ ఛబ్బీస్‌తో పలకరించాడు. తర్వాత వరుసగా బేబీ, ఎంఎస్ ధోనీ:ది అన్‌టోల్డ్ స్టోరీ, తాజాగా అయ్యారీ చిత్రాలతో పలకరించాడు. అయితే ఆసక్తికర కథనాలు, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే తో సినిమాలు తెరకెక్కిస్తాడన్న పేరున్న ఆయన.. కలెక్షన్ల విషయంలో మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఒక్క ధోనీ బయోపిక్ తప్పించి ఆయన చిత్రాలేవీ వంద కోట్లు దాటలేకపోయాయి. ఏ వెడ్నస్డే చిత్రం ఫుల్ రన్లో రూ. 12 కోట్లు, స్పెషల్ ఛబ్బీస్ రూ. 66.8 కోట్లు, భారీ అంచనాల నడుమ వచ్చిన బేబీ చిత్రం రూ. 95.56 కోట్లు వసూలు చేశాయి. ఒక్క ధోనీ చిత్రం మాత్రం రూ. 133.04 కోట్లు సాధించి నీరజ్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన అయ్యారీ కూడా వీక్ కలెక్షన్లతోనే ప్రదర్శితమవుతోంది. రెండు రోజులకు గానూ ఈ చిత్రం కేవలం రూ.7.40 కోట్లు వసూలు చేసింది. కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ అది ప్రేక్షకులను మెప్పించటంలో విఫలమైందన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కంటెంట్ హిట్.. కమర్షియల్ ఫెయిల్యూర్స్‌తో నీరజ్ పాండే జర్నీ సాగుతుదన్నమాట. (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో...) -
బాలీవుడ్‌లోనూ అదే ఫార్ములా..!
తెలుగు బుల్లితెర మీద సంచలనం సృష్టించిన షో బిగ్ బాస్. ఎన్టీఆర్ లాంటి టాప్ హీరో వ్యాఖ్యతగా వ్యవహరించటంతో ఈ షోకు మరింత క్రేజ్ వచ్చింది. అందుకే షో ప్రసారమవుతున్న సమయంలో పలు చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా బిగ్ బాస్ షో వేదికైంది. తమ సినిమాల రిలీజ్ సమయంలో హీరోలు హీరోయిన్లు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. ఇదే ఫార్ములాను బాలీవుడ్ లో ఫాలో అవుతోంది అందాల భామ రకుల్. ఈ భామ లీడ్ రోల్ తో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘ఆయారి’. సిద్దార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్‌పాయ్, నసిరుద్ధీన్ షా లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినమాకు నీరజ్ పాండే దర్శకుడు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అవుతోంది. దీంతో ప్రమోషన్ లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ హిందీ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనుంది. -
స్టార్ హీరోయిన్ బాలీవుడ్ రీ ఎంట్రీ
ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఈ బ్యూటి బాలీవుడ్లో సత్తా చాటేందుకు ప్లాన్ చేసుకుంటోంది. రకుల్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ బాలీవుడ్ సినిమాతోనే జరిగింది. యారియన్ సినిమాతో వెండితెర మీద మెరిసిన ఈ భామ.. అక్కడ ఆశించిన విజయం దక్కకపోవటంతో సౌత్ బాట పట్టింది. సౌత్‌లో సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ ప్రజెంట్ టాప్ హీరోయిన్గా వెలిగిపోతోంది. అయితే ఇలాంటి టైంలో బాలీవుడ్ రీ ఎంట్రీ రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. కానీ వెడ్నస్ డే, స్పెషల్ చబ్బీస్, బేబీ లాంటి సినిమాలను తెరకెక్కించిన నీరజ్ పాండే దర్శకత్వంలో నటించే ఛాన్స్ రావటంతో రకుల్ కాదనలేకపోయిందట. నీరజ్ దర్శకత్వంలో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న ఐయారీ సినిమాలో రకుల్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. -
'ఎమ్ ఎస్ ధోని' సెంచరీ
భారత క్రికెట్ వీరుడు ఎమ్ ఎస్ ధోని వెండితెర మీద కూడా సెంచరీ కొట్టేశాడు. ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎమ్ ఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరి వంద కోట్ల కలెక్షన్ మార్క్‌ను అందుకుంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధోని ఇప్పటికీ డిసెంట్ కలెక్షన్లతో సత్తా చాటుతోంది. ఇప్పటికే 103 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ధోని ముందు ముందు మరిన్ని రికార్డ్లను సాధించే దిశగా సాగుతోంది. ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకుడు. అనుపమ్ ఖేర్, భూమిక, కైరా అద్వానీ, దిశాపఠానీలు ఇతర ప్రధాన పాత్రల్లోనటించిన ధోని సినిమాను అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. -
ఎమ్.ఎస్.ధోని మరో రికార్డ్
బాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వరుసగా తెరకెక్కుతున్న క్రీడాకారుల బయోపిక్స్ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అదే బాటలో భారత క్రికెట్ కెప్టెన్ ధోని జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎమ్ ఎస్ ధోని అన్‌టోల్డ్ స్టోరి పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్ పరంగా భారీ హైప్ క్రియేట్ చేస్తోన్న ధోని సినిమా, మరో అరుదైన ఘనతను సాధించింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు, మెగాస్టార్లు నటించిన సినిమాలు కూడా ఇప్పటి వరకు 50 దేశాలకు మించి రిలీజ్ కాలేదు. కానీ ఎమ్ ఎస్ ధోని మాత్రం ఏకంగా 60 దేశాల్లో 4500 స్క్రీన్స్‌లో రిలీజ్ కానుంది. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా పేరున్న ధోని బయోపిక్ కోసం అంతర్జాతీయ క్రీడాభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ సాధారణ టికెట్ కలెక్టర్ ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్‌గా మారిన క్రమాన్ని సినిమాటిక్‌గా రూపొందించిన ఈ సినిమాలో, ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కనిపిస్తున్నాడు. ఎ వెడ్నస్ డే, స్పెషల్ చబ్బీస్, బేబి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నీరజ్ పాండే ఎమ్ ఎస్ ధోని చిత్రానికి దర్శకత్వం వహించాడు. -
ధోనీకి రూ. 40 కోట్లు ఇవ్వలేదు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథను సినిమాగా తీసేందుకు అతనికి 40 కోట్ల రూపాయలు ఇచ్చి హక్కులు పొందినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని దర్శకుడు నీరజ్ పాండే చెప్పాడు. ధోనీ జీవితకథ ఆధారంగా నీరజ్ దర్శకత్వంలో 'ఎంఎస్ ధోనీ.. ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెలాఖరులో విడుదలకానుంది. కాగా ఈ సినిమాలో ధోనీ మాజీ గాళ్ ఫ్రెండ్ పాత్ర ఉంటుందా అన్న విషయంపై నీరజ్ పెదవి విప్పలేదు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలకు ముందే ఈ చిత్రం భారీస్థాయిలో బిజినెస్ చేసింది. 'ఎంఎస్ ధోనీ' సినిమా కోసం నిర్మాతలు రూ. 80 కోట్లవరకు ఖర్చు చేయగా, విడుదలకు ముందే 60 కోట్లు నిర్మాతల జేబుల్లోకి వచ్చిచేరాయి. ఈ సినిమా శాటిలైట్ హక్కులు రికార్డు స్థాయిలో రూ. 60 కోట్లకు అమ్ముడయ్యాయి. -
విడుదలకు ముందే రూ. 60 కోట్ల బిజినెస్!
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్‌సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ'. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుండగా.. మరోవైపు విడుదలకు ముందే ఈ చిత్రం భారీస్థాయిలో బిజినెస్ చేసింది. 'ఎంఎస్ ధోనీ' సినిమా కోసం నిర్మాతలు రూ. 80 కోట్లవరకు ఖర్చు చేశారు. కానీ, విడుదలకు ముందే 60 కోట్లు నిర్మాతల జేబుల్లోకి వచ్చిచేరాయి. ఈ సినిమా శాటిలైట్ హక్కులు రికార్డుస్థాయిలో రూ. 60 కోట్లకు అమ్ముడుపోగా, మరో 15 కోట్లు సినిమాకు అనుబంధంగా ఉన్న బ్రాండ్ సంస్థల వల్ల లభించాయి. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన ధోనీ సమున్నత క్రికెటర్‌గా ఎలా ఎదిగాడు? అతని జీవితంలో ఒడిదుడుకులేమిటి? అతని స్ఫూర్తిదాయక ప్రస్థానం గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు తెలియజేస్తూ ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన 'ఎంఎస్ ధోనీ' రెండు పాటల ట్రైలర్లు ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందుతున్నాయి. -
ఖిలాడీ ఐడియా గురూ..!!
-
ఖిలాడీ ఐడియా గురూ..!!
‘తాప్సీ బేబీ యాక్షన్ భలే ఇరగదీసింది బాసూ’ - హిందీ సినిమా ‘బేబీ’ చూసిన తర్వాత ప్రేక్షకులతో పాటు విమర్శకులూ చెప్పిన మాట ఇది. అక్షయ్ కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బేబీ’. అందాల బొమ్మగా మాత్రమే కాదు, అవకాశం వస్తే యాక్షన్ సీన్లలోనూ తడాఖా చూపగలనని ‘బేబీ’తో తాప్సీ నిరూపించుకున్నారు. గతేడాది విడుదలైన ఈ సినిమాలో తాప్సీ పాత్ర (ప్రియా) నిడివి తక్కువే అయినప్పటికీ, యాక్షన్ గాళ్‌గా మంచి పేరొచ్చింది. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా ఓ హిట్ సినిమాకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తీస్తే, హీరో క్యారెక్టర్ బేస్ చేసుకుని తీస్తుంటారు. ‘బేబీ’లో తాప్సీ యాక్షన్ చూసిన తర్వాత ప్రియా క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ప్రీక్వెల్ తీస్తే బాగుంటుందని అక్షయ్ కుమార్ స్వయంగా దర్శకుడు నీరజ్ పాండేకి ఐడియా ఇచ్చారట. ఈ ఖిలాడీ కుమార్ ఇచ్చిన ఐడియాతో ఫీమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా కోసం రచయిత శివమ్ నాయర్ కథ రాయడం ప్రారంభించారు. ఈ చిత్రానికి నీరజ్ పాండే, శివమ్ నాయర్లలో ఎవరో ఒకరు దర్శకత్వం వహిస్తారట. ‘మీరా’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్, మలయాళ నటుడు పృథ్వీ హీరోలుగా నటించనున్నారని బి-టౌన్ టాక్. అక్షయ్ కుమార్ అతిథి పాత్రలో కనిపిస్తారట. ‘బేబీ’ కోసం తాప్సీ ఇజ్రాయెల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రీక్వెల్ కోసం మార్షల్ ఆర్ట్స్‌లో కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకునే పనిలో పడ్డారట. -
'ధోనీ' దుమ్మురేపుతున్నాడు!
అతను ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్లో ట్రెయిన్ టికెట్ ఎగ్జామినర్‌గా పనిచేసిన ఓ మాములు యువకుడు.. మొదట్లో క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేదు. కానీ, ఫుట్‌బాల్ ఆటలో గోల్‌కీపర్‌గా మంచి నైపుణ్యముంది. అదే అతన్ని అనుకోకుండా క్రికెట్ వైపు అడుగులు వేయించింది. వికెట్ కీపర్‌గా అంది వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను.. ఇప్పుడు యూత్‌కు స్ఫూర్తిమంతంగా నిలిచాడు. దేశం గర్వించే క్రికెటర్‌గా, రెండు ప్రపంచకప్‌లు అందించిన గొప్ప కెప్టెన్‌గా ఎదిగాడు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతనే.. 'మిస్టర్ కూల్' మహేంద్రసింగ్ ధోనీ! అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని.. అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలను ధోనీ ప్రస్తానాన్ని.. బయటి ప్రపంచానికి తెలియని ఆయన అన్‌టోల్డ్ స్టోరీని తెలియచెప్పేందుకు త్వరలో రాబోతున్నది 'ఎంఎస్ ధోనీ'- ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమా. ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు ఆన్లైన్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ట్రైలర్‌ను విడుదలచేసిన 36 గంటల్లోనే కోటికిపైగా మంది దీనిని వీక్షించారు. ఈ సినిమాలో ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించాడు. నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా ఫాక్స్ స్టూడియో సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. మూడు నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో దాదాపు 90లక్షలమందికి చూడగా.. ఫేస్బుక్లో దాదాపు 10లక్షలకుపైగా దీనిని వీక్షించారు. సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదల కానుంది. -
ఆ సినిమాలో వేలు పెట్టను : ధోనీ
టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథాంశం ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న మూవీ 'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ'. నీరజ్ పాండే తీస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీ పాత్రలో కనిపించనున్నాడు. ఈ బయోపిక్ పై ధోనీ స్పందించాడు. ఈ సినిమాలో తాను వేలు పెట్టదలుచుకోవడం లేదని దర్శకుడి విజన్ ఎలా ఉంటుందో తెరపైనే చూస్తానని తెలిపాడు. మూవీ గురించి నీరజ్ తనను కలిసినప్పుడు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా ధోనీ వెల్లడించాడు. తన జీవితాన్ని తెరపై నీరజ్ అర్థవంతంగా చూపిస్తారని ధోనీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే తాను క్రికెటర్ గా ఎదగడం, ఆ తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సమయంలో తన తల్లిదండ్రులు ఎలా ఫీలయ్యారన్న విషయం తనకు తెలియదన్నాడు. ఈ మూవీ ద్వారా ఆ విషయాలను తాను తెలుసుకుంటానని ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. స్కూలు రోజులు తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని.. క్రికెట్ ఆడగలవని కోచ్ ప్రోత్సహించడంతోనే తన కెరీర్ ప్రారంభమయిందని పాత రోజులను గుర్తుచేసుకున్నాడు. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, భూమికా చావ్లా, రాజేష్ శర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. -
‘ఎంఎస్ ధోనీ’ మరింత ఆలస్యం..
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఎంఎస్ ధోనీ’ సినిమా విడుదల వాయిదా పడింది. ఇంతకుముందు ప్రకటించినట్టు సెప్టెంబర్ 2న కాకుండా అదే నెల 30న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాను అత్యుత్తమంగా ప్రేక్షకులకు అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధోనీ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోషిస్తున్నాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిర్మాణ విలువల్లో రాజీపడబోమని, సినిమాను పూర్తిచేయడానికి మరికొంత సమయం అవసరమని, దీంతో విడుదలను వాయిదా వేసినట్టు ఫాక్స్ స్టార్ స్టూడియో సీఈవో విజయ్ సింగ్ చెప్పాడు. -
'ఆ సినిమాలో నటించటం గర్వంగా ఉంది'
సౌత్‌లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్ బాట పట్టిన అందాల భామ ఇలియానా. దక్షిణాదిన స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ, చాలా కాలంగా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ అవకాశాల కోసం ముంబై వెళ్లిపోవటంతో పాటు వచ్చిన అవకాశాలకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో తెలుగు దర్శక నిర్మాతలు ఈ అమ్మడిని పక్కన పెట్టేశారు. అదే సమయంలో బాలీవుడ్లో కూడా అవకాశాలు లేకపోవటంతో ఈ గోవా భామ చాలా రోజులుగా ఖాళీగానే ఉంటుంది. కొంత కాలంలో సౌత్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టిన ఇల్లిబేబి, అవకాశాల కోసం తనకు తెలిసి వాళ్లను సంప్రదించటం మొదలు పెట్టింది. అయితే ఆ ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. టాలీవుడ్లో అవకాశాలు వచ్చినట్టుగానే వచ్చి చేయి జారిపోయాయి. బ్రూస్ లీ సినిమాలో ఐటమ్ సాంగ్‌తో పాటు, చరణ్ చేస్తున్న తనీఒరువన్ రీమేక్‌లో హీరోయిన్ ఛాన్స్ కూడా మిస్ అవ్వటంతో మరోసారి ఢీలా పడిపోయింది. అదే సమయంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. అక్షయ్ హీరోగా తెరకెక్కుతున్న రుస్తుం సినిమా కోసం ఇలియానాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. స్పెషల్ చబ్బీస్, బేబి లాంటి సినిమాలతో వరుస హిట్స్ సాధించిన నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించటం గర్వంగా ఉందంటోంది ఇలియానా. మరి ఈ సినిమాతో అయినా ఇలియానా మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి. -
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి ప్లాన్ సి స్టూడియో జేవీ
ఫ్రైడే ఫిల్మ్వర్క్స్తో కలిసి చిత్ర నిర్మాణం న్యూఢిల్లీ: చిత్ర నిర్మాణం కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, నీరజ్ పాండే, శీతల్ భాటాయాల ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ప్లాన్ సి స్టూడియోస్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ జేవీలో ఇరు సంస్థలకు 50:50 శాతం వాటాలున్నాయి. ప్లాన్ సి స్టూడియోస్ తొలి చిత్రంగా అక్షయ్ కుమార్ హీరోగా టిను సురేశ్ దేశాయ్ దర్శకత్వంలో రుస్తోమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నీరజ్, శీతల్ వంటి సృజనాత్మక వ్యక్తులతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని రిలయన్స్ గ్రూప్ ఎండీ అమితాబ్ ఝున్‌ఝున్‌వాలా చెప్పారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో ఒప్పందం చెప్పుకోదగినదని నీరజ్ పాండే వ్యాఖ్యానించారు. వినోదాత్మక అంశాలతో వినూత్నమైన సినిమాలను అందిస్తామని పేర్కొన్నారు. -
ధోని.. సనాఫ్ అనుపమ్ ఖేర్
ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీనటుల జీవితగాథలతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకాన్ని ఎగరవేసిన క్రీడాకారుల జీవితాలను కూడా వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు మన దర్శక నిర్మాతలు. అదే బాటలో ఇండియన్ క్రికెట్‌ను విజయపథంలో నడిపించిన భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. వెడ్నెస్ డే, స్పెషల్ 26, బేబీ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్లను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే తొలిసారిగా బయోపిక్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ధోని తండ్రి పాన్ సింగ్‌గా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ నటిస్తున్నాడు. గతంలో నీరజ్ దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని సినిమాల్లో ప్రధానపాత్రల్లో నటించిన అనుపమ్ ఈ సినిమాలో కూడా కీరోల్ ప్లే చేస్తున్నాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోనిగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పగ్లీ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కైరా అద్వానీ ధోని భార్య సాక్షి సింగ్ ధోని పాత్రలో కనిపించనుంది. 'ఎమ్ఎస్ ధోని : ద అన్ టోల్డ్ స్టోరీ' పేరుతో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. -
ఉర్దూతో గోల్డెన్ చాన్స్!
తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోయినా... బాలీవుడ్లో మాత్రం తాప్సీ మంచి ఊపుమీదే ఉన్నారు. వచ్చే జనవరి 23న అక్షయ్‌కుమార్‌తో ఈ ముద్దుగుమ్మ కలిసి నటించిన ‘బేబీ’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా విజయం సాధిస్తే... బాలీవుడ్లో తాప్సీ దశ తిరిగినట్లే. అసలు ఈ సువర్ణావకాశం ఈ ఢిల్లీభామకు ఎలా దక్కిందో తెలుసా? తాప్సీ ఉర్దూ బాగా మాట్లాడతారు. అదే తాప్సీకి వరమైంది. కథ రీత్యా ఇందులో కథానాయిక ఉర్దూ బాగా మాట్లాడాలి. అందుకే దర్శకుడు నీరజ్ పాండే.. ఉర్దూ తెలిసిన అందమైన అమ్మాయి కోసం దేశం మొత్తం వెతికారట. చివరకు బంతి తాప్సీ గోల్లో పడింది. తాను సొగసుగా ఉర్దూ మాట్లాడటం చూసి పులకించిపోయిన నీరజ్... మరో ఆలోచన చేయకుండా ఆ పాత్రకు తాప్సీని ఎంచుకున్నారట. దీని గురించి తాప్సీ చెబుతూ- ‘‘నేను ఉత్తరాది అమ్మాయినే అయినా, ఆ యాస లేకుండా కేవలం ఉర్దూ యాసలోనే మాట్లాడగల సత్తా నాకుంది. చిన్నప్పట్నుంచీ ఉర్దూ మాట్లాడటం నాకు అలవాటే. నీరజ్ ఈ కథ అనుకున్నప్పుడు చాలామందిని కలిశారట. ఉర్దూ మాట్లాడగలిగిన అమ్మాయిలు మాత్రం ఆయనకు తారసపడలేదు. చివరకు నన్ను కలిశారు. కష్టతరమైన కొన్ని ఉర్దూ పదాలను నా ముందుంచారు. నేను అలవోకగా చెప్పేశా. ఆ తర్వాత ఉర్దూ కవితల్ని చదవమన్నారు. తడుముకోకుండా చదివేశా. అలా ఈ సినిమా ఛాన్స్ నాకు దక్కింది. అక్షయ్‌కుమార్, రానా, డ్యానీ... ఇలా చాలామంది స్టార్లు ఇందులో నటించారు. ముఖ్యంగా అక్షయ్సార్తో నటించే ఛాన్స్ రావడం నిజంగా నా అదృష్టం’’ అన్నారు. -
అవకాశం ఇవ్వమని ఆయనను వెంటాడా!
బంగారం లాంటి అవకాశాలను ఎవరూ చేజార్చుకోవాలనుకోరు. అలాంటి అవకాశాల కోసం ఎంత కష్టపడటానికైనా వెనుకాడరు. ఇలాంటి ఓ అవకాశం కోసం ఇటీవల బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండేను వెంటాడారు తాప్సీ. ‘ఎ వెడ్నస్ డే’ ఫేం నీరజ్ దర్శకత్వం వహించే చిత్రాలన్నీ విభిన్న కథాంశాలతో ఉంటాయి. అందుకే, ఆయన ‘బేబి’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారని వినగానే, తనంతట తానుగా తాప్సీ ఆ సినిమాలో అవకాశం అడిగారట. ఆ విషయం గురించి తాప్సీ చెబుతూ -‘‘నీరజ్ ఎంతటి ప్రతిభావంతుడో తెలిసిందే. అలాంటి దర్శకుడి సినిమాలో నటించాలని ఎవరైనా అనుకుంటారు. అందుకే, నేనెలాంటి భేషజాలకూ పోకుండా ‘మీ సినిమాలో నాకు అవకాశం ఇవ్వండి’ అని అడగాలనుకున్నాను. ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న వ్యక్తిని కలిశాను. నా గురించి నీరజ్‌కి నాలుగు మంచి మాటలు చెప్పమని అతణ్ణి అభ్యర్థించా. అంతటితో వదలకుండా ఫోన్ చేసేదాన్ని. పట్టువిడవకుండా వెంటాడాను. చివరికి ఆడిషన్స్‌కి రమ్మన్నారు. ఇప్పటివరకు నా జీవితంలో ఇలాంటి ఆడిషన్స్‌లో పాల్గొనలేదు. ఎందుకంటే, కెమెరా లేకుండానే ఆడిషన్స్ చేశారు. ఒక గదిలో కొంతమంది వ్యక్తులు కూర్చుని ఉంటారన్నమాట. వాళ్ల ముందు యాక్ట్ చేయాలి. ఆ రోజు ఎంతో ఉద్వేగంగా ఆ ఆఫీసుకి వెళ్లి యాక్ట్ చేశాను. ఏ విషయం తర్వాత చెబుతామని నన్ను పంపించేశారు. అవకాశం వస్తుందో లేదో అని టెన్షన్ పడ్డాను. ఆ రోజు సాయంత్రం నీరజ్ పాండే ఆఫీస్ నుంచి ‘సెలెక్టెడ్’ అనే ఫోన్‌కాల్ వచ్చింది. ఆ తర్వాత తెలిసింది ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ హీరో అని. ఇందులో నేను చాలా మంచి పాత్ర చేస్తున్నాను. ‘బేబి’ నాలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది’’ అని చెప్పారు. -
రహస్య గూఢచారిగా...
కథానాయిక తాప్సీ ముంబయ్‌కి మకాం మార్చేసిన విషయం తెలిసిందే. అమె అక్కడ అడుగుపెట్టిన వేళావిశేషం బావుంది. ఎంత బాగుందంటే... బాలీవుడ్ కథానాయికలందరూ ఎదురుచూసేసువర్ణావకాశం ... ఏ కష్టం లేకుండా, తేలిగ్గా తాప్సీ తలుపు తట్టేంత. ఇంతకీ తాప్సీని వరించిన ఆ బంగారం లాంటి అవకాశం ఏంటనుకున్నారు? బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్‌తో జతకట్టే అవకాశం. వివరాల్లోకెళితే... ‘స్పెషల్ 26’ లాంటి బ్లాక్‌బస్టర్‌ని తనకు అందించిన దర్శకుడు నీరజ్ పాండేతో మరో సినిమా చేయడానికి అక్షయ్ సంసిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా ఓ ఫ్రెష్ ఫేస్ ఉంటే బావుంటుందని అక్షయ్ భావించారట. అదే తాప్సీ పాలిట వరమై కూర్చుంది. అక్షయ్-నీరజ్‌ల తాజా చిత్రానికి తాప్సీ కథానాయికగా ఖరారయ్యింది. మరో విషయం ఏంటంటే... ఇందులో తాప్సీ పాత్ర కూడా విభిన్నంగా ఉంటుందట. రహస్య గూఢచారిగా తాప్సీ ఇందులో కనిపించబోతున్నారు. ఈ యాక్షన్ అడ్వంచరస్ మూవీ.. అక్షయ్ అభిమానులు పండుగ చేసుకునే రీతిలో ఉంటుందని బాలీవుడ్ టాక్. ఇప్పటికే... బాలీవుడ్లో ప్రస్తుతం ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ అనే సినిమాలో నటిస్తోంది తాప్సీ. మరోవైపు ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘వెయ్ రాజా వెయ్’లో కూడా తాప్సీ నటిస్తోంది. ఇందులో తను నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేస్తోంది. -
సినిమాలంటే భయం లేదు
సినిమాలు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని, అయితే వాటికి భయపడేదాన్ని మాత్రం కాదని చెబుతోంది యామీ గౌతమ్. మొదటి సినిమా వికీ డోనర్ విజయం సాధించడంతో ఈ బ్యూటీకి అవకాశాలు బాగానే వస్తున్నా తొందరపడడం లేదు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ‘నా మనసు చెప్పింది చేయడమే నాకిష్టం. ఒక సినిమా భారీ హిట్ కాగానే తరువాతి వాటిని ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే నాకు సినిమా కుటుంబం లేదు. ముంబై యువతినీ కాదు కాబట్టి రెండో అవకాశం రావడం కాస్త కష్టమే. అయితే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అంతమాత్రాన నేను భయపడ్డట్టు కాదు’ అని యామీ వివరించింది. తాజా సినిమా టోటల్ సియప్పా తనకు మనసుకు నచ్చిన కథ అని తెలిపింది. ‘నాకు అవకాశాలు చాలా వచ్చాయి. వద్దనుకున్న సినిమాల గురించి మాట్లాడడం ఇష్టముండదు’ అని చెప్పింది. అయితే నీరజ్ పాండే నిర్మిస్తున్న టోటల్ సియప్పా ప్రాజెక్టుపై సంతకం చేయడానికి కూడా ఈమె చాలా సమయమే తీసుకుంది. ‘భిన్న నేపథ్యాలున్న కథ ఇది. హాస్యం, ఉద్వేగం, కోపం వంటి అంశాలూ ఉంటాయి. ఇందులో అవకాశం ఇచ్చిన నీరజ్ పాండేకు ఎంతో కృతజ్ఞురాలిని. సినిమా కథ గంభీరమైనదే అయినా ప్రేక్షకులు దీనిని పూర్తిగా ఆస్వాదించవచ్చు’ అని యామీ వివరించింది. టోటల్ సియప్పాకు నీరజ్ కథ కూడా అందించగా, ఈశ్వర్ నివాస్ దర్శకత్వం వహించాడు. దీనిని వచ్చే నెల ఏడున విడుదల చేస్తున్నారు. పాకిస్థానీ నటుడు, గాయకుడు అలీ జఫర్, యామీ, అనుపమ్ ఖేర్, ఆయన సతీమణి కిరణ్ ఖేర్ తదితరులు ఇందులో కనిపిస్తారు. వికీ డోనర్ తీసిన జాన్అబ్రహం, షూజిత్ సర్కార్ తాజాగా రూపొందించే సినిమాలోనూ అవకాశం దక్కిందంటూ వచ్చిన వార్తలను యామీ గౌతమ్ తోసిపుచ్చింది.