'ఆ సినిమాలో నటించటం గర్వంగా ఉంది'
సౌత్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్ బాట పట్టిన అందాల భామ ఇలియానా. దక్షిణాదిన స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ, చాలా కాలంగా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ అవకాశాల కోసం ముంబై వెళ్లిపోవటంతో పాటు వచ్చిన అవకాశాలకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో తెలుగు దర్శక నిర్మాతలు ఈ అమ్మడిని పక్కన పెట్టేశారు. అదే సమయంలో బాలీవుడ్లో కూడా అవకాశాలు లేకపోవటంతో ఈ గోవా భామ చాలా రోజులుగా ఖాళీగానే ఉంటుంది.
కొంత కాలంలో సౌత్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టిన ఇల్లిబేబి, అవకాశాల కోసం తనకు తెలిసి వాళ్లను సంప్రదించటం మొదలు పెట్టింది. అయితే ఆ ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. టాలీవుడ్లో అవకాశాలు వచ్చినట్టుగానే వచ్చి చేయి జారిపోయాయి. బ్రూస్ లీ సినిమాలో ఐటమ్ సాంగ్తో పాటు, చరణ్ చేస్తున్న తనీఒరువన్ రీమేక్లో హీరోయిన్ ఛాన్స్ కూడా మిస్ అవ్వటంతో మరోసారి ఢీలా పడిపోయింది.
అదే సమయంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. అక్షయ్ హీరోగా తెరకెక్కుతున్న రుస్తుం సినిమా కోసం ఇలియానాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. స్పెషల్ చబ్బీస్, బేబి లాంటి సినిమాలతో వరుస హిట్స్ సాధించిన నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించటం గర్వంగా ఉందంటోంది ఇలియానా. మరి ఈ సినిమాతో అయినా ఇలియానా మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.