‘ఎంఎస్ ధోనీ’ మరింత ఆలస్యం..
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఎంఎస్ ధోనీ’ సినిమా విడుదల వాయిదా పడింది. ఇంతకుముందు ప్రకటించినట్టు సెప్టెంబర్ 2న కాకుండా అదే నెల 30న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాను అత్యుత్తమంగా ప్రేక్షకులకు అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.
నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధోనీ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషిస్తున్నాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిర్మాణ విలువల్లో రాజీపడబోమని, సినిమాను పూర్తిచేయడానికి మరికొంత సమయం అవసరమని, దీంతో విడుదలను వాయిదా వేసినట్టు ఫాక్స్ స్టార్ స్టూడియో సీఈవో విజయ్ సింగ్ చెప్పాడు.