ఆ సినిమాలో వేలు పెట్టను : ధోనీ | Went with Neeraj's vision for biopic, says MS Dhoni | Sakshi
Sakshi News home page

ఆ సినిమాలో వేలు పెట్టను : ధోనీ

Published Thu, Aug 11 2016 4:55 PM | Last Updated on Thu, Sep 12 2019 8:55 PM

ఆ సినిమాలో వేలు పెట్టను : ధోనీ - Sakshi

ఆ సినిమాలో వేలు పెట్టను : ధోనీ

టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథాంశం ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న మూవీ 'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ'. నీరజ్ పాండే తీస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీ పాత్రలో కనిపించనున్నాడు. ఈ బయోపిక్ పై ధోనీ స్పందించాడు. ఈ సినిమాలో తాను వేలు పెట్టదలుచుకోవడం లేదని దర్శకుడి విజన్ ఎలా ఉంటుందో తెరపైనే చూస్తానని తెలిపాడు. మూవీ గురించి నీరజ్ తనను కలిసినప్పుడు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా ధోనీ వెల్లడించాడు. తన జీవితాన్ని తెరపై నీరజ్ అర్థవంతంగా చూపిస్తారని ధోనీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

అయితే తాను క్రికెటర్ గా ఎదగడం, ఆ తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సమయంలో తన తల్లిదండ్రులు ఎలా ఫీలయ్యారన్న విషయం తనకు తెలియదన్నాడు. ఈ మూవీ ద్వారా ఆ విషయాలను తాను తెలుసుకుంటానని ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. స్కూలు రోజులు తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని.. క్రికెట్ ఆడగలవని కోచ్ ప్రోత్సహించడంతోనే తన కెరీర్ ప్రారంభమయిందని పాత రోజులను గుర్తుచేసుకున్నాడు. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, భూమికా చావ్లా, రాజేష్ శర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement