
తెలుగు బుల్లితెర మీద సంచలనం సృష్టించిన షో బిగ్ బాస్. ఎన్టీఆర్ లాంటి టాప్ హీరో వ్యాఖ్యతగా వ్యవహరించటంతో ఈ షోకు మరింత క్రేజ్ వచ్చింది. అందుకే షో ప్రసారమవుతున్న సమయంలో పలు చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా బిగ్ బాస్ షో వేదికైంది. తమ సినిమాల రిలీజ్ సమయంలో హీరోలు హీరోయిన్లు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు.
ఇదే ఫార్ములాను బాలీవుడ్ లో ఫాలో అవుతోంది అందాల భామ రకుల్. ఈ భామ లీడ్ రోల్ తో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘ఆయారి’. సిద్దార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్‌పాయ్, నసిరుద్ధీన్ షా లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినమాకు నీరజ్ పాండే దర్శకుడు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అవుతోంది. దీంతో ప్రమోషన్ లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ హిందీ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment