ప్రియమణి
‘పెళ్లైనకొత్తలో, యమదొంగ, రగడ, శంభో శివ శంభో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కన్నడ బ్యూటీ ప్రియమణి లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘సిరివెన్నెల’. వివాహం తర్వాత ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఏఎన్‌బీ కో ఆర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ పతాకాలపై కమల్ బోరా, ఏఎన్ భాషా, రామసీత నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. ప్రియమణి కెరీర్లో ఈ చిత్రం విభిన్నమైనదిగా నిలిచిపోతుంది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రియమణిగారు చాలా కథలు విన్నప్పటికీ ‘సిరి వెన్నెల’ కథ బాగా నచ్చడం, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకున్నారు.
ఆమె నట విశ్వరూపం ఇందులో మరోసారి చూడబోతున్నాం. మా బ్యానర్‌కు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది. ‘సిరివెన్నెల’ టైటిల్ మా సినిమాకు కరెక్ట్‌గా సరిపోయింది. శివరాత్రికి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు నీరజ్ పాండే విడుదల చేసిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘మహానటి’ ఫేమ్ సాయి తేజస్విని, ‘బాహుబలి’ ప్రభాకర్, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఏఎన్‌బీ కోఆర్డినేటర్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ, సాంగ్స్ కంపోజింగ్: ‘మంత్ర’ ఆనంద్, కమ్రాన్, కెమెరా: కల్యాణ్ సమి.
Comments
Please login to add a commentAdd a comment