
‘రష్మి రాకెట్’ అనే క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించనున్నారు తాప్సీ. ఈ సినిమాలో అథ్లెట్‌గా కనిపించనున్నారామె. స్క్రీన్ మీద అచ్చమైన అథ్లెట్‌గా కనిపించడానికి వ్యాయామంతో పాటు సరైన డైట్ కూడా తీసుకుంటున్నారు తాప్సీ. ప్రస్తుతం రష్మి పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్‌లో ఉన్నారామె. ఇక్కడ ఉన్న ఫొటో షేర్ చేసి, ‘‘రష్మీ పాత్రకు తయారవుతున్నాను. ఉదయాన్నే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నాను.
ఇదిగో నా చేతిలో ఉన్న ఈ ప్లేట్‌లో ఉన్నది స్వీట్ పొటాటో టిక్కీస్. మున్‌మున్ గనెరివాల్ ఆధ్వర్యంలో నా డైట్‌ను పాటిస్తున్నాను. అథ్లెటిక్ ఫిజిక్ రావాలంటే కేవలం ప్రొటీన్స్ ఒక్కటే ఎక్కువగా తీసుకోవడం కాదు. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తీసుకోవడం’’ అన్నారు తాప్సీ. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్‌లో ప్రారంభం కానుంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించనున్నారు. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment