WPL 2023: Kiara Advani, Kriti Sanon, AP Dhillon to perform at the opening ceremony - Sakshi
Sakshi News home page

WPL 2023: డబ్ల్యూపీఎల్‌లో సందడి చేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు

Published Sat, Mar 4 2023 2:44 PM | Last Updated on Sat, Mar 4 2023 3:21 PM

Kiara Advani, Kriti Sanon ,AP Dhillon to perform at the opening ceremony - Sakshi

మహిళల ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు పాల్గొననున్నాయి. ఇక తొలి డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్లు కృతి సనన్, కియారా అద్వానీ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ అందాల భామల డ్యాన్స్‌తో పాటు పంజాబీ రాప్‌ సింగర్‌ ఏపీ దిల్లాన్ కూడా సందడి చేయునున్నాడు. కాగా ఈ ఈవెంట్‌ ప్రారంభానికి ముందు కియారా, కృతి సనన్, దిల్లాన్ రిహార్స్‌ల్స్‌లో కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

డబ్ల్యూపీఎల్ పూర్తి షెడ్యూల్?

మార్చి 4: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్)

మార్చి 5: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, (3:30 PM, బ్రబౌర్న్)

మార్చి 5: UP వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, డివై పాటిల్)

మార్చి 6: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, బ్రబౌర్న్)

మార్చి 7: ఢిల్లీ క్యాపిటల్స్ vs UP వారియర్స్ (7:30 PM, డివై పాటిల్)

మార్చి 8: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30) PM) , బ్రబౌర్న్)

మార్చి 9: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్)

మార్చి 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs UP వారియర్స్ (7:30 PM, బ్రబౌర్న్)

మార్చి 11: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7: 30 PM) , డివై పాటిల్)

మార్చి 12: UP వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, బ్రబౌర్న్)

మార్చి 13: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్)

మార్చి 14: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్)

మార్చి 21: UP వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 24: ఎలిమినేటర్ (7:30 PM, డివై పాటిల్)

మార్చి 15: UP వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్)

మార్చి 16: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్)

మార్చి 18: ముంబై ఇండియన్స్ vs UP వారియర్స్ (3:30 PM, DY పాటిల్ )

మార్చి 18: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్)

మార్చి 20: గుజరాత్ జెయింట్స్ vs UP వారియర్స్ (3:30 PM, బ్రబౌర్న్)

మార్చి 20: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, డివై పాటిల్)

మార్చి 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (3:30 PM, డివై పాటిల్)

మార్చి 26: ఫైనల్ (7:30 PM, బ్రబౌర్న్)

లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..
టీవీ: స్పోర్ట్స్‌18 నెట్‌వర్క్‌
డిజిటల్‌ మీడియా: జియో సినిమా యాప్‌, వెబ్‌సైట్‌

చదవండి: WPL 2023: తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్‌కు భారీ షాక్‌.. స్టార్‌ క్రికెటర్‌ దూరం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement