brabourne stadium
-
లేడీ సెహ్వాగ్ విధ్వంసం.. 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో! వీడియో వైరల్
మహిళల ప్రీమియర్ లీగ్-2023 రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదైంది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది. తద్వారా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేసిన 210 పరుగుల అత్యధిక స్కోర్ రికార్డును ఢిల్లీ బ్రేక్ చేసింది. విధ్వంసం సృష్టించిన షఫాలీ వర్మ, లానింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకు ఓపెనర్లు షఫాలీ వర్మ, లానింగ్ అదిరిపోయే శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 162 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వీరిద్దరూ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా షఫాలీ వర్మ అయితే బౌలర్లను ఊచ కోత కోసింది. బౌండరీలతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేసింది. ఇక లానింగ్ కూడా 43 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసింది. అదే విధంగా ఆఖరిలో మారిజానే కాప్ కూడా బ్యాట్ ఝులిపించింది. కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులు సాధించింది. చదవండి: డివిలియర్స్ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడాడు.. అతడి కంటే రైనా చాలా బెటర్! 6️⃣4️⃣6️⃣ @TheShafaliVerma is dealing in boundaries here in Mumbai 😎🎆 Follow the match ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/vXl5rOEgSh — Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023 Shafali Verma scores a delightful maiden 5️⃣0️⃣ for the @DelhiCapitals 🤩#TATAWPL #CheerTheW #RCBvDC pic.twitter.com/ZedyhvWZDI — JioCinema (@JioCinema) March 5, 2023 -
డబ్ల్యూపీఎల్‌లో సందడి చేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు
మహిళల ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు పాల్గొననున్నాయి. ఇక తొలి డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్లు కృతి సనన్, కియారా అద్వానీ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ అందాల భామల డ్యాన్స్‌తో పాటు పంజాబీ రాప్ సింగర్ ఏపీ దిల్లాన్ కూడా సందడి చేయునున్నాడు. కాగా ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు కియారా, కృతి సనన్, దిల్లాన్ రిహార్స్ల్స్లో కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్ల్యూపీఎల్ పూర్తి షెడ్యూల్? మార్చి 4: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 5: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, (3:30 PM, బ్రబౌర్న్) మార్చి 5: UP వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 6: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 7: ఢిల్లీ క్యాపిటల్స్ vs UP వారియర్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 8: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30) PM) , బ్రబౌర్న్) మార్చి 9: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs UP వారియర్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 11: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7: 30 PM) , డివై పాటిల్) మార్చి 12: UP వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 13: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్) మార్చి 14: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 21: UP వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 24: ఎలిమినేటర్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 15: UP వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్) మార్చి 16: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 18: ముంబై ఇండియన్స్ vs UP వారియర్స్ (3:30 PM, DY పాటిల్ ) మార్చి 18: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 20: గుజరాత్ జెయింట్స్ vs UP వారియర్స్ (3:30 PM, బ్రబౌర్న్) మార్చి 20: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (3:30 PM, డివై పాటిల్) మార్చి 26: ఫైనల్ (7:30 PM, బ్రబౌర్న్) లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. టీవీ: స్పోర్ట్స్18 నెట్వర్క్ డిజిటల్ మీడియా: జియో సినిమా యాప్, వెబ్సైట్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: WPL 2023: తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్‌కు భారీ షాక్.. స్టార్ క్రికెటర్ దూరం! -
WPL 2023: పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే
WPL 2023 Full Schedule- Where To Watch: మహిళా క్రికెట్ అభివృద్ధిలో భాగంగా బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వుమెన్ ప్రీమియర్ లీగ్‌కు శనివారం(మార్చి 4) తొలి అడుగుపడనుంది. ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య పోటీతో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. డబ్ల్యూపీఎల్ తొలి టైటిల్ కోసం ఐదు జట్లు పోటీపడనున్నాయి. ముంబైలో జరుగనున్న ఈ టీ20 లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. కాగా లీగ్ దశలో డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో ఐదు జట్లు పోటీపడతాయి. అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి. పాయింట్ల పట్టికలో ప్రథమస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌తో మరో ఫైనలిస్టు ఖరారవుతుంది. ఈ నేపథ్యంలో డివై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగననున్న 22 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు.. పూర్తి షెడ్యూల్.. ఎవరితో ఎవరు? మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం).. 1. మార్చి 4- శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 2. మార్చి 5- ఆదివారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు.. 3. మార్చి 5- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 4. మార్చి 6- సోమవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ - బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 5. మార్చి 7- మంగళవారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 6. మార్చి 8- బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 7. మార్చి 9- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 8. మార్చి 10- శుక్రవారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 9. మార్చి 11- శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 10. మార్చి 12- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్ - బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 11. మార్చి 13- సోమవారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ - డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 12. మార్చి 14- మంగళవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 13. మార్చి 15- బుధవారం- యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 14. మార్చి 16- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 15. మార్చి 18- శనివారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు 16. మార్చి 18- శనివారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 17. మార్చి 20- సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యూపీ వారియర్స్- బ్రబౌర్న్ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు 18. మార్చి 20- సోమవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 19. మార్చి 21- మంగళవారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు 20. మార్చి 21- మంగళవారం- యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు 21. మార్చి 24- శుక్రవారం- ఎలిమినేటర్ మ్యాచ్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 22. మార్చి 26- ఆదివారం- ఫైనల్ మ్యాచ్- బ్రబౌర్న్ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. టీవీ: స్పోర్ట్స్18 నెట్వర్క్ డిజిటల్ మీడియా: జియో సినిమా యాప్, వెబ్సైట్ చదవండి: IND vs AUS: టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజులా? దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రోహిత్ శర్మ IND Vs AUS: చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్ చర్యకు మైండ్‌బ్లాక్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023: అంబానీ వర్సెస్ అదానీ.. తొలి మ్యాచ్‌లో ముంబైతో అహ్మదాబాద్ ‘ఢీ’
Women Premier League 2023: మహిళల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాందిగా ఉమెన్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) త్వరలోనే ఆరంభం కానుంది. లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ముంబైలోనే జరుగనున్నాయి. నగరంలోని బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాలను టోర్నీ వేదికలుగా ఎంపిక చేశారు. షెడ్యూల్‌పై బోర్డు ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా... మార్చి 4న తొలి మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 22 మ్యాచ్‌లు భారత కార్పొరేట్ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలకు చెందిన ముంబై, అహ్మదాబాద్ టీమ్‌లు ఈ పోరులో తలపడే అవకాశం ఉంది. ముంబైలోని ప్రధాన స్టేడియం వాంఖడేను ఐపీఎల్ కోసం మాత్రమే వినియోగిస్తారు. మొత్తం 22 మ్యాచ్‌లు ఉండే ఈ టోర్నీ ఫైనల్ మార్చి 26న జరుగుతుంది. ప్లే ఆఫ్స్‌నకు మూడు టీమ్‌లు ఐదు జట్లు పాల్గొంటున్న డబ్ల్యూపీఎల్‌లో మూడు టీమ్‌లు ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధిస్తాయి. లీగ్ దశలో ఒక్కో టీమ్ ఇతర నాలుగు జట్లతో (మొత్తం 8 మ్యాచ్‌లు) తలపడుతుంది. అత్యధిక పాయింట్ల జట్టు ఫైనల్‌కు చేరితే... మరో ఫైనలిస్ట్ కోసం తర్వాతి రెండు టీమ్‌ల మధ్య ఎలిమినేటర్ నిర్వహిస్తారు. ఫ్రాంచైజీ ఒప్పందాలు ఖరారు చేసేందుకు శుక్రవారం ఐదు టీమ్‌ల యాజమాన్యాలతో బీసీసీఐ సమావేశమైంది. మహిళల ఐపీఎల్ జట్లను కొనుగోలు చేసిన సంస్థలు ఇవే 1. అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు) 2. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు) 3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు) 4. జేఎస్‌డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు) 5. క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు) చదవండి: BGT 2023: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తీవ్రంగా శ్రమిస్తున్న టీమిండియా! ఫోటోలు వైరల్ Shaheen Afridi: షాహీన్ అఫ్రిది 'నిఖా' హోగయా.. ప్రత్యేక అతిధి ఎవరంటే..? -
వాంఖేడెలో కాదు బ్రాబౌర్న్‌లో
ముంబై: వన్డే సిరీస్‌లో భాగంగా భారత్–వెస్టిండీస్ మధ్య ఈ నెల 29న జరగాల్సిన నాలుగో మ్యాచ్ వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం ఈ వన్డేకు ముంబైలోని వాంఖేడె మైదానం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆర్థిక అవరోధాలను చూపుతూ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) చేతులెత్తేసింది. ఎంసీఏ అధికారులు గురువారం బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరిని కలిసి తమ ఇబ్బందులను వివరించి, మ్యాచ్‌ను బోర్డు నిర్వహించేలా చూడాలని కోరారు. దీంతో క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) సూచన మేరకు మ్యాచ్‌ను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బ్రాబౌర్న్ స్టేడియానికి మార్చినట్లు బీసీసీఐ తెలిపింది. బ్రాబౌర్న్... వాంఖేడెకు అతి సమీపంలోనే ఉంటుంది. 2009లో ఆస్ట్రేలియాతో టెస్టు తర్వాత ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించడం లేదు. అప్పటి నుంచి ఎక్కువగా పర్యాటక జట్ల ప్రాక్టీస్ కోసం వాడుతున్నారు. మరోవైపు సిరీస్‌లో వన్డే వేదిక మారడం ఇది రెండోసారి. ఈ నెల 24న ఇండోర్‌లో జరగాల్సిన రెండో వన్డేను కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం కారణంగా విశాఖపట్టణానికి తరలించారు. -
బై బై ‘నాయకా’
►ఓటమితో నాయకత్వం ముగించిన ధోని ►తొలి వార్మప్‌లో భారత్ ‘ఎ’ పరాజయం ►3 వికెట్లతో ఇంగ్లండ్ ఎలెవన్ గెలుపు ►సెంచరీతో ఆకట్టుకున్న రాయుడు ధోని, ధోని... కెప్టెన్, కెప్టెన్... బ్రాబోర్న్ స్టేడియం మొత్తం ఒకే నామాన్ని జపించింది. ఆటగాడిగా అతని మెరుపులు చూసే అవకాశం మున్ముందు ఉన్నా, కెప్టెన్‌గా ఆఖరి మ్యాచ్ కావడంతో ముంబై మొత్తం అసలు మ్యాచ్ కోసం వెళ్లినట్లుగా మైదానానికి తరలింది. ఉచిత ప్రవేశం అంటూ ఇచ్చిన అవకాశంతో అభిమానం పోటెత్తి స్టాండ్లను ముంచేసింది. ఎన్నడూ లేని విధంగా అభిమానం ‘పాదాభివందనం’గా కూడా మారిపోయింది. గ్రౌండ్లో ధోని కదిలినా, మెదిలినా ప్రేక్షకులు తమ చప్పట్లు, కేకలతో హోరెత్తించి వార్మప్ మ్యాచ్‌లోనూ వేడిని పెంచారు. ధోని కూడా ఒకే ఓవర్లో 23 పరుగులతో చెలరేగి తన నుంచి ఆశించిన ఆనందాన్ని పంచాడు. అయితే చివరకు మాత్రం అతను పరాజయంతోనే తన నాయకత్వాన్ని ముగించాడు. తొలి ప్రాక్టీస్‌లో విజయంతో పర్యటనలో మోర్గాన్ సేన శుభారంభం చేసింది. ముంబై: భారత క్రికెట్లో అత్యంత విజ యవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథిగా తన ఆఖరి మ్యాచ్‌లో జట్టును గెలిపించలేకపోయాడు. బ్యాటింగ్‌లో తనదైన శైలిలో ధాటిని ప్రదర్శించినా, మ్యాచ్‌లో విజయం మాత్రం దక్కలేదు. వన్డే, టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోని, ఇంగ్లండ్ ఎలెవన్‌తో జరిగిన వార్మప్ వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎలెవన్ 3 వికెట్ల తేడాతో భారత్ ‘ఎ’ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. అంబటి రాయుడు (97 బంతుల్లో 100 రిటైర్డ్ అవుట్; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ధోని (40 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్ (84 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ (48 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా చెలరేగారు. అనంతరం ఇంగ్లండ్ ఎలెవన్ 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 307 పరుగులు చేసింది. స్యామ్ బిల్లింగ్స్ (85 బంతుల్లో 93; 8 ఫోర్లు) సెంచరీ చేజార్చుకున్నాడు. జేసన్ రాయ్ (57 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, బట్లర్ (46), డాసన్ (41), హేల్స్ (40) ఫర్వాలేదనిపించారు. ఇరు జట్ల మధ్య రెండో వార్మప్ మ్యాచ్ గురువారం జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే మన్దీప్ (8) వికెట్ కోల్పోయింది. అయితే ఈ దశలో ధావన్, రాయుడు కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ముందుగా 73 బంతుల్లో ధావన్, తర్వాత 58 బంతుల్లో రాయుడు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు వీరిద్దరు 111 పరుగులు జోడించిన అనంతరం ధావన్‌ను బాల్ అవుట్ చేశాడు. వచ్చీ రాగానే రషీద్ ఓవర్లో రెండు సిక్సర్లు బాది యువరాజ్ సత్తా ప్రదర్శించాడు. 40 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తి కాగా, 97 బంతుల్లో సెంచరీ అవగానే రాయుడు రిటైర్డ్ అయ్యాడు. 42వ ఓవర్లో క్రీజ్‌లోకి వచ్చిన ధోనికి ప్రేక్షకులు ఘనస్వాగతం పలికారు. యువీ, శామ్సన్ (0) వరుస ఓవర్లలో అవుటైనా ధోని తన జోరును చూపించాడు. వోక్స్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అతను రెండు ఫోర్లు, రెండు భారీ సిక్స్‌లతో మొత్తం 23 పరుగులు చేయడం విశేషం. శుభారంభం... ఛేదనలో ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. రాయ్, హేల్స్ చక్కటి షాట్లతో స్కోరుబోర్డును పరుగెత్తించారు. నెహ్రా ఓవర్లో రాయ్ 2 ఫోర్లు, సిక్సర్ కొట్టగా... మోహిత్ ఓవర్లో హేల్స్ 2 ఫోర్లు, సిక్సర్ బాదాడు. తొలి వికెట్‌కు 95 పరుగులు జత చేసిన హేల్స్‌ను అవుట్ చేసి తొలి వికెట్ అందించిన కుల్దీప్, తన తర్వాతి ఓవర్లోనే రాయ్‌ను కూడా పెవిలియన్ పంపించాడు. మోర్గాన్ (3) ఎక్కువ సేపు నిలవలేకపోగా... బట్లర్, బిల్లింగ్స్ నాలుగో వికెట్‌కు 79 పరుగులు జత చేసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. అయితే మళ్లీ కుల్దీప్ ప్రత్యర్థిని దెబ్బ తీస్తూ ఒకే ఓవర్లో బట్లర్, అలీ (0)లను అవుట్ చేశాడు.ఈ దశలో ధాటిగా ఆడుతూ 60 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న బిల్లింగ్స్, ఆ తర్వాత కూడా చెలరేగాడు. అతనికి డాసన్ అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఒకే స్కోరు వద్ద వీరిద్దరు వెనుదిరిగినా, వోక్స్ (11 నాటౌట్), రషీద్ (6 నాటౌట్) కలిసి తమ జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: మన్దీప్ (బి) విల్లీ 8; ధావన్ (సి) బట్లర్ (బి) బాల్ 63; రాయుడు (రిటైర్డ్ అవుట్) 100; యువరాజ్ (సి) రషీద్ (బి) బాల్ 56; ధోని (నాటౌట్) 68; శామ్సన్ (సి) హేల్స్ (బి) విల్లీ 0; పాండ్యా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 304. వికెట్ల పతనం: 1–25; 2–136; 3–227; 4–250; 5–257. బౌలింగ్: వోక్స్ 10–1–71–0; విల్లీ 10–1–55–2; అలీ 10–0–42–0; బాల్ 10–0–61–2, రషీద్ 8–0–49–0; డాసన్ 2–0–24–0. ఇంగ్లండ్ ఎలెవన్ ఇన్నింగ్స్: రాయ్ (సి) శర్మ (బి) కుల్దీప్ 62; హేల్స్ (సి) శామ్సన్ (బి) కుల్దీప్ 40; బిల్లింగ్ (బి) పాండ్యా 93; మోర్గాన్ (సి) ధావన్ (బి) చహల్ 3; బట్లర్ (సి) శర్మ (బి) కుల్దీప్ 46; అలీ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; డాసన్ (సి) అండ్ (బి) కుల్దీప్ 41; వోక్స్ (నాటౌట్) 11; రషీద్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (48.5 ఓవర్లలో 7 వికెట్లకు) 307. వికెట్ల పతనం: 1–95; 2–106; 3–112; 4–191; 5–191; 6–290; 7–290. బౌలింగ్: నెహ్రా 6–0–50–0; పాండ్యా 9.5–1–48–1; శర్మ 9–0–58–0; చహల్ 10–0–56–1; కుల్దీప్ 10–1–60–5; యువరాజ్ 4–0–32–0.