Kaira advani
-
డబ్ల్యూపీఎల్‌లో సందడి చేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు
మహిళల ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు పాల్గొననున్నాయి. ఇక తొలి డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్లు కృతి సనన్, కియారా అద్వానీ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ అందాల భామల డ్యాన్స్‌తో పాటు పంజాబీ రాప్ సింగర్ ఏపీ దిల్లాన్ కూడా సందడి చేయునున్నాడు. కాగా ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు కియారా, కృతి సనన్, దిల్లాన్ రిహార్స్ల్స్లో కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్ల్యూపీఎల్ పూర్తి షెడ్యూల్? మార్చి 4: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 5: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, (3:30 PM, బ్రబౌర్న్) మార్చి 5: UP వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 6: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 7: ఢిల్లీ క్యాపిటల్స్ vs UP వారియర్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 8: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30) PM) , బ్రబౌర్న్) మార్చి 9: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs UP వారియర్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 11: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7: 30 PM) , డివై పాటిల్) మార్చి 12: UP వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 13: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్) మార్చి 14: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 21: UP వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 24: ఎలిమినేటర్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 15: UP వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్) మార్చి 16: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 18: ముంబై ఇండియన్స్ vs UP వారియర్స్ (3:30 PM, DY పాటిల్ ) మార్చి 18: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 20: గుజరాత్ జెయింట్స్ vs UP వారియర్స్ (3:30 PM, బ్రబౌర్న్) మార్చి 20: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (3:30 PM, డివై పాటిల్) మార్చి 26: ఫైనల్ (7:30 PM, బ్రబౌర్న్) లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. టీవీ: స్పోర్ట్స్18 నెట్వర్క్ డిజిటల్ మీడియా: జియో సినిమా యాప్, వెబ్సైట్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: WPL 2023: తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్‌కు భారీ షాక్.. స్టార్ క్రికెటర్ దూరం! -
చెర్రీతో మరోసారి రోమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ
-
టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన హర్రర్- కామెడీ చిత్రం ‘లక్ష్మీ’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు. షూటింగ్ అంతా పూర్తి చేస్తున్న ఈ సినిమా ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా లక్ష్మీ బాంబ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తీరా సమయానికి టైటిల్లో లక్ష్మీ అనే పేరు ఉందని, లక్ష్మీ అంటే పవిత్రమైన పేరు అని దానిని కించపరిచేలా ఉందని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన సినిమా యూనిట్‌కు నోటీసులు పంపింది. దీంతో టైటిల్ మార్చేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. ఈ క్రమంలో లక్ష్మి బాంబ్ సినిమా పేరును బాంబ్ తొలగించి లక్ష్మీ అనే పేరుగా మార్చారు. చదవండి: అక్షయ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్లు..తీరు మార్చుకోరా? తాజాగా హాలోవీన్ సందర్భంగా అక్షయ్ కుమార్ సినిమా టైటిల్లో మార్పులు చేసిన అనంతరం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మధ్యలో కియారా అద్వానీ ఉండగా వెనక అక్షయ్ కనిపిస్తున్నారు. ‘నవంబర్ 9న లక్ష్మీతో మీ ఇంటికి వస్తున్నాం. సిద్ధంగా ఉండండి’ ఇంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 9న ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళంలో మంచి విజయం సొంతం చేసుకున్న కాంచనకు రీమేక్. హిందీలో డైరెక్టర్‌గా రాఘవా లారెన్స్‌కు ఇది మొదటి చిత్రం. View this post on Instagram Ab harr ghar mein aayegi #Laxmii! Ghar waalon ke saath taiyaar rehna 9th November ko!🤩 #FoxStarStudios #DisneyPlusHotstarMultiplex #YehDiwaliLaxmiiWali @kiaraaliaadvani @offl_lawrence @shabskofficial @tusshark89 @foxstarhindi @disneyplushotstarvip #CapeOfGoodFilms #ShabinaaEntertainment #TussharEntertainmentHouse @zeemusiccompany A post shared by Akshay Kumar (@akshaykumar) on Oct 30, 2020 at 10:29pm PDT -
ప్రీతి ఎక్కడ అర్జున్?!
అర్జున్‌రెడ్డి తెలుగులో దుమ్ము రేపింది.ఆ దుమ్ము కోలీవుడ్‌లో, బాలీవుడ్లో దుమారం రేపింది.రీమేక్ చేస్తున్నారు. అయితే అదంత ఈజీ కావడం లేదు!పెద్ద హిట్ సినిమాను రీమేక్ చేయడానికి ఉండే తంటాలే ఇవి. ఇప్పటికింకా..అర్జున్‌రెడ్డి రీమేకింగ్లోనే ఉన్నాడు. హీరోయిన్లు ఫైనల్ అయినా..ఫైనల్ వరకు వాళ్లు ప్రీతిలా చేయగలరా?రీమేక్ అర్జున్‌రెడ్డికి ఒర్జినల్ ప్రీతి కనిపిస్తుందా? తెలుగు ‘అర్జున్‌రెడ్డి’లో లవర్ గర్ల్ పాత్ర కోసం షాలినీ పాండేకు (సినిమాలో ప్రీతి) ముందు డైరెక్టర్ ఎంతమందిని వడపోశారో తెలీదు. తమిళ్ అర్జున్‌రెడ్డికి మాత్రం మొదట మేఘా చౌదరిని అనుకున్నారు. ఆమెతో పూర్తి సినిమా తీశారు. ఆ షూట్‌ని పక్కన పడేసి జాహ్నవిని అనుకున్నారు. అది వర్కవుట్ కాలేదు. బనితా సందూని తీసుకున్నారు. ఆమెతో ఫ్రెష్‌గా షూటింగ్ మొదలు పెట్టారు. హిందీ అర్జున్‌రెడ్డికి కూడా మొదట తీసుకోవాలనుకున్నది అనన్య పాండేను. తర్వాత తీసుకున్నది కియారా అద్వానీని. ఎందుకిలా హీరోయిన్లను మార్చేస్తున్నారు. ప్రీతిలా కనిపిస్తారో లేదోనన్న సందేహమా? మరేమైనా కారణాలా?! ఫిబ్రవరి 15న రిలీజ్ కావాలి ‘వర్మా’. కాలేదు.‘అర్జున్‌రెడ్డి’ తమిళ్ వెర్షనే ‘వర్మా’. ధ్రువ్ హీరో. విక్రమ్ కొడుకు. ఎందుకు విడుదల కాలేదు?ఫస్ట్ కాపీ వచ్చింది. ధ్రువ్ హీరోలా ఉన్నాడు. విక్రమ్‌లా ఉన్నాడు. కానీ అర్జున్‌రెడ్డిలా లేడు!అర్జున్‌రెడ్డిలా ఉండడం అంటే విజయ్ దేవరకొండలా ఉండడం. అది ఆశించారు నిర్మాతలు. అలా ఉండదేమో అని కూడా అనుమానించారు. మామూలుగా తీశాడా, మామూలుగా చూపించాడా అర్జున్‌రెడ్డిని, దేవరకొండని.. మన డైరెక్టర్ సందీప్ వంగ! పిక్చర్ పదహారు జూన్‌లో మొదలై, పదిహేడు జూన్‌లో ఫినిష్ అయింది. ఆ వెంటనే ఆగస్టులో విడుదలైంది. బడ్జెట్ నాలుగు కోట్లు. బాక్సాఫీస్ ఇచ్చింది యాభై కోట్లు! డబ్బు అలా ఉంచండి. ఎంత రొద! రణగొణధ్వని.‘వర్మా’ను పద్దెనిమిది మార్చిలో మొదలు పెట్టి ఏడు నెలల్లో ఫినిష్ చేశాడు డైరెక్టర్ బాలా. ఫస్ట్ కాపీ చూసి, ‘‘రిలీజ్ చెయ్యడం లేదు. మళ్లీ మొత్తం షూట్ చేస్తున్నాం’’ అని ‘ఇ4’ (నిర్మాణ సంస్థ) రిలీజ్‌కు ముందు ప్రకటన ఇచ్చింది! కొత్త వెర్షన్ రిలీజ్ టైమ్ కూడా ఇచ్చేసింది. ఈ ఇయర్ జూన్‌లో ఏదో ఒక ఫ్రైడే. ఈసారి డైరెక్టర్ బాలా మాత్రం కాదు. వేరెవరైనా! రెండు రోజుల క్రితం ఆ వేరెవరైనా అనే వ్యక్తి దొరికాడు. గిరీశ్ అయా. తెలుగు అర్జున్‌రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ అతడు!ఇ4 బాలాకు ముందే చెప్పింది. ‘వర్మా’.. సేమ్ ఒరిజినల్లా ఉండాలని. అంటే తెలుగు ‘అర్జున్‌రెడ్డి’లా. కానీ తమిళ్‌కి ఒక ఒరిజినల్ ఉంటుందిగా. ఆ ఒరిజినాలిటీని పట్టుకున్నట్టున్నాడు బాలా. ఇ4కి అది నచ్చలేదు. వద్దనుకుంది. రద్దు ప్రకటన రిలీజ్ చేసింది. తర్వాత బాలా కూడా ఒక నోట్ రిలీజ్ చేశాడు. తను చెప్పడం.. ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ అని. డబ్బులిచ్చి తీయించేవాడు నిర్మాత, డబ్బులు తీసుకుని నిర్మించేవాడు దర్శకుడు. ‘వర్మా’లో కొన్ని సీన్లప్పుడు ఇద్దరి మధ్య డబ్బుకు బదులు ‘ఇగో’ ముఖ్యపాత్ర పోషించింది. ఫిల్మ్ ముక్కలయింది. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాల్సింది. సింగిల్ కాపీ ఉన్న బాక్సే బద్దలైపోయింది!∙∙ బాలా.. సందీప్ కన్నా సీనియర్. ట్వంటీ ఇయర్స్ ఇండస్త్రీ. లాంగ్ కెరియర్. ‘శివపుత్రుడు, వాడు–వీడు, నేనే దేవుడు’.. మంచి మంచి హిట్స్. çసందీప్‌కి ‘అర్జున్‌రెడ్డి’ తొలి చిత్రం. రెండో సినిమా ఇంకా రాలేదు. అర్జున్రెడ్డినే హిందీలో ‘కబీర్ సింగ్’గా తీస్తున్నాడు సందీప్. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. పిక్చర్ పూర్తయితే జూన్ 21న విడుదల. ‘వర్మా’ను తియ్యడానికి నిజానికి బాలా అంత సీనియర్ అవసరం లేదు. అర్జున్‌రెడ్డిలా ఉండాలి అనుకున్నప్పుడు ఇ4 సంస్థ సందీప్‌నే డైరెక్టర్‌గా తీసుకుని ఉండాలి. మన దగ్గరే ‘సీనియర్ సందీప్’ ఉన్నప్పుడు చెన్నై నుంచి హైద్రాబాద్ వెళ్లడం ఎందుకనుకున్నారు నిర్మాతలు. ఇంకోటి కూడా పని చేసింది. విక్రమ్‌కి ‘సేతు’తో బ్రేక్ ఇచ్చిన బాలా.. విక్రమ్ కొడుకు ధ్రువ్కీ ‘వర్మా’తో అలాంటి బ్రేకే ఇవ్వొచ్చని ఒక సెంటిమెంట్. అయితే సినిమా తీస్తున్నప్పుడే ‘వర్మా’కు బ్రేక్‌లు వచ్చాయి. ‘‘నన్ను స్వేచ్ఛగా తియ్యనివ్వలేదు. ధ్రువ్ కెరీర్ దెబ్బతినకూడదని.. దీన్నిక వివాదం చేయదలచుకోలేదు’’ అని బాలా తన నోట్ స్టేట్మెంట్ను ముగించారు. ఏం నచ్చి ఉండకపోవచ్చు ఇ4కి ‘వర్మా’ ఫస్ట్ కాపీలో? ఏదీ నచ్చలేదట! రీషూట్‌కి ధ్రువ్ ఒక్కణ్నీ ఉంచుకుని మొత్తం టీమ్‌ని మార్చేశారు. ఆఖరికి హీరోయిన్ని కూడా. మొదట ఉన్న బెంగాలీ అమ్మాయి మేఘా చౌదరి ప్లేస్‌లోకి శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్‌ని అనుకున్నారు. బోనీ ‘ఎస్’ అని ఉంటే.. జాహ్నవీనే ఫైనల్. కానీ కరెక్టేనా ఆమె ఎంపిక! కాదనిపించినట్లుంది. ఆమె ప్లేస్‌లోకి బినితా సంధూ వచ్చింది.అర్జున్‌రెడ్డి అబ్సెషన్లో ఉన్న ఇ4కి జాహ్నవి కన్నా మేఘ చౌదరే కరెక్ట్ అనిపించాలి. మేఘ పల్చగా ఉంటుంది కానీ, చూడ్డానికి షాలినీ పాండేలాగే ఉంటుంది. అదే కదా కావలసింది. మేఘలో ఇంకో ప్లస్.. కొత్త ముఖం. ఆ కొత్తదనం టికెట్లను అమ్మిపెడుతుంది. జాహ్నవి దేశం మొత్తానికీ తెలుసు. అలాంటప్పుడు రీల్ రీల్‌కీ కొత్తదనం ఉండే అర్జున్‌రెడ్డి థీమ్‌కి ఆమె ఎలా సెట్ అవుతుంది? ఇదే ఈక్వేషన్ పొరపాటున హిందీ అర్జున్‌రెడ్డి ‘కబీర్ సింగ్’కి పని చేస్తే కనుక అది ‘ఫట్’ అనే ప్రమాదం ఉంది. తెలుగు అర్జున్‌రెడ్డిలో విజయ్ దేవరకొండది ఫ్రెష్ ఫేస్. కబీర్ సింగ్‌లో షాహిద్ కపూర్ది సేమ్ ఓల్డ్ ఫేస్. అందులో హీరోయిన్ కైరా అద్వాని. (మొదట అనుకున్న పేరు అనన్యా పాండే). కైరా నటించింది నాలుగు సినిమాలే అయినా ఆమెనూ చాలాకాలంగా చూస్తున్నట్లనిపిస్తుంది. సందీప్ ధైర్యం ఏమిటో మరి! నిర్మాతలకేం పర్వాలేదు. వారికి సందీప్ ఉన్నాడన్న ధైర్యం ఉంది. ∙∙ జూన్‌లోనే విడుదల అవబోతున్న తమిళ్ అర్జున్‌రెడ్డి, హిందీ అర్జున్‌రెడ్డి.. తెలుగు అర్జున్‌రెడ్డిలా హిట్ అవుతాయా.. లేదా చెప్పలేం. కానీ తెలుగు అర్జున్‌రెడ్డి ట్రైలర్స్ వచ్చినప్పుడే చాలామంది చెప్పేశారు. ఇదేదో బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉందని. పిక్చర్ కోసం ఎదురు చూసేలా చేసిన ట్రైలర్స్ అవి. సినిమా అంతా అర్జున్‌రెడ్డి చుట్టూ తిరుగుతుంది. అర్జున్‌రెడ్డి సినిమా అంతా షాలిని చుట్టు తిరుగుతాడు. అర్జున్‌రెడ్డి గొంతు, అతడి మాట ఓ రకంగా ఉండడం కూడా ఆడియెన్స్‌కి ఎక్కింది. ట్రైలర్లో.. ‘‘చూడండీ.. మీకో విషయం చెప్పడానికొచ్చిన. అధ్యాపకురాలికి అర్థం గాకుండా, ఒక్క పదం ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను సరిగా వినండి’’ అని అర్జున్‌రెడ్డి.. క్లాస్‌రూమ్‌కి వెళ్లి చెప్పే సీన్, ఫుట్‌బాల్‌లో కోర్టులో ‘ఏయ్.. అమిత్’ అని పిలిచి అమిత్‌ని అర్జున్‌రెడ్డిని రెచ్చగొట్టే సీన్.. సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురు చూసేలా చేశాయి. అర్జున్‌రెడ్డి ట్రైలర్‌ని చూసిన కళ్లతో, వర్మా ట్రైలర్‌ని చూడలేకపోయారు ఆడియన్స్. తెలుగు ఆడియన్సే కాదు, తమిళ్ ఆడియన్స్ కూడా! బాలా సినిమాల్లోని సైకో సీన్లు, లస్ట్ సీన్లు చూస్తున్నట్లే ఉంది కానీ, కొత్తదనం లేదు. బాలా క్రియేటివ్ డైరెక్టర్. ఆయన్ని తీసుకొచ్చి తర్జుమా చేసి పెట్టి ‘గురూ నీ స్టయిల్లో చెయ్యి’ అంటే ఇలానే ఉంటుంది. గుడ్ డైరెక్టర్ రాంగ్ చాయిస్ అయ్యాడు. అర్జున్‌రెడ్డి లాంటి ‘కల్ట్’ మూవీలను సబ్ టైటిల్స్‌తో సరిపెట్టుకోవాలి. రీమేక్ చేసుకుంటే కల్ట్ మిస్ అయి, మూవీ మాత్రమే మిగులుతుంది. అర్జున్‌రెడ్డి హీరోయిన్లు తెలుగు: షాలినీ పాండే (25) చెప్పేదేముందీ! ప్రీతి క్యారెక్టర్‌కు భలే సరిపోయింది. అర్జున్‌రెడ్డి తొలి చిత్రం. ఆ తర్వాత నాలుగు చిత్రాల్లో నటించారు. మరో ఐదు చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళం: మేఘా చౌదరి (26) మేఘ బెంగాలీ అమ్మాయి. మోడల్. ఆరేడు తమిళ చిత్రాల్లో నటించారు. ‘వర్మా’లో లవర్ గర్ల్‌గా బాగా సెట్ అయ్యారు. ప్ఛ్. ఆ సినిమాను మళ్లీ తీస్తున్నారు. మళ్లీ ఆమెనే తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది కానీ, నిర్మాతలు జాహ్నవి వైపు చూస్తున్నారు. చివరికి బిన్నిత దగ్గర సెటిల్ అయ్యారు. జాహ్నవీ కపూర్ (21) ‘వర్మా’ రీషూట్‌లో మేఘకు బదులుగా జాహ్నవిని అనుకున్నారు. బాలీవుడ్ మూవీ ‘ధడక్’తో సినిమాల్లోకి వచ్చారు జాహ్నవి. ఎక్స్ప్రెషన్స్ ఇంకా కుదురుకోలేదు. అర్జున్‌రెడ్డిలోని లాస్ట్ సీన్లో (గర్భిణిగా ఉన్నప్పుడు అర్జున్‌రెడ్డితో పార్కులో ఎమోషనల్‌గా మాట్లాడే సీన్) ఆమె ఎలా చేస్తారన్నది రాబోయే డైరెక్టర్ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు జాహ్నవి లేదు. ఆమె స్థానంలోకే బనితా వచ్చింది. బనితా సంధూ (21) టీవీ సీరియళ్లు, డబుల్ మింట్ చూయింగ్ గమ్, ఓడాఫోన్ వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. పదకొండో ఏట నుంచే సీరియళ్లలో నటిస్తోంది. షూజిత్ సర్కార్ దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన ‘అక్టోబర్’ సినిమాలో నటించింది. అనన్యా పాండే (19) ఈ ఏడాది మే లో విడుదల అవుతున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంలో నటిస్తోంది. నటుడు చుంకీ పాండే కూతురు. కరణ్ జోహార్ తాజా చాట్ షోలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌పై ప్రస్తుతం ట్రోలింగ్ జరుగుతోంది. వాటిని తేలిగ్గా తీసుకుని నవ్వగలుగుతోంది అనన్య. హిందీ: కైరా అద్వానీ (26) ఈ నలుగురిలోనూ సీనియర్. ‘కబీర్ సింగ్’ హీరోయిన్. ఇప్పటికే ఆరు సినిమాల్లో నటించారు. మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ముఖంలో ముగ్ధత్వమేం కనిపించదు. పరిణతి ఉంటుంది. మరి అర్జున్‌రెడ్డి హీరోయిన్గా సరిపోతుందా! సందీప్ తంటాలు పడుతున్నాడుగా. పడనివ్వండి. -
ఆ పాటను అలా వాడటమేంటి?
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్‌పై మండిపడుతున్నారు. నెట్‌ప్లిక్స్ నిర్మించిన ‘లస్ట్ స్టోరీస్’ కోసం ఓ సన్నివేశంలో ఆమె పాడిన పాటను వాడటంపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లస్ట్ స్టోరీస్‌లో కైరా అద్వానీ(భరత్ అనే నేను ఫేమ్) పాత్ర మేఘకి సంబంధించిన ఎపిసోడ్‌కు కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భర్త నుంచి లైంగిక సంతృప్తి పొందలేక సతమతమయ్యే టీచర్ పాత్రలో కైరా నటించింది. ఈ ఫిలింలో ఆమె వైబ్రేటర్‌ను వాడే ఓ సన్నివేశం ఉంటుంది. అదే సమయంలో బ్యాక్ గ్రౌండ్లో కభీ ఖుషీ కభీ ఘమ్ టైటిల్ సాంగ్ వినిపిస్తుంటుంది. ఆ హిల్లేరియస్ సీన్ టోటల్‌గా లస్ట్ స్టోరీస్‌కే హైలెట్‌గా నిలిచింది. అయితే ఆ పాటను అలాంటి సన్నివేశంలో వాడటంపై లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ పాట భక్తి బ్యాక్ గ్రౌండ్లో వచ్చేది. పైగా ఇది తన చిత్రాల్లో ది బెస్ట్ సాంగ్‌గా కరణ్ ఎప్పుడూ చెప్పుకుంటాడు. అలాంటప్పుడు ఆ పాటను కరణ్.. అలాంటి టైంలో ఎందుకు వాడారో మాకు అర్థం కావట్లేదు. ఇది ముమ్మాటికీ లతా దీదీని అగౌరవపరచటమే. ఈ విషయంపై దీదీ కూడా విచారం వ్యక్తం చేశారు. కానీ, వయసురిత్యా ఆమె మీడియా ముందుకు రాలేకపోయారు. అందుకే ఆమె తరపున మేం కరణ్‌ను నిలదీస్తున్నాం’ అని బంధువు ఒకరు ఓ ప్రముఖ ఛానెల్‌తో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కరణ్ స్పందించాల్సి ఉంది. -
బిజీ షెడ్యుల్‌కు ముందు ప్రశాంతంగా చరణ్
రంగస్థలం సినిమాతో రికార్డుల దుమ్ము దులిపారు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. నాన్ బాహుబలి రికార్డులతో సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా ఈ చిత్రం నిల్చింది. ప్రస్తుతం రాంచరణ్, బోయపాటి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మొదటి షెడ్యుల్ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుని రెండో షెడ్యుల్ కోసం బ్యాంకాక్ వెళ్లింది చిత్రబృందం. అక్కడి బిజీ షెడ్యుల్‌లో పాల్గొంటున్న చెర్రీ సోమవారం ఉదయాన... ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న ఫోటోను ఆయన సతీమణి ఉపాసన ట్విటర్లో పోస్ట్ చేశారు. బ్యాంకాక్‌లో చెర్రీ, కైరా అద్వాణీలు వర్కౌట్లు చేస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. ఉదయం పూట .. చెర్రీ లాన్లో నిల్చొని కాఫీ తాగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఒక ఫోటోను ఉపాసన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘నిన్ను నువ్వు మార్చుకోవడానికి, పాజిటివ్ ఎనర్జీని పొందడానికి ఈ సమయం ఎంతో ప్రధానమైనది’ అంటూ ట్వీట్ చేశారు. A calm moment before a hectic day at shoot. #rc12 - so important to re connect with urself to channelise positive thoughts & energy. #haveagreatday #ramcharan #shootlifebalance pic.twitter.com/zOKYJftfpu — Upasana Kamineni (@upasanakonidela) May 21, 2018 -
అప్పుడు బాబాయ్...మరి ఇప్పుడు ?
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో శ్రీకాంత్ రామ్‌చరణ్‌కు బాబాయ్‌గా నటించాడు. మళ్లీ ఇప్పుడు బోయపాటి శ్రీను, రామ్‌చరణ్ సినిమాలో కూడా శ్రీకాంత్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని ముఖ్య పాత్రకు ఎవరైతే బాగుంటుందని డైరెక్టర్ ఆలోచిస్తుండగా... చెర్రీనే శ్రీకాంత్ పేరును సూచించాడట. మరి ఆ కీలక పాత్రలో శ్రీకాంత్, చరణ్‌కు ఏం అవుతాడో...గతంలో బాబాయ్‌గా నటించాడు. ఇప్పుడు ఏ పాత్రలో నటిస్తున్నాడో తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌కు సంబంధించి రెండు షెడ్యుల్స్ను కంప్లీట్ చేశాడు బోయపాటి. చరణ్ కూడా రెండో షెడ్యుల్ షూటింగ్లో పాల్గొన్నాడు. ప్రతినాయకుడు వివిక్ ఒబేరాయ్, చరణ్‌లపై వచ్చే యాక్షన్సీన్స్ను చిత్రీకరించారు. ఫ్యామిలీ, యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా కైరా అద్వానీ నటిస్తోంది. -
‘భరత్ అనే నేను’ రివ్యూ
టైటిల్ : భరత్ అనే నేను జానర్ : కమర్షియల్ డ్రామా తారాగణం : మహేష్ బాబు, కైరా అద్వానీ, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, బ్రహ్మాజీ, రావు రమేష్ తదితరులు సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ స్టోరీ-డైలాగులు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : కొరటాల శివ నిర్మాత : డీవీవీ దానయ్య టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన మహేష్ బాబుకు గత కొంత కాలంగా సరైన సక్సెస్ పడటం లేదు. ఈ క్రమంలో శ్రీమంతుడితో తనకు ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివతో మరోసారి మన ముందకు వచ్చాడు. కంప్లీట్ పొలిటికల్ అండ్ కమర్షియల్ డ్రామాగా కొరటాల దీనిని తెరకెక్కించాడు. పొలిటికల్ సబ్జెక్ట్.. పైగా ముఖ్యమంత్రి పాత్రను మహేష్ పోషించటం విశేషం. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఫలితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం .. కథ: భరత్ రామ్(మహేష్ బాబు)కు కొత్త విషయాలను నేర్చుకోవటమంటే చాలా ఇష్టం. అందుకే లండన్ ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు చేస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో తండ్రి రాఘవ(శరత్ కుమార్) మరణం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నవోదయం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎదిగిన రాఘవ మృతితో పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు రాజకీయ గురువు వరద(ప్రకాశ్ రాజ్) భరత్‌ను సీఎంను చేస్తాడు. అదుపు తప్పిన ప్రజా జీవితాన్ని భరత్ తన మొండి నిర్ణయాలతో గాడిన పెట్టే యత్నం చేస్తుంటాడు. భరత్ దూకుడు స్వభావం రాజకీయ వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడి కుమారుడి కేసులో భరత్‌కు తొలి ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రజల నుంచి భరత్‌కు మద్ధతు పెరుగుతున్నా.. సొంత పార్టీ నుంచే ప్రతిఘటన ఎదురవుతుంటుంది. ఈ పోరాటంలో భరత్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..? వాటన్నింటిని అధిగమించి భరత్ తన ప్రామిస్‌లను ఎలా పూర్తి చేస్తాడు? అన్నదే కథ. నటీనటులు భరత్ రామ్‌గా మహేష్ బాబు నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన కథను పూర్తిగా తన భుజాల మీదే నడిపించాడు. ముఖ్యమంత్రి పాత్రకు కావాల్సిన హుందాతనం చూపిస్తూనే, స్టైలిష్‌గా రొమాంటిక్‌గానూ ఆకట్టుకున్నాడు. తన కెరీర్లో మహేష్ క్లాస్ రోల్స్ చేసినప్పటికీ.. వాటిలో ఏదో వెలితిగా అనిపించేది. కానీ, భరత్‌గా ఓ ఛాలెంజింగ్ రోల్లో మహేష్ పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ పాత్రలో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయాడు. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సూపర్ స్టార్ అభిమానులను అలరిస్తాయి. ఇక గాడ్ ఫాదర్ పాత్రలో ప్రకాశ్ రాజ్ మెప్పించాడు. ఇలాంటి పాత్రలను తాను తప్ప మరెవరూ పోషించలేనన్న రీతిలో ఆయన నటించాడు. హీరోయిన్ గా పరిచయం అయిన కైరా అద్వానీది చిన్న పాత్రే.. అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. అందంతో పాటు అభినయంలోనూ మంచి మార్కులు సాధించింది. సీఎం భరత్ పర్సనల్ సెక్రటరీగా బ్రహ్మజీ.. పోసాని కామెడీ ట్రాక్‌లు ఆకట్టుకున్నాయి. శరత్ కుమార్, ఆమని, సితార, అజయ్, రావు రమేష్, దేవరాజ్, తమ పాత్రల మేర అలరించారు. విశ్లేషణ హ్యాట్రిక్ బ్లాక్బస్టర్లతో జోరు మీదున్న కొరటాల.. మహేష్‌తో చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. సమకాలీన రాజకీయ అంశాలు.. వాటికి తగ్గట్లు కమర్షియల్ అంశాలను జోడించి ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి ఏకంగా సీఎం అయిపోవటం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఇబ్బంది పెట్టడం, అసెంబ్లీలో సరదాగా సాగిపోయే సన్నివేశాలు... ఫస్టాఫ్‌ను ఎంటర్టైనింగ్గా మలిస్తే, దుర్గా మహల్ ఫైట్.. సామాజిక సందేశం, హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు... ఇవన్నీ సెకండాఫ్‌ను నిలబెట్టాయి. పది నిమిషాల్లో అసలు కథలోకి ఎంటర్ అయిన దర్శకుడు తరువాత కథనాన్ని నెమ్మదిగా నడిపించాడు. అయితే కొరటాల మార్క్ డైలాగ్స్, మహేష్ ప్రజెన్స్ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తాయి. సీఎం స్థాయి వ్యక్తి రోడ్డు మీద అమ్మాయిని చూసి ప్రేమించటం లాంటి విషయాల్లో కాస్త ఎక్కువగానే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కొరటాల గత చిత్రాల్లో కనిపించిన వీక్నెస్ ఈ సినిమాలో కూడా కొనసాగింది. క్లైమాక్స్ అభిమానులు ఆశించిన స్థాయిలో లేదు. భరత్ సీఎంగా రాజీనామా-తిరిగి పగ్గాలు చేపట్టడం లాంటి సన్నివేశాల్లో దర్శకుడు నాటకీయత ఎక్కువగా జోడించాడు. ఇక టెక్నీకల్ టీమ్ మంచి తోడ్పాటును అందించింది. సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్, తిర్రు టాప్ క్లాస్ పనితనాన్ని అందించారు. ముఖ్యంగా పాటలు, యాక్షన్స్ సీన్స్ పిక్చరైజేషన్స్ వావ్ అనిపిస్తుంది. దేవీ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మెప్పించాడు. ముఖ్యంగా ఒక్కో పాత్రకు ఒక్కో సిగ్నేచర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాత్రలను మరింతగా ఎలివేట్ చేశాడు శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. భరత్ పాత్ర.. దానిలో మహేష్ కనబరిచిన నటన.. కొరటాల అందించిన డైలాగులు ఇలా అన్ని హంగులు అన్నివర్గాల ప్రేక్షలను అలరించేవిగా ఉన్నాయి. ఫ్లస్ పాయింట్లు : మహేష్ బాబు కథా-కథనం పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకాలీన రాజకీయాంశాలను సమతుల్యంగా చూపించటం మైనస్ పాయింట్లు: స్లో నెరేషన్ సాగదీత సన్నివేశాలు క్లైమాక్స్ -
భరత్ అనే నేను మేకింగ్ వీడియో విడుదల
-
రొమాంటిక్ మూడ్‌లో భరత్
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కొత్త పోస్టర్లతో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్‌కు సంబంధించిన స్టిల్స్ ను మాత్రమే రిలీవ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా హీరోయిన్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహేష్ తో పాటు కైరా నడిచి వస్తున్న ఈ స్టిల్ సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేస్తోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈసినిమాతో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ప్రస్తుతం స్పెయిన్ లో సాంగ్స్ షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరగుతున్నాయి. ఏప్రిల్ 7న భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఈ సినిమాలోని రెండో పాటను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ పాటను ఆలపించిన బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌కు మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. -
మహేష్ సందడి మొదలవుతోంది
సాక్షి, సినిమా : గత రెండు చిత్రాలు తీవ్ర నిరాశ పరచటంతో భరత్ అనే నేనుతో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న కసితో సూపర్ స్టార్ మహేష్ బాబు పని చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ కమర్షియల్ డ్రామా షూటింగ్ దాదాపు ఆఖరు దశకు చేరుకుంది. ఇక ఈ వైవిధ్యంగా సాగుతున్న ఈ చిత్రం ప్రమోషన్లకు మంచి ఆదరణ లభిస్తుండగా.. ఇప్పుడవి ఓ కొలిక్కి వచ్చాయి. భరత్ అనే నేను నుంచి తొలి పాటను మార్చి 25న ఉదయం 10గంటలకు విడుదల చేయబోతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్ర పాటలను లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నారు. కైరా అద్వానీ మహేష్‌కు జోడీగా కనిపించబోతున్న భరత్ అనే నేను ఏప్రిల్ 20న విడుదల కాబోతున్న విషయం విదితమే. Launching our First Single from #BharatAneNenu, #TheSongOfBharatOn25th pic.twitter.com/jkz85k0gxX — #BharatAneNenu (@DVVEnts) 23 March 2018 -
మహేష్ అభిమానులకు బిగ్ న్యూస్
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన ఈ రోజు(బుధవారం) సాయత్రం వెలువడనుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ‘సూపర్ స్టార్ అభిమానులు సిద్ధంగా ఉండండి. భరత్ అనే నేను సినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్ ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు రానుంది’ అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ కానుంది. -
మహేష్ వరుసబెట్టి ఇచ్చేశాడు
సాక్షి, సినిమా : గణతంత్ర్య దినోత్సవ కానుకగా ‘భరత్... అను నేను’ పేరిట ఆడియో బిట్‌ను విడుదల చేసిన దర్శకుడు కొరటాల శివ మరికాసపేటికే ఇంకో ట్రీట్ ఇచ్చేశాడు. టైటిల్ లోగోతోపాటు మహేష్ లుక్కును కూడా రివీల్ చేస్తూ ఓ పోస్టర్ వదిలాడు. స్టైలిష్ అవతారంలో సీరియస్‌గా బ్యాగ్ పట్టుకుని ఆఫీస్‌లో నడుచుకుంటూ బయటకు వస్తున్న మహేష్ పోస్టర్ స్టన్నింగ్ గా ఉంది. ముఖ్యమంత్రి ఛాంబర్‌తో ఉన్న బ్యాక్ గ్రౌండ్ థీమ్ కూడా బాగుంది. ఇక ఇంతకాలం ఊరిస్తూ వస్తూ... మేకర్లు ఇప్పుడు ఒక్కోక్కటిగా వరుసపెట్టి వదులుతుండటంతో సూపర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం భరత్ అను నేను యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ప్రమోషన్లలో కూడా కాస్త వైవిధ్యం కనిపిస్తుండటం విశేషం. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న భరత్ అను నేను... ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Presenting the logo of #BharathAneNenu pic.twitter.com/eXMKVtDqry — #BharathAneNenu (@DVVEnts) 26 January 2018 Ladies & Gentlemen, meet Bharath#BharathAneNenu pic.twitter.com/LwaaEBEXYw — #BharathAneNenu (@DVVEnts) 26 January 2018 -
చరణ్, బోయపాటి మొదలెట్టేశారు..!
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా ప్రారంభించాడు. ఇప్పటికే రంగస్థలం షూటింగ్ దాదాపుగా పూర్తి కావటంతో తరువాతి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు చరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన కొత్త సినిమాను శుక్రవారం మొదలు పెట్టాడు. ఈ సినిమాలో చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాపై రకరకాల వార్తలు టాలీవుడ్ లో హల్చల్ చేశాయి. ఈ సినిమా మల్టీ స్టారర్ జానర్లో తెరకెక్కనుందన్న టాక్ తో పాటు సినిమా ఆగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తున్న రంగస్థలం సినిమా టీజర్‌ను జనవరి 24న విడుదల చేయనున్నారు. -
రామ్ చరణ్‌తో మహేష్ హీరోయిన్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి నెలాఖరున రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి కైరా అద్వాని కనిపించనుందట. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్న కైరా నెక్ట్స్ చరణ్ తో జోడి కట్టేందుకు ఓకె చెప్పిందని తెలుస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
అడిగితే నేనే మంచి పోజులు ఇచ్చేదాన్ని!
‘‘నిజం కాదు... నేను బీటౌన్ యాక్టర్ సూరజ్ పాంచోలితో డేటింగ్ చేస్తున్నానన్న వార్త నిజం కాదు’’ అంటున్నారు హీరోయిన్ కియారా అద్వానీ. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న సినిమాలో ఈ భామనే కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘మీ గురించి వచ్చే వదంతులకు ఎలా రెస్పాండ్ అవుతారు?’ అని కియారాని అడిగితే– ‘‘ఇలాంటి స్టోరీలు బేస్‌లేస్ అండ్ అన్ట్రూ అని తెలుసు. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఈ విషయం గురించి సూరజ్, నేను డిస్కస్ చేసుకుని నవ్వుకున్నాం. ఆల్మోస్ట్ 45 డేస్ బ్యాక్ మేమిద్దరం కలిసి ఉన్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. నిజానికి ఆ రోజు లంచ్ మీట్లో మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకో తెలీదు. మేం ఇద్దరం ఉన్న ఫొటోలు మాత్రమే బయటకి వచ్చాయి. కొందరు మాకు తెలియకుండా ఫొటోలు తీశారు. ఆ అవసరం ఏమీ లేదు. అడిగితే నేనే మంచి మంచి పోజులు ఇచ్చేదాన్ని’’ అని చెప్పారు. మరి.. ప్రభుదేవా దర్శకత్వంలో సూరజ్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారట అన్న ప్రశ్నకు – ‘‘ప్రజెంట్ నేను ఏ సినిమాకి సైన్ చేయలేదు. డిస్కషన్స్ జరుగుతున్నాయి. సౌత్ స్టార్ మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నాను. ఫిబ్రవరి, మార్చి వరకు నాకు ఖాళీ అన్నమాటే లేదు’’ అన్నారు కియారా. -
హాట్ మోడల్‌తో మహేష్..?
ప్రస్తుతం మురుగదాస్‌తో చేస్తున్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని మహేష్, తరువాత చేయబోయే సినిమాకు మాత్రం ఏర్పాట్లు చేసేసుకుంటున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ 23న తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని నిర్ణయించారు. పరిణితీ చోప్రా, దిశాపటానీ లాంటి వారి పేర్లు వినిపించినా.. ఎవరినీ ఫైనల్ చేయలేదు. తాజాగా ఓ హాట్ మోడల్‌ను హీరోయిన్గా కన్ఫామ్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మాగ్జిమ్ మాగ్జైన్ ఫోటో షూట్‌తో ఆకట్టుకున్న కైరా అద్వానీని మహేష్, కొరటాల సినిమాకు హీరోయిన్గా తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఫగ్లీ, ఎంఎస్ ధోని సినిమాల్లో హోమ్లీ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న కైరా, త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న మెషీన్ సినిమాలో గ్లామరస్ లుక్‌లో కనిపిస్తోంది. బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ లేకపోయినా.. హాట్ ఫోటోషూట్స్‌తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. త్వరలోనే మహేష్, కొరటాల శివ సినిమా హీరోయిన్‌పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.