
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి నెలాఖరున రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత‍్వంలో నటించనున్నాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి కైరా అద్వాని కనిపించనుందట. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్న కైరా నెక్ట్స్ చరణ్ తో జోడి కట్టేందుకు ఓకె చెప్పిందని తెలుస్తోంది. డివివి ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment