
టాలీవుడ్‌లోని స్టార్ హీరోల మధ్య స్నేహం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఒకరి చిత్రాలను మరొకరు అభినందిస్తూ ప్రమోట్ చేయటం.. పార్టీల్లో సందడి చేస్తుండటం... ఇగోలు లేకుండా ఒకరి ఈవెంట్లకు మరొకరు హాజరవుతుండటం... చివరకు తాము బాగానే ఉంటాం.. ఇక ఫ్యాన్సే బాగుండాలి అని పిలుపునిచ్చే వరకు పరిస్థితి చేరింది. గత సాయంత్రం భరత్ బహిరంగసభ(ప్రీ రిలీజ్ ఈవెంట్)లో సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు.
అయితే ఈవెంట్ అయ్యాక చిత్ర యూనిట్ ఓ స్టార్ హోటల్‌లో పార్టీ ఏర్పాటు చేసింది. దానికి మహేష్, తారక్‌లతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యాడు. నిజానికి భరత్ అనే నేను ప్రీ రిలీజ్ పంక్షన్‌కు చెర్రీ కూడా హాజరవుతాడన్న టాక్ ఒకటి నడిచింది. అయితే కారణం ఏంటో తెలీదుగానీ.. అది జరగలేదు. కానీ, పార్టీకి మాత్రం అటెండ్ అయి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు. దీంతో ఈ ముగ్గురు స్టార్ హీరోలు కలిసి చేసిన సందడి.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment