ఒకే వేదికపై మహేష్, చరణ్, తారక్‌ | Jr Ntr And Ram Charan Guest For Bharat Ane Nenu Pre Release | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 31 2018 2:15 PM | Last Updated on Thu, May 10 2018 12:13 PM

Jr Ntr And Ram Charan Guest For Bharat Ane Nenu Pre Release - Sakshi

ఏప్రిల్‌ 7న టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ అరుదైన సన్నివేశం చూసే అవకాశం కలగనుందట. ముగ్గురు టాప్‌ హీరోలు ఒకే వేదిక మీద కలవనున్నారన్న టాక్ వినిపిస్తోంది. సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భరత్‌ అనే నేను. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లను ఆహ్వనించే యోచనలో ఉన్నారట భరత్‌ అనే నేను చిత్రయూనిట్‌.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్‌ లో రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా మల్టీస్టారర్‌ తెరకెక్కనుంది. దీంతో మహేష్ సినిమా వేడుకకు చరణ్, తారక్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్న వార్తకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై యూనిట్ సభ్యులు మాత్రం స్పందించలేదు. మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement