RRR Trailer: Super Star Mahesh Babu Interesting Comments on RRR Movie Trailer - Sakshi
Sakshi News home page

Mahesh Babu: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌పై ఆసక్తిగా స్పందించిన మహేశ్‌ బాబు

Published Fri, Dec 10 2021 1:55 PM | Last Updated on Fri, Dec 10 2021 2:33 PM

Mahesh Babu Tweet On RRR Movie Trailer And Praise Movie Team - Sakshi

Mahesh Babu Comments on RRR Movie Trailer: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌`. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ గురువారం విడుదల చేసింది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్‌ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఈ ట్రైలర్‌పై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. దీనిపై మెగాస్టార్‌ చిరంజీవి కూడా ‘ఈ ట్రైలర్ బీభత్సాన్ని సృష్టించింది.. ఇక ప్రభంజనం కోసం జనవరి 7వ తేదీ వరకూ ఎదురుచూస్తుంటాను’ అంటూ ట్రైలర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్‌ రవి తల్లి షాకింగ్‌ కామెంట్స్‌, అవమానించారంటూ ఫైర్‌

అలాగే స‌మంత‌, అనీల్ రావిపూడి, కోన వెంక‌ట్, అనీల్ రావిపూడి వంటి ప్ర‌ముఖులు కూడా త‌మ‌దైన శైలిలో స్పందించారు. ఈ రోజు ఉద‌యం సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ బాబు ప్ర‌శంస‌లు కురిపించాడు. కాస్తా ఆలస్యమైన ట్రైలర్‌పై మహేశ్‌ బాబు లెటెస్ట్‌గా స్పందించాడు. ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘ట్రైలర్‌లో ప్రతి ఒక్క షాట్ స్టన్నింగ్‌గా ఉంది. మైండ్ బ్లోయింగ్ అండ్ స్పెక్టాక్యూలర్‌గా ఈ ట్రైలర్ ఉంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి గూస్ బంప్స్ వ‌చ్చేలా ట్రైల‌ర్ మ‌న ముందుకు తెచ్చాడు’ అంటూ హీరోలకు, దర్శకుడితో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ టీంపై ప్రశంసలు కురిపించాడు. 

చదవండి: మంచు లక్ష్మిపై ఆర్జీవీ ప్రశంసలు, మురిసిపోతున్న నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement