RRR Movie: Mega Star Chiranjeevi First Reaction After Watching RRR Movie Deets Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi : 'RRR మూవీ మాస్టర్ పీస్, మైండ్‌ బ్లోయింగ్‌'.. చిరు కామెంట్స్‌ వైరల్‌

Published Fri, Mar 25 2022 4:52 PM | Last Updated on Sat, Mar 26 2022 4:02 PM

Mega Star Chiranjeevi First Reaction After Watching RRR Movie - Sakshi

Megastar Chiranjeevi Review On RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. సూపర్‌ హిట్‌ టాక్‌తో ఏ థియేటర్‌ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇక రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హంగామా గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొమురం భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ​ నటనకు జనం నీరాజనాలు పడుతున్నారు. దేశం నలువైపుల నుంచి మూవీ టీంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

సినీ ప్రేక్షకుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ సినిమా వీక్షించిన చిరంజీవి ట్విట్టర్‌లో తన రివ్యూను పంచుకున్నారు. 'మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్ ఆర్ఆర్ఆర్ చిత్రం. రాజమౌళి సినిమాటిక్ విజన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మొత్తానికి హ్యాట్సాఫ్' అంటూ మూవీ టీంపై చిరు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement