మహేష్ అభిమానులకు బిగ్‌ న్యూస్‌ | Update on Mahesh Bharath Ane nenu at 6pm today | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 28 2018 1:37 PM | Last Updated on Thu, May 10 2018 12:13 PM

Update on Mahesh Bharath Ane nenu at 6pm today - Sakshi

‘భరత్‌ అనే నేను’ సినిమాలో మహేష్ బాబు

వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం భరత్‌ అనే నేను సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన ఈ రోజు(బుధవారం) సాయత్రం వెలువడనుంది.

ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ‘సూపర్‌ స్టార్ అభిమానులు సిద్ధంగా ఉండండి. భరత్‌ అనే నేను సినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్ ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు రానుంది’ అంటూ ఓ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement