లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్‌పై మండిపడుతున్నారు. నెట్‌ప్లిక్స్ నిర్మించిన ‘లస్ట్ స్టోరీస్’ కోసం ఓ సన్నివేశంలో ఆమె పాడిన పాటను వాడటంపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లస్ట్ స్టోరీస్‌లో కైరా అద్వానీ(భరత్ అనే నేను ఫేమ్) పాత్ర మేఘకి సంబంధించిన ఎపిసోడ్‌కు కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భర్త నుంచి లైంగిక సంతృప్తి పొందలేక సతమతమయ్యే టీచర్ పాత్రలో కైరా నటించింది. ఈ ఫిలింలో ఆమె వైబ్రేటర్‌ను వాడే ఓ సన్నివేశం ఉంటుంది. అదే సమయంలో బ్యాక్ గ్రౌండ్‌లో కభీ ఖుషీ కభీ ఘమ్ టైటిల్ సాంగ్ వినిపిస్తుంటుంది. ఆ హిల్లేరియస్ సీన్ టోటల్‌గా లస్ట్ స్టోరీస్‌కే హైలెట్‌గా నిలిచింది. అయితే ఆ పాటను అలాంటి సన్నివేశంలో వాడటంపై లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
‘ఆ పాట భక్తి బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చేది. పైగా ఇది తన చిత్రాల్లో ది బెస్ట్ సాంగ్‌గా కరణ్ ఎప్పుడూ చెప్పుకుంటాడు. అలాంటప్పుడు ఆ పాటను కరణ్.. అలాంటి టైంలో ఎందుకు వాడారో మాకు అర్థం కావట్లేదు. ఇది ముమ్మాటికీ లతా దీదీని అగౌరవపరచటమే. ఈ విషయంపై దీదీ కూడా విచారం వ్యక్తం చేశారు. కానీ, వయసురిత్యా ఆమె మీడియా ముందుకు రాలేకపోయారు. అందుకే ఆమె తరపున మేం కరణ్‌ను నిలదీస్తున్నాం’ అని బంధువు ఒకరు ఓ ప్రముఖ ఛానెల్‌తో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కరణ్ స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment