అడిగితే నేనే మంచి పోజులు ఇచ్చేదాన్ని! | Kiara Advani on link-up rumours with Sooraj Pancholi: 'I am not dating Sooraj' | Sakshi
Sakshi News home page

అడిగితే నేనే మంచి పోజులు ఇచ్చేదాన్ని!

Published Mon, Dec 11 2017 1:52 AM | Last Updated on Mon, Dec 11 2017 1:52 AM

Kiara Advani on link-up rumours with Sooraj Pancholi: 'I am not dating Sooraj' - Sakshi

‘‘నిజం కాదు... నేను బీటౌన్‌ యాక్టర్‌ సూరజ్‌ పాంచోలితో డేటింగ్‌ చేస్తున్నానన్న వార్త నిజం కాదు’’ అంటున్నారు హీరోయిన్‌ కియారా అద్వానీ. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న సినిమాలో ఈ భామనే కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘మీ గురించి వచ్చే వదంతులకు ఎలా రెస్పాండ్‌ అవుతారు?’ అని కియారాని అడిగితే– ‘‘ఇలాంటి స్టోరీలు బేస్‌లేస్‌ అండ్‌ అన్‌ట్రూ అని తెలుసు. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఈ విషయం గురించి సూరజ్, నేను డిస్కస్‌ చేసుకుని నవ్వుకున్నాం.

ఆల్మోస్ట్‌ 45 డేస్‌ బ్యాక్‌ మేమిద్దరం కలిసి ఉన్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. నిజానికి ఆ రోజు లంచ్‌ మీట్‌లో మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకో తెలీదు. మేం ఇద్దరం ఉన్న ఫొటోలు మాత్రమే బయటకి వచ్చాయి. కొందరు మాకు తెలియకుండా ఫొటోలు తీశారు. ఆ అవసరం ఏమీ లేదు. అడిగితే నేనే మంచి మంచి పోజులు ఇచ్చేదాన్ని’’ అని చెప్పారు. మరి.. ప్రభుదేవా దర్శకత్వంలో సూరజ్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారట అన్న ప్రశ్నకు – ‘‘ప్రజెంట్‌ నేను ఏ సినిమాకి సైన్‌ చేయలేదు. డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. సౌత్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నాను. ఫిబ్రవరి, మార్చి వరకు నాకు ఖాళీ అన్నమాటే లేదు’’ అన్నారు కియారా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement