Suraj Pancholi
-
‘సుశాంత్‌లా చేస్తానేమోనని మా అమ్మ భయం’
నటి జియా ఖాన్ మరణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను నటుడు సూరజ్ పంచోలి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికి దీని విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్యకు, సూరజ్ పంచోలికి సంబంధం ఉందనే వార్తలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన వీటి మీద స్పందించారు. ఇవన్ని తప్పుడు వార్తలు అని కొట్టి పారేశారు. ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో సూరజ్ పలు విషయాలపై స్పందించారు. ఈ సందర్భంగా సూరజ్ పంచోలి దిశా సలియన్ అనే అమ్మాయిని తాను ఇంత వరకు కలవలేదని స్పష్టం చేశారు. అనవసరంగా తనను దిశ కేసులోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్ని తప్పుడు వార్తలని కొట్టి పారేశారు. ఇప్పటికే తన మీద ఓ కేసు నడుస్తుందని.. దాని వల్ల ఇండస్ట్రీలో అతి కొద్ది మంది మాత్రమే తనతో పని చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వార్తల వల్ల తన జీవితం మరింత నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పంచోలి. జియా ఖాన్ కేసు ప్రారంభం అయ్యి ఇప్పటికే 8 సంవత్సరాలు పూర్తయ్యాయని.. కానీ తీర్పు మాత్రం ఇంకా వెల్లడించలేదన్నారు పంచోలి. జియా తల్లి రబియా ఖాన్ వల్లే ఈ ఆలస్యం జరుగుతుందని తెలిపారు. కానీ ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికి తాను స్థిరంగా, సానుకులంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఈ విషయాల గురించి తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనని తెలిపారు. ఇప్పటికే వారు తన విషయంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారని.. వారిని మరింత ఇబ్బంది పెట్టడం తనకిష్టం లేదన్నారు పంచోలి. (వేధింపులు ఎక్కువయ్యాయి: దిశ తండ్రి) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య గురించి తెలిసి తన తల్లి ఎంతో భయపడిందన్నారు పంచోలి. తాను కూడా అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటానేమోనని ఆమె ఆందోళన చెందిందని తెలిపారు. దాంతో ఆమె తనను పిలిచి.. నీ మనసులో ఏదైనా బాధ ఉంటే మాతో చెప్పు. ఏం జరిగినా కూడా ఇలాంటి తీవ్ర నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని ధైర్యం చెప్పారని తెలిపారు పంచోలి. ఇండస్ట్రీలోకి రావడానికి తాను ఎంతో కష్టపడ్డానని వెల్లడించారు పంచోలి. ఈ రంగం అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. మానవత్వం లేనివారు, సెన్స్ లేనివారే తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా తన జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పంచోలి. (నొప్పిలేని మరణం ఎలా?) -
‘హవా సింగ్’ ఫస్ట్ లుక్
బాక్సర్‌గా రింగ్‌లో పంచ్‌లు ఇవ్వడానికి ఫుల్‌గా పాలు తెగి రెడీ అవుతున్నారు బాలీవుడ్ యువ హీరో సూరజ్ పంచోలి. ఇదంతా సూరజ్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘హవా సింగ్’ కోసమే. ప్రకాష్ నంబియార్ దర్శకత్వంలో కమ్లేష్ సింగ్, సామ్స్ ఫెర్నాండెజ్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ‘హవా సింగ్’ సినిమా ఫస్ట్ లుక్‌ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. 2015లో సల్మాన్ ఓ నిర్మాతగా వ్యవహరించిన హిందీ చిత్రం ‘హీరో’తోనే సూరజ్ సినీ ప్రస్థానం మొదలైన సంగతి తెలిసిందే. ఇక.. æహవా సింగ్ విషయానికి వస్తే.. ఆయన హర్యానాకి చెందిన బాక్సర్. ఇండియన్ హెవీ వెయిట్ బాక్సర్‌గా ఆసియన్ గేమ్స్ (1966, 1970)లో గోల్డ్ మెడల్స్ సాధించారు. అంతేకాదు.. హెవీ వెయిట్ క్యాటగిరీలో పదకొండుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. ‘‘హవా సింగ్’ బయోపిక్‌లో నటించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సూరజ్. -
బాలీవుడ్ కాలింగ్
కథానాయికగా సౌత్‌లో మంచి పేరు సంపాదించుకుని కొత్త కొత్త ఆఫర్లను చేజిక్కించుకుంటున్నారు చెన్నై బ్యూటీ మేఘా ఆకాష్. ఇప్పుడామె నార్త్ సైడ్ కన్నేశారు. అవును... మేఘా ఆకాష్‌కు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. సూరజ్ పాంచోలి హీరోగా ఇర్ఫాన్ కమల్ దర్శకత్వంలో హిందీలో రూపొందుతున్న సినిమా ‘శాటిలైట్ శంకర్’. ఇందులోనే కథానాయికగా ఎంపికయ్యారు మేఘా ఆకాశ్. ఇంతకుముందు ‘థ్యాంక్స్ మా’ చిత్రానికి దర్శకునిగా వర్క్ చేశారు కమల్. ‘‘బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ సినిమా విభిన్నమైనది. పెద్ధ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని మేఘా ఆకాష్ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మేఘా ఆకాష్ అయితే సరిగ్గా సరిపోతారని ఆమెను ఎంపిక చేయడం జరిగింది’’ అన్నారు దర్శకుడు కమల్. ఈ సంగతి ఇలా ఉంచితే.. లై, ఛల్ మోహన్‌రంగ సినిమాలతో తెలుగు తెరపై మెరిసిన మేఘా ఇప్పుడు తమిళంలో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘పేట్టా’ సినిమాలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. అలాగే ధనుష్ హీరోగా నటించిన ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ తమిళంలో మేఘా నెక్ట్స్ రిలీజ్. ఈ చిత్రాలే కాకుండా మరో రెండు రెండు తమిళ ప్రాజెక్ట్‌లు మేఘా బ్యాంక్‌లో ఉన్నాయి. ఇలా మేఘా బిజీ బిజీ. -
కేరాఫ్ కత్రినా
ఇట్స్ టైమ్ టు డ్యాన్స్ అంటున్నారు కొత్త హీరోయిన్ ఇసబెల్లే కైఫ్. ఇంతకీ.. ఈ ఇసబెల్లే కైఫ్ ఎవరో తెలుసా? కేరాఫ్ కత్రినా కైఫ్! అదేనండీ.. కత్రినా కైఫ్ సిస్టర్ అని చెప్తున్నాం. స్టాన్లీడ్ కోస్తాస్ దర్శకత్వంలో సూరజ్ పాంచోలి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘టైమ్ టు డ్యాన్స్’. ఈ సినిమా షూటింగ్ లండన్‌లో స్టార్ట్ అయ్యింది. టైటిల్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఫుల్ డ్యాన్స్ బేస్డ్ మూవీ అని. మరి... ఓన్ సిస్టర్ సినిమా అంటే కత్రినా ఊరుకోరు కదా. అందుకే... ‘‘కంగ్రాట్యులేషన్స్ టు ఇస్సీ’’ అని తనదైన స్టైల్లో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. కెరీర్ స్టార్టింగ్‌లో డ్యాన్స్‌తో ఇబ్బంది పడ్డారు కత్రినా. ఇప్పుడు ఆమె చెల్లెలు ఏమో డైరెక్ట్‌గా డ్యాన్స్ బేస్డ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. -
అడిగితే నేనే మంచి పోజులు ఇచ్చేదాన్ని!
‘‘నిజం కాదు... నేను బీటౌన్ యాక్టర్ సూరజ్ పాంచోలితో డేటింగ్ చేస్తున్నానన్న వార్త నిజం కాదు’’ అంటున్నారు హీరోయిన్ కియారా అద్వానీ. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న సినిమాలో ఈ భామనే కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘మీ గురించి వచ్చే వదంతులకు ఎలా రెస్పాండ్ అవుతారు?’ అని కియారాని అడిగితే– ‘‘ఇలాంటి స్టోరీలు బేస్‌లేస్ అండ్ అన్ట్రూ అని తెలుసు. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఈ విషయం గురించి సూరజ్, నేను డిస్కస్ చేసుకుని నవ్వుకున్నాం. ఆల్మోస్ట్ 45 డేస్ బ్యాక్ మేమిద్దరం కలిసి ఉన్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. నిజానికి ఆ రోజు లంచ్ మీట్లో మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకో తెలీదు. మేం ఇద్దరం ఉన్న ఫొటోలు మాత్రమే బయటకి వచ్చాయి. కొందరు మాకు తెలియకుండా ఫొటోలు తీశారు. ఆ అవసరం ఏమీ లేదు. అడిగితే నేనే మంచి మంచి పోజులు ఇచ్చేదాన్ని’’ అని చెప్పారు. మరి.. ప్రభుదేవా దర్శకత్వంలో సూరజ్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారట అన్న ప్రశ్నకు – ‘‘ప్రజెంట్ నేను ఏ సినిమాకి సైన్ చేయలేదు. డిస్కషన్స్ జరుగుతున్నాయి. సౌత్ స్టార్ మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నాను. ఫిబ్రవరి, మార్చి వరకు నాకు ఖాళీ అన్నమాటే లేదు’’ అన్నారు కియారా. -
సోనమ్ చెత్త నటి... సూరజ్ చెత్త నటుడు
‘దిల్వాలే’ చెత్త సినిమా... సూరజ్ బర్జాత్యా చెత్త దర్శకుడు ‘అండ్ ది బెస్ట్ యాక్టర్ అవార్డ్ గోస్ టు...’ అనే మాట విన్నప్పుడు ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. అదే ‘అండ్ ది వరస్ట్ అవార్డ్ గోస్ టు...’ అనే మాట వింటే ఇబ్బందిగానే ఉంటుంది. అసలీ రకం అవార్డులను తీసుకోవడానికి కూడా దాదాపు ఎవరూ ముందుకు రాకపోవచ్చు. కానీ, ‘గోల్డెన్ కేలా’ అవార్డ్స్ పేరిట హిందీ చిత్ర పరిశ్రమలోని చెత్త సినిమాలు, నటీనటులను ఎంపిక చేసి, అవార్డులు ఇస్తున్నారు. ఇది గడచిన ఏడేళ్లుగా జరుగుతోంది. అదృష్టం ఏమిటంటే, మన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ఇలాంటి అపకీర్తి కిరీటాలకు పెద్ద బాధపడకుండా, స్పోర్టివ్‌గా తీసుకుంటారు. తాజాగా గత ఏడాది విడుదలైన హిందీ చిత్రాల్లో చెత్త అవార్డు విజేతల వివరాల జాబితా వెలువడింది. ఉత్తమ చెత్త నటుడిగా ‘హీరో’ ఫేమ్ సూరజ్ పంచోలి, చెత్త నటిగా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో నటించిన సోనమ్ కపూర్ ఎంపికయ్యారు. ఇక, షారుక్‌ఖాన్, కాజోల్ నటించిన ‘దిల్వాలే’ చెత్త చిత్రంగా నిలిచింది. ఇటీవల జాతీయ అవార్డు సాధించిన ‘బాజీరావ్ మస్తానీ’ కూడా ఓ అవార్డు దక్కించుకుంది. అదేంటంటే చారిత్రక ఘట్టాన్ని వక్రీకరించి చూపించినందుకు గాను వ్యంగ్యంగా ‘హిస్టారికల్’ ఆక్యురసీ అనే పురస్కారానికి ఎంపిక చేశారు. ఇంకా ఈ అవార్డుల్లో ఉన్న వ్యక్తులు, సినిమాలు, పాటల గురించి చెప్పాలంటే... చెత్త దర్శకుడు: సూరజ బర్జాత్యా (ప్రేమ్ రతన్ ధన్ పాయో), బాగా చీరాకు తెప్పించే పాట: ప్రేమ్ రతన్ ధన్ పాయో (ప్రేమ్ రతన్ ధన్ పాయో), పరమ చెత్త పాట: బర్త్‌డే బ్యాష్ (గీత రచయిత: అల్ఫాజ్), అర్థం పర్థం లేని రీమేక్: ఎంఎస్‌జీ 2, ఇంకా సినిమాల్లో ఎందుకున్నాడో తెలియని నటుడు: ఇమ్రాన్‌ఖాన్. వరస్ట్ యాక్సెంట్: రణ్‌దీప్ హుడా (మై ఔర్ చార్లెస్), బస్ కీ జీయే బహుత్ హో గయా (ఇప్పటికే చాలా ఎక్కువైంది...ఇక ఆపండి) అవార్డు: సూరజ్ బర్జాత్యా వాట్ ద హెల్: సోనాక్షీ సిన్హా (సోనాక్షి మ్యూజిక్ ఆల్బమ్: ఇష్క్‌హోలిక్) -
ఆత్మహత్యకు ముందు 400 నిమిషాల ఫోన్ కాల్!
హీరోయిన్ జియాఖాన్‌ది ఆత్మహత్యేనని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. అయితే, ఆత్మహత్య చేసుకోడానికి ముందురోజు రాత్రి ఆమె సూరజ్ పాంచోలీకి ఫోన్ చేసిందని, ఆ కాల్ దాదాపు 400 నిమిషాల పాటు కొనసాగిందని సీబీఐ చెబుతోంది. నటుడు సూరజ్ పాంచోలితో సంబంధాలు చెడిపోవంతో ఆమె 2013 జూన్ 3న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణులు ఆమె మరణానికి కారణం ఆత్మహత్యేనని తేల్చారని, పోస్టుమార్టం చేసిన వైద్యుడి నివేదికతో కూడా ఇది సరిపోయిందని సీబీఐ స్పష్టం చేసింది. జియా ఖాన్ రాసిన సూసైడ్ నోట్‌ను కూడా ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించారని, సంతకం పెట్టకుండా మూడు పేజీలలో రాసిన ఆ లేఖ ఆమె మానసిక స్థితికి అద్దం పడుతోందని సీబీఐ తెలిపింది. సీనియర్ నటులు ఆదిత్య పాంచోలి, జరీనా వహాబ్‌ల కొడుకైన సూరజ్ పాంచోలీపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసులు పెట్టారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఈ కేసు పెట్టారు. అంతేతప్ప ఇది హత్య మాత్రం కాదని తేలింది. నిందితుడి ప్రవర్తనను, అతడితో తనకున్న సన్నిహిత సంబంధాన్ని, శారీరక, మానసిక హింసను అన్నింటినీ నఫీసా రిజ్వీ అలియాస్ జియాఖాన్ తన సూసైడ్ నోట్లో వివరంగా రాసింది. వాటివల్లే ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందు వరకు ఆమె సూరజ్ ఇంట్లోనే ఉంది. ఇద్దరి మధ్య మొబైల్ ఫోన్లో బాగా వాగ్యుద్ధం జరిగిందని, ఇద్దరికీ తెలిసిన ఓ అమ్మాయిని కలిసిన విషయంపై అతడు అబద్ధం చెప్పినట్లు ఆమె ఆరోపించిందని కూడా అంటున్నారు. ఆమె పదే పదే మెసేజిలు చేయడంతో.. తన మొబైల్లో జియా బ్లాక్ బెర్రీ మెసెంజర్ అకౌంటును సూరజ్ పాంచోలి డిలిట్ చేసేశాడని కూడా సీబీఐ పేర్కొంది. తర్వాత జియాఖాన్ అర్ధరాత్రి సమయంలో అతడికి ఫోన్ చేయగా మరోసారి ఇద్దరిమధ్య వాగ్యుగద్ధం నడిచింది. ఆ కాల్ దాదాపు 400 నిమిషాలు కొనసాగింది. తల్లి రబియా ఇంటికి తిరిగి వచ్చేసరికే జియా ఖాన్ తన బెడ్ రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దాంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు. -
ఆ సినిమా అద్భుతం: మహేశ్ బాబు
ఒకనాటి బాలీవుడ్ హీరో ఆదిత్య పాంచోలీ కుమారుడు సూరజ్ పాంచోలీ, సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి జంటగా బాలీవుడ్లో విడుదలైన 'హీరో' సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించాడు. తాను ఆ సినిమా చూశానని తెలిపాడు. సినిమా పరిశ్రమకు ఇద్దరు ప్రామిసింగ్ స్టార్లు సూరజ్ పాంచోలీ, అతియాశెట్టిలను పరిచయం చేసినందుకు సల్మాన్ ఖాన్‌కు థాంక్స్ చెప్పాల్సిందేనని మహేశ్ అన్నాడు. సినిమా యూనిట్ మొత్తం చాలా బాగా పనిచేసిందని, అందరికీ అభినందనలంటూ ట్వీట్ చేశాడు. మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 13.47 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. Saw 'hero '. Thanks to salman for giving the industry 2 promising stars Suraj Pancholi and Athiya shetty . — Mahesh Babu (@urstrulyMahesh) September 13, 2015 Congratulations to the entire team ..a job well done :) — Mahesh Babu (@urstrulyMahesh) September 13, 2015 -
ఆత్మహత్య కాదు... హత్యే!
ముంబై: తన కుమార్తె మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ నటి జియాఖాన్ తల్లి రబియా అమిన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలుచేశారు. జియా ఆత్మహత్య చేసుకోలేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రబియా తరఫు న్యాయవాది దినేశ్ తివారి శుక్రవారం వెల్లడించారు.తన వాదనకు బలం చేకూరేవిధంగా రబియా ... ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇచ్చిన నివేదికను పిటిషన్‌కు జత చేశారు. పోలీసులు సరైనరీతిలో దర్యాప్తు జరపలేదని, అంతేకాకుండా తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పంచోలీకి పరోక్షంగా సహకరించారని రబియా ఆరోపించారు. ఆదిత్య పంచోలి కుమారుడైన సూరజ్ పంచోలి పోలీసులను తనవైపునకు తిప్పుకున్నాడన్నారు. ఇది హత్యే అయినప్పటికీ ఆత్మహత్యను తలపించేలా చేశారనేందుకు తనవద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని తన పిటిషన్లో రబియా పేర్కొన్నారు. హత్య చేసిన అనంతరం జియాను వేలాడదీసి ఉండొచ్చన్నారు. ఇటువంటి కేసుల్లో మెదడులో రక్తం గడ్డ కడుతుందని, అయితే ఈ కేసు విషయంలో అటువంటిదేమీ లేదన్నారు. జియా ముఖంతోపాటు ఆమె శరీర భాగాలపై గాయాలుండడాన్ని గమనించొచ్చన్నారు. పెదానికి కుడివైపు, ఎడమచేయిపైనా గాయాలు ఉన్నాయని, దీనినిబట్టి ఆమెను ఎవరో కదలకుండా కట్టివేసి ఉండొచ్చన్నారు. అయితే జియా దుపట్టాతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారని, ఉరి తీయడం వల్లనే జియా శరీరంపై లోతైన గుర్తులు ఏర్పడ్డాయని, మెత్తటి వస్తువులతో బిగిస్తే అటువంటి గుర్తులు రావని ఫోరెన్సిక్ నిపుణుడు రంగరాజన్ తన నివేదికలో పేర్కొన్నారని జియా తన పిటిషన్లో కోర్టుకు తెలియజేశారు. జియా గొంతు పిసికి ఉండొచ్చంటూ పేర్కొన్నారన్నారు. ఆత్మహత్యకు కొద్దిక్షణాల ముందే జియా తన గదిలోకి వచ్చిందని, ఆ సమయంలో ట్రాక్ సూట్లో ఉన్నట్టు సీసీటీవీ కెమెరాల్లో నమోదైందని, అయితే మృతదేహంపై నైట్ గౌన్ ఉందని, ఆత్మహత్య చేసుకునేందుకు ఎవరైనా దుస్తులు మార్చుకుంటారా అంటూ ప్రశ్నించారు. రెండు సింగిల్ బెడ్ల మధ్య సీలింగ్ ఫ్యాన్ ఉందని, ఏదో వస్తువు లేకుండా ఆత్మహత్య ఎలా సాధ్యమని పిటిషనర్ ప్రశ్నించారు.