సోనమ్ చెత్త నటి... సూరజ్ చెత్త నటుడు
‘దిల్‌వాలే’ చెత్త సినిమా... సూరజ్ బర్జాత్యా చెత్త దర్శకుడు
‘అండ్ ది బెస్ట్ యాక్టర్ అవార్డ్ గోస్ టు...’ అనే మాట విన్నప్పుడు ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. అదే ‘అండ్ ది వరస్ట్ అవార్డ్ గోస్ టు...’ అనే మాట వింటే ఇబ్బందిగానే ఉంటుంది. అసలీ రకం అవార్డులను తీసుకోవడానికి కూడా దాదాపు ఎవరూ ముందుకు రాకపోవచ్చు. కానీ, ‘గోల్డెన్ కేలా’ అవార్డ్స్ పేరిట హిందీ చిత్ర పరిశ్రమలోని చెత్త సినిమాలు, నటీనటులను ఎంపిక చేసి, అవార్డులు ఇస్తున్నారు. ఇది గడచిన ఏడేళ్లుగా జరుగుతోంది. అదృష్టం ఏమిటంటే, మన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ఇలాంటి అపకీర్తి కిరీటాలకు పెద్ద బాధపడకుండా, స్పోర్టివ్‌గా తీసుకుంటారు.
తాజాగా గత ఏడాది విడుదలైన హిందీ చిత్రాల్లో చెత్త అవార్డు విజేతల వివరాల జాబితా వెలువడింది. ఉత్తమ చెత్త నటుడిగా ‘హీరో’ ఫేమ్ సూరజ్ పంచోలి, చెత్త నటిగా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో నటించిన సోనమ్ కపూర్ ఎంపికయ్యారు. ఇక, షారుక్‌ఖాన్, కాజోల్ నటించిన ‘దిల్‌వాలే’ చెత్త చిత్రంగా నిలిచింది. ఇటీవల జాతీయ అవార్డు సాధించిన ‘బాజీరావ్ మస్తానీ’ కూడా ఓ అవార్డు దక్కించుకుంది. అదేంటంటే చారిత్రక ఘట్టాన్ని వక్రీకరించి చూపించినందుకు గాను వ్యంగ్యంగా ‘హిస్టారికల్’ ఆక్యురసీ అనే పురస్కారానికి ఎంపిక చేశారు. ఇంకా ఈ అవార్డుల్లో ఉన్న వ్యక్తులు, సినిమాలు, పాటల గురించి చెప్పాలంటే...
చెత్త దర్శకుడు: సూరజ బర్జాత్యా (ప్రేమ్ రతన్ ధన్ పాయో), బాగా చీరాకు తెప్పించే పాట: ప్రేమ్ రతన్ ధన్ పాయో (ప్రేమ్ రతన్ ధన్ పాయో), పరమ చెత్త పాట: బర్త్‌డే బ్యాష్ (గీత రచయిత: అల్ఫాజ్), అర్థం పర్థం లేని రీమేక్: ఎంఎస్‌జీ 2, ఇంకా సినిమాల్లో ఎందుకున్నాడో తెలియని నటుడు: ఇమ్రాన్‌ఖాన్.
వరస్ట్ యాక్సెంట్: రణ్‌దీప్ హుడా (మై ఔర్ చార్లెస్),
బస్ కీ జీయే బహుత్ హో గయా (ఇప్పటికే చాలా ఎక్కువైంది...ఇక ఆపండి) అవార్డు: సూరజ్ బర్జాత్యా
వాట్ ద హెల్: సోనాక్షీ సిన్హా (సోనాక్షి మ్యూజిక్ ఆల్బమ్: ఇష్క్‌హోలిక్)