Worst Award
-
భారత్‌కు ఆప్తుడు.. స్వదేశంలో మాత్రం ఘోర అవమానం!
క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మృతి పట్ల క్రీడాలోకం అశ్రు నివాళి అర్పిస్తోంది. 52 ఏళ్ల వయసులోనే హఠాన్మరణం చెందిన వార్న్‌పై క్రికెట్‌కు అతీతంగా అన్ని వైపుల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. అలాంటి వార్న్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల నుంచి వార్న్‌తో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. భారత్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న వార్న్‌కు ఒక సందర్భంలో మాత్రం సొంత దేశంలో ఘోర అవమానం జరిగింది. ఇది 2012 నాటి మాట. ఆ దేశానికి చెందిన జూ వీక్లీ అనే మ్యాగజైన్.. వార్న్‌ను ఘోరంగా అవమానించింది. షేన్ వార్న్.. బ్రిటీష్ మోడల్.. నటి లిజ్ హర్లేతో జరిపిన ప్రేమాయణమే ముఖ్య అంశంగా తీసుకొని ఆ ఏడాదికి గాను ''అన్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్‌గా'' పరిగణించింది. లిజ్ హార్లేతో రిలేషన్ సమయంలో వార్న్ ఒక ప్లేబాయ్‌గా మారిపోయాడని.. విచ్చలవిడిగా తినడం.. తాగడం.. తిరగడం చేసేవాడని తెలిపింది. 42 ఏళ్ల వయసులో నవ మన్మథుడిగా ముద్రించుకోవడం అతనికే చెల్లిందంటూ మ్యాగజైన్ అవమానపరుస్తూ రాసుకొచ్చింది. క్రికెట్లో ఎంత పేరు సంపాదించాడో.. ఆటకు వెలుపల అన్నే వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి. ఆటలో ఏనాడు ఒక మచ్చ కూడా లేని ఈ దిగ్గజం బయట మాత్రం వివాదాలకు కేంద్ర బింధువుగా మారాడు. 2006లో భార్య సిమోన్‌తో విడాకుల అనంతరం వార్న్ నడిపిన రాసలీలలకు అంతే లేదు. చాలా మంది అమ్మాయిలకు పర్సనల్‌గా అసభ్యకర సందేశాలు పంపుతూ ఎప్పుడు వార్తల్లో ఉండేవాడు. చదవండి: Shane Warne Demise:'ఇప్పటికీ షాక్‌లోనే.. జీవితం మనం ఊహించినట్లు ఉండదు' Shane Warne: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చెత్త సినిమా ప్రియాంకదే!
లాస్ ఏంజిల్స్ : ప్రియాంక చోప్రా హాలీవుడ్లో నటించిన తొలి చిత్రం బేవాచ్ చెత్తసినిమాల జాబితాలో టాప్‌లో నిలిచింది. ప్రతి ఏడాది చెత్త సినిమాలకు ర్యాంకులనిచ్చే గోల్డెన్ రాస్బెర్రి 'వరస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్' జాబితాలో 2017 ఏడాదికిగానూ బేవాచ్ ఎంపికైంది. చెత్త సినిమా, చెత్త స్క్రీన్ ప్లే, చెత్త రీమేక్, సీక్వెల్, చెత్త నటుడు కేటగిరీల్లో బేవాచ్‌ను ఎంపిక చేశారు. ప్రియాంక చోప్రా, డ్వేన్ జాన్సన్ లు జంటగా తెరకెక్కిన బేవాచ్ గత ఏడాది మే లో రిలీజ్ అయ్యింది. అయితే బుల్లితెర మీద ఘనవిజయం సాధించిన ఈ స్టోరి వెండితెర మీద మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బేవాచ్ ఫ్లాప్ అయినా అందులో ప్రియాంక నటనకు మంచి మార్కులేపడ్డాయి. ఆ తర్వాత వచ్చిన క్వాంటికో సిరీస్‌లోనూ తన నటనతో ప్రియాంక అంతర్జాతీయ స్థాయిలో స్టార్ స్టేటస్ అందుకున్న విషయం తెలిసిందే. చెత్త సినిమా విభాగంలో నామినీలు బేవాచ్ ది ఈమోజీ మూవీ ఫిఫ్టీ షేడ్స్ డార్కర్ ది మమ్మీ ట్రాన్స్ ఫార్మర్స్ : ది లాస్ట్ నైట్ చెత్త హీరోయిన్ విభాగంలో నామినీలు కేథరిన్ హిగ్(అన్ఫర్గటబుల్) డకోటా జాన్సన్(ఫిఫ్టీ షేడ్స్ డార్కర్) జెన్నీఫర్ లారెన్స్(మథర్) టైలర్ పెర్రీ(బూ 2 ఏ మాడీ హల్లోవీన్) చెత్త నటుల విభాగంలో నామినీలు టామ్ క్రూస్ (ది మమ్మీ) జాన్ డెప్ ( పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్స్ : డెడ్ మెన్ టెల్ నో టేల్స్) జామీ డోర్నన్ (ఫిఫ్టీ షేడ్స్ డార్కర్) జాక్ ఎఫ్రాన్ (బేవాచ్) మార్క్ వేల్ బర్గ్( డాడీస్ హోమ్ 2, ట్రాన్స్ ఫార్మర్స్ : ది లాస్ట్ నైట్) -
సోనమ్ చెత్త నటి... సూరజ్ చెత్త నటుడు
‘దిల్వాలే’ చెత్త సినిమా... సూరజ్ బర్జాత్యా చెత్త దర్శకుడు ‘అండ్ ది బెస్ట్ యాక్టర్ అవార్డ్ గోస్ టు...’ అనే మాట విన్నప్పుడు ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. అదే ‘అండ్ ది వరస్ట్ అవార్డ్ గోస్ టు...’ అనే మాట వింటే ఇబ్బందిగానే ఉంటుంది. అసలీ రకం అవార్డులను తీసుకోవడానికి కూడా దాదాపు ఎవరూ ముందుకు రాకపోవచ్చు. కానీ, ‘గోల్డెన్ కేలా’ అవార్డ్స్ పేరిట హిందీ చిత్ర పరిశ్రమలోని చెత్త సినిమాలు, నటీనటులను ఎంపిక చేసి, అవార్డులు ఇస్తున్నారు. ఇది గడచిన ఏడేళ్లుగా జరుగుతోంది. అదృష్టం ఏమిటంటే, మన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ఇలాంటి అపకీర్తి కిరీటాలకు పెద్ద బాధపడకుండా, స్పోర్టివ్‌గా తీసుకుంటారు. తాజాగా గత ఏడాది విడుదలైన హిందీ చిత్రాల్లో చెత్త అవార్డు విజేతల వివరాల జాబితా వెలువడింది. ఉత్తమ చెత్త నటుడిగా ‘హీరో’ ఫేమ్ సూరజ్ పంచోలి, చెత్త నటిగా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో నటించిన సోనమ్ కపూర్ ఎంపికయ్యారు. ఇక, షారుక్‌ఖాన్, కాజోల్ నటించిన ‘దిల్వాలే’ చెత్త చిత్రంగా నిలిచింది. ఇటీవల జాతీయ అవార్డు సాధించిన ‘బాజీరావ్ మస్తానీ’ కూడా ఓ అవార్డు దక్కించుకుంది. అదేంటంటే చారిత్రక ఘట్టాన్ని వక్రీకరించి చూపించినందుకు గాను వ్యంగ్యంగా ‘హిస్టారికల్’ ఆక్యురసీ అనే పురస్కారానికి ఎంపిక చేశారు. ఇంకా ఈ అవార్డుల్లో ఉన్న వ్యక్తులు, సినిమాలు, పాటల గురించి చెప్పాలంటే... చెత్త దర్శకుడు: సూరజ బర్జాత్యా (ప్రేమ్ రతన్ ధన్ పాయో), బాగా చీరాకు తెప్పించే పాట: ప్రేమ్ రతన్ ధన్ పాయో (ప్రేమ్ రతన్ ధన్ పాయో), పరమ చెత్త పాట: బర్త్‌డే బ్యాష్ (గీత రచయిత: అల్ఫాజ్), అర్థం పర్థం లేని రీమేక్: ఎంఎస్‌జీ 2, ఇంకా సినిమాల్లో ఎందుకున్నాడో తెలియని నటుడు: ఇమ్రాన్‌ఖాన్. వరస్ట్ యాక్సెంట్: రణ్‌దీప్ హుడా (మై ఔర్ చార్లెస్), బస్ కీ జీయే బహుత్ హో గయా (ఇప్పటికే చాలా ఎక్కువైంది...ఇక ఆపండి) అవార్డు: సూరజ్ బర్జాత్యా వాట్ ద హెల్: సోనాక్షీ సిన్హా (సోనాక్షి మ్యూజిక్ ఆల్బమ్: ఇష్క్‌హోలిక్)