చెత్త సినిమా ప్రియాంకదే! | Baywatch Nominated For Worst Film Of The Year | Sakshi
Sakshi News home page

చెత్త సినిమా ప్రియాంకదే!

Published Sat, Jan 27 2018 6:20 PM | Last Updated on Sat, Jan 27 2018 6:20 PM

Baywatch Nominated For Worst Film Of The Year - Sakshi

లాస్‌ ఏంజిల్స్‌ : ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం బేవాచ్‌ చెత్తసినిమాల జాబితాలో టాప్‌లో నిలిచింది. ప్రతి ఏడాది చెత్త సినిమాలకు ర్యాంకులనిచ్చే గోల్డెన్‌ రాస్‌బెర్రి 'వరస్ట్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్' జాబితాలో 2017 ఏడాదికిగానూ బేవాచ్‌ ఎంపికైంది. చెత్త సినిమా, చెత్త స్క్రీన్‌ ప్లే, చెత్త రీమేక్‌, సీక్వెల్‌, చెత్త నటుడు కేటగిరీల్లో బేవాచ్‌ను ఎంపిక చేశారు.  

ప్రియాంక చోప్రా, డ్వేన్ జాన్సన్ లు జంటగా తెరకెక్కిన బేవాచ్ గత ఏడాది మే లో రిలీజ్ అయ్యింది. అయితే బుల్లితెర మీద ఘనవిజయం సాధించిన ఈ స్టోరి వెండితెర మీద మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.  బేవాచ్‌ ఫ్లాప్‌ అయినా అందులో ప్రియాంక నటనకు మంచి మార్కులేపడ్డాయి. ఆ తర్వాత వచ్చిన క్వాంటికో సిరీస్‌లోనూ తన నటనతో ప్రియాంక అంతర్జాతీయ స్థాయిలో స్టార్ స్టేటస్ అందుకున్న విషయం తెలిసిందే. 

చెత్త సినిమా విభాగంలో నామినీలు
బేవాచ్‌
ది ఈమోజీ మూవీ
ఫిఫ్టీ షేడ్స్‌ డార్కర్‌
ది మమ్మీ
ట్రాన్స్‌ ఫార్మర్స్‌ : ది లాస్ట్‌ నైట్‌

చెత్త హీరోయిన్‌ విభాగంలో నామినీలు
కేథరిన్‌ హిగ్‌(అన్‌ఫర్గటబుల్‌)
డకోటా జాన్సన్‌(ఫిఫ్టీ షేడ్స్‌ డార్కర్‌)
జెన్నీఫర్‌ లారెన్స్‌(మథర్‌)
టైలర్‌ పెర్రీ(బూ 2 ఏ మాడీ హల్లోవీన్‌)

చెత్త నటుల విభాగంలో నామినీలు
టామ్‌ క్రూస్‌ (ది మమ్మీ)
జాన్‌ డెప్‌ ( పైరెట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్స్‌ : డెడ్‌ మెన్‌ టెల్‌ నో టేల్స్‌)
జామీ డోర్నన్‌ (ఫిఫ్టీ షేడ్స్‌ డార్కర్)
జాక్‌ ఎఫ్రాన్‌ (బేవాచ్‌)
మార్క్‌ వేల్‌ బర్గ్‌( డాడీస్‌ హోమ్‌ 2, ట్రాన్స్‌ ఫార్మర్స్‌ : ది లాస్ట్‌ నైట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement