
ఇసబెల్లే కైఫ్
ఇట్స్ టైమ్ టు డ్యాన్స్ అంటున్నారు కొత్త హీరోయిన్ ఇసబెల్లే కైఫ్. ఇంతకీ.. ఈ ఇసబెల్లే కైఫ్ ఎవరో తెలుసా? కేరాఫ్ కత్రినా కైఫ్! అదేనండీ.. కత్రినా కైఫ్ సిస్టర్ అని చెప్తున్నాం. స్టాన్లీడ్ కోస్తాస్ దర్శకత్వంలో సూరజ్ పాంచోలి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘టైమ్ టు డ్యాన్స్’. ఈ సినిమా షూటింగ్ లండన్‌లో స్టార్ట్ అయ్యింది.
టైటిల్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఫుల్ డ్యాన్స్ బేస్డ్ మూవీ అని. మరి... ఓన్ సిస్టర్ సినిమా అంటే కత్రినా ఊరుకోరు కదా. అందుకే... ‘‘కంగ్రాట్యులేషన్స్ టు ఇస్సీ’’ అని తనదైన స్టైల్లో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. కెరీర్ స్టార్టింగ్‌లో డ్యాన్స్‌తో ఇబ్బంది పడ్డారు కత్రినా. ఇప్పుడు ఆమె చెల్లెలు ఏమో డైరెక్ట్‌గా డ్యాన్స్ బేస్డ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment