
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ వివాహం డిసెంబర్ 9న సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే కత్రినా కైఫ్ తన పెళ్లిలో ధరించిన లెహంగాను డిజైనర్ సబ్యసాచి వజ్రాలు, ముత్యాలతో ఎంతలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారో వివరించింది. అంతేకాదు ఆ వివాహతంతులో ఆమె తన ఆరుగురు సోదరీమణులతో మహారాణీలా ఎంతో అందంగా రాజసం ఉట్టిపడేలా నడుస్తున్న ఫోటోలను సోషల్ మీడీయాలో పోస్ట్ చేసింది.
(చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!)
తన బలం తన సోదరీలేనని మా బంధం ఎప్పటికీ ఇలానే ధృఢంగా ఉండాలంటూ భావోద్వేగానికి లోనైంది. ఈ మేరకు కత్రినా తన పెళ్లిలో తన ఆరుగురి సోదరీమణులతో కలిసిన దిగిన ఫోటోల తోపాటు "మా సోదరీమణులు ఎల్లప్పుడూ ఒకరినొకరు రక్షించుకుంటాము. మేము ఎప్పుడూ ఒకరికొకరు అండంగా ఉంటాం... ఇది ఎల్లప్పుడూ అలాగే ఉండనివ్వండి!" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మీరు కూడా ఓ లుక్ వేయండి.
(చదవండి: పెళ్లి చేసుకోమని అడిగినందుకు... గొంతు కోసి చంపేశాడు!)
Comments
Please login to add a commentAdd a comment