Isabelle Kaif
-
సల్మాన్ బావ... కత్రినా చెల్లి!
ఇండియా–మయన్మార్ బోర్డర్ పరిసర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు సల్మాన్‌ఖాన్ బావ ఆయుష్ శర్మ. ఆయుష్కు తోడుగా కత్రినా కైఫ్ చెల్లెలు ఇసాబెల్లా కైఫ్ కూడా వెళ్లనున్నారు. ఓ సినిమా కోసం ఇద్దరూ ఇలా తోడయ్యారు. ఈ చిత్రానికి కరణ్ భూతాని దర్శకత్వం వహిస్తారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. ఇందులో నేను ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నాను. ఈ పాత్ర కోసం ఫిజికల్‌గా బాగా కష్టపడుతున్నాను. ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు ఆయుష్ శర్మ. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలీవుడ్లో ఇసాబెల్లాకు ఇది రెండో చిత్రం. ఇంతకు ముందు ‘టైమ్ టు డ్యాన్స్’ అనే సినిమా కమిట్ అయ్యారామె. ఇది చిత్రీకరణలో ఉండగానే రెండో సినిమాకి అవకాశం తెచ్చుకోగలిగారు. -
కేరాఫ్ కత్రినా
ఇట్స్ టైమ్ టు డ్యాన్స్ అంటున్నారు కొత్త హీరోయిన్ ఇసబెల్లే కైఫ్. ఇంతకీ.. ఈ ఇసబెల్లే కైఫ్ ఎవరో తెలుసా? కేరాఫ్ కత్రినా కైఫ్! అదేనండీ.. కత్రినా కైఫ్ సిస్టర్ అని చెప్తున్నాం. స్టాన్లీడ్ కోస్తాస్ దర్శకత్వంలో సూరజ్ పాంచోలి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘టైమ్ టు డ్యాన్స్’. ఈ సినిమా షూటింగ్ లండన్‌లో స్టార్ట్ అయ్యింది. టైటిల్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఫుల్ డ్యాన్స్ బేస్డ్ మూవీ అని. మరి... ఓన్ సిస్టర్ సినిమా అంటే కత్రినా ఊరుకోరు కదా. అందుకే... ‘‘కంగ్రాట్యులేషన్స్ టు ఇస్సీ’’ అని తనదైన స్టైల్లో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. కెరీర్ స్టార్టింగ్‌లో డ్యాన్స్‌తో ఇబ్బంది పడ్డారు కత్రినా. ఇప్పుడు ఆమె చెల్లెలు ఏమో డైరెక్ట్‌గా డ్యాన్స్ బేస్డ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. -
చెల్లెలి కోసం సాహసం
సినిమా నిర్మాణమంటే మాటలు కాదు. డబ్బులొక్కటే ఖర్చు పెడితే చాలదు... ఆర్టిస్టుల డేట్స్ దగ్గర్నుంచి ప్రొడక్షన్ వర్క్, రిలీజ్ వరకూ సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయి. ఓ సినిమా నిర్మిస్తే పెద్ద సాహసం చేసినట్టే. అదే హీరోయిన్గా అయితే... షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రమోషన్స్‌కి వస్తే చాలు. ఇవన్నీ కత్రినా కైఫ్‌కి తెలుసు. తెలిసీ చెల్లెలి కోసం సాహసం చేయడానికి సన్నద్ధమవుతున్నారట. కత్రినా చెల్లెలు ఇసబెల్లె కైఫ్‌కి తన అక్కలా హీరోయిన్ కావాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. ఆ కోరిక కెనడియన్ సినిమా ‘డాక్టర్ కాబి’తో తీరింది. దానికి సల్మాన్ ఖాన్ సహ నిర్మాత. ఇప్పుడు ఇసబెల్లేకి హిందీ హీరోయిన్ కావాలనే ఆశ పట్టుకుంది. సల్మాన్‌ఖాన్ ఆమెను హీరోయిన్గా పరిచయం చేయనున్నారని వార్తలొచ్చాయి. తాజా ఖబర్ ఏంటంటే... చెల్లెలి కోసం కత్రినా నిర్మాణ సంస్థను స్థాపిస్తున్నారట. ప్రస్తుతం కథలు కూడా వింటున్నారట. తాజా ఇంటర్వ్యూలో చెల్లెలు గురించి కత్రినాను అడగ్గా.. ‘‘ఇప్పటివరకూ ఏదీ ఫైనలైజ్ కాలేదు. ఏదొక రోజు నా చెల్లెలి కోసం నేనే ఓ సినిమా నిర్మిస్తా’’ అన్నారు. అనుష్కా శర్మ, ప్రియాంక చోప్రా, దియా మీర్జా... ఇలా నిర్మాతలుగా మారిన కథానాయికల జాబితాలో కత్రినా కైఫ్ చేరే రోజు త్వరలోనే వస్తుందన్నమాట. -
బాలీవుడ్‌కు కత్రినా కైఫ్ సోదరి దూరం
తొలుత బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేయాలని భావించిన నటి కత్రినా కైఫ్ సోదరి ఇసబెల్ ఆ ఆలోచనను విరమించుకుంది. కత్రిన బాలీవుడ్ కాకుండా మరిదేనిపైనా ఆసక్తి చూపనివిధంగానే ఇసబెల్ కూడా ఇక్కడికి రావాలని తొలుత భావించినా తన నిర్ణయాన్ని మార్చుకుందని ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడొకరు తెలియజేశారు. దాదాపు ఒకేరకంగా ఉండే తాము ఇదే రంగంలో కొనసాగలేమని కత్రినా భావించిందని తెలిపారు. ఇషాబెల్లే తన మాదిరిగానే ఉండకూడదని కత్రినా భావిస్తున్నట్టు చెప్పారు. అందువల్ల ఇసబెల్ బాలీవుడ్‌కు బదులు అంతర్జాతీయంగానే తన కెరీర్లో ముందుకు సాగిపోవాలని వారి కుటుంబం భావిస్తోందన్నారు. డాక్టర్ క్యాబీ సినిమా కెనడా ప్రాజెక్టు. ఆ సినిమాను స్టార్టర్‌గా ఇసబెల్ భావిస్తోంది. టైటిల్ రోల్‌ను వినయ్ వీరమణి పోషిస్తున్నప్పటికీ ఇసబెల్ అతని సరసన నటించడం లేదు. సినిమా స్క్రిప్టు నచ్చడంతో ఆమె అందులో భాగస్వామిగా మాత్రమే ఉంది. విదేశీ సినిమాల్లో దూసుకుపోతున్న కునాల్ అయ్యర్‌కూడా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. కొత్త నటులను పరిచయం చేసే సమయంలో ఆడిషన్ తీసుకున్న మాదిరిగానే ఈ సినిమా కోసం ఇసబెల్ ఇసబెల్ ఆడిషన్ కూడా తీసుకున్నారు. ఇక ఇసబెల్పై ఆమె సహనటుడు వినయ్ వీరమణి ప్రశంసల జల్లు కురిపించాడు. ఆమె సినిమాలకు అతికినట్టు సరిపోతుందన్నాడు. కత్రినాలోని లక్షణాలన్నీ ఇసబెల్లోనూ ఉన్నాయన్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే నటిగా ఒక్కసారిగా ఎదిగిపోవాలనే తొందరపాటుతనం ఆమెలో కనిపించడం లేదన్నాడు.